జగన్నాటకం-2

అదపాదడపా అంతర్జాలంలోనూ,కొద్ది మంది స్నేహితుల మధ్య సంభాషణలలోనూ ఈ మధ్య తరచుగా వినబడుతున్నమాట 'ఏదిఏమైనా జగన్ మగాడు,సగటు కాంగ్రెస్ వాదుల్లాగా సోనియాకు దాసోహమనకుండా ,ఆమె మీద విమర్శనాస్త్రాలెక్కుపెడుతూ ,125 సం: చరిత్రగల కాంగ్రెస్ పార్టీకు సవాల్ గా మారాడని. ఈ అభిప్రాయం సమంజసమా కాదా అనేది పరిశీలిద్దాం.
విదేశీ వనిత అనే విషయాన్ని పక్కకుపెడితే సోనియా ను విమర్శించేవాళ్ళ ముఖ్య అభియోగాలేమిటి?1) కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి పాతరేసి ,రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అన్ని పదవులలో తన ఇష్టం వచ్చిన నాయకులను కూర్చోబెడుతుంది.2) ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమైన కుటుంబపాలన తో పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. 3)మన్మోహన్ సింగ్ లాంటి కీలుబొమ్మలను పదవిలో కూర్చోబెట్టి ,కీలకనిర్ణయాలన్నీ తను తీసుకొంటూ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధానిని బాధ్యుడిని చేస్తూ, పార్టీ మరియు ప్రభుత్వ విజయాలను తన ఖాతాలో వేసుకొంటుంది. 4) కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను,కేంద్ర మంత్రులను తన కలక్షన్ ఏజెంట్లుగా వాడుకొంటూ అవినీతి కూపంలో మునిగిపోయింది.
రాశేరె ఆరేళ్ళ పాలనలో మన రాష్ట్రంలో జరిగిన నిర్వాకం ఏమిటి? తన అనుయాయులను యోగ్యతాయోగ్యతలతో నిమిత్తం లేకుండా కీలక పదవుల్లో కూర్చోబెట్టిన సంఘటనలు కోకొల్లలు.కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రాజకీయ ఆరంగేట్రం చేసినవాడు,తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అక్రమార్జన చేసినవాడు,ప్రజా సమస్యల గురించి ఏనాడూ ఉద్యమించనివాడు,ఏమాత్రం రాజకీయానుభవం లేనివాడు,చనిపోయిన ముఖ్యమంత్రి వారసుడుగా మాత్రమే లోకానికి తెలిసినవాడు,ముఖ్యమంత్రి పదవినాశించడం ఏవిధంగా సమర్ధనీయం?
2004 ఎన్నికల్లో మరియు 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటానికి తన తండ్రే కారణమనే వితండవాదంతో,తన గొంతెమ్మ కోర్కె సోనియా తీర్చలేదనే అక్కసుతో, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి,పార్టీను,అధ్యక్షురాలిని దూషిస్తున్నాడు.సైధ్ధాంతికంగా,నైతికంగా,ప్రజాసేవాపరంగా ముఖ్యమంత్రి పదవినధిష్టించడానికి ఏరకంగా అర్హుడు?సోనియాగాంధీ తన కుటుంబాన్ని చీల్చిందని అభియోగం మోపుతున్నాడుగాని ,అది అబధ్ధమని జగన్ బాబాయి ఎన్నో మార్లు వివరణ ఇచ్చుకున్నాడు.ఇంత జరిగినా సోనియా, జగన్ ను పిలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే జై సోనియా అనడా? ఆమె ముందు మోకరిల్లడా?
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే తన తండ్రి పాలనను మరపిస్తానని,స్వర్ణయుగం తెస్తానని,30 ఏళ్ళు నిర్విఘ్నంగా పరిపాలిస్తానని అంటున్నాడు .అవినీతి,కుంభకోణాలు,ఆశ్రితపక్షపాతం,వనరుల దోపిడీ,వ్యవస్థల కుప్పకూల్చడం లాంటి పనులన్నీ యధేచ్ఛగా చేస్తానని హెచ్చరించడమన్నమాట.
సిధ్ధాంతాల ప్రాతిపదికన,నైతిక విలువలకోసం లేక ప్రజా హితం కోసం సోనియాను ఎదురిస్తున్నాడా? లేక తన స్వార్ధ ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ,తన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికో,తన ముఠాసభ్యులతో రాష్ట్రాన్ని మరింత దోచుకోవడంకోసం ఈ అలజడి సృష్టిస్తున్నాడా? ప్రజాస్వామ్యవాదులు,సమాజం అభివృధ్ధిపధంలో పయనించాలని కోరుకునే అభ్యుదయవాదులు,చదువుకొన్న సంస్కారవంతులు,ఇటువంటి అఘాయిత్యాలకు అంతిమంగా బలయ్యే అమాయక ప్రజానీకం , పై రెండు ప్రశ్నలలో ఒక సమాధానాన్ని ఎంచుకొని జగన్ పయనిస్తున్న బాట హర్షనీయమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.
(ఈ వ్యాసం నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గ దర్శ్యకత్వంలో వ్రాసినది.)

జగన్నాటకం-1

రాశేరె బావ మరిది రవీంద్రనాథరెడ్డి 17 డిసెంబర్ కడపలో మాట్లాడుతూ ,రాశేరె మరణం ప్రమాదవశాత్తూ కాదని,సోనియా రిలయన్సులు కుమ్మక్కై చేసిన హత్యగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం ఒక సిబీఇ అధికారి స్వయంగా జగనుకు చెప్పినట్లు తెలియపర్చారు.అదే రోజు జగన్ పులివెందులలో మాట్లాడుతూ తన తండ్రి మరణం గురించి జనం అందరికీ సందేహాలున్నాయని ,అదే విషయం సాక్షి పేపర్ లో మరియు టీవీ చానల్ లో వస్తే సాక్షి ఆఫీసులో పోలీసులు సోదాలు చేశారని ,ఆవిషయం అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను అడిగితే అధీష్ఠానం ఆదేశాల మేరకే అలా చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చుకొన్నట్లు కూడా తెలియజేశారు.సాక్షిలో ఈ విషయం గురించి చెబితే తప్పేమిటని దబాయించారు.జగన్ అబ్బ రాజారెడ్డి ఎంతోమంది అమాయకులను కడప, అనంతపూర్ జిల్లాలలో హతమారిస్తే,ఆకుటుంబాల వ్యధ గురించి ఒక్క క్షణమన్నా ఆలోచించారా?
అందరి ఆలోచనా ధోరణి తనలాగే ఉంటుందని జగన్ భావిస్తూ ఉన్నాడు.తండ్రి ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ పాపాన్ని సోనియా మరియు అంబానీల కాపాదిస్తున్నారంటే వాళ్ళిద్దరినీ తన ప్రత్యర్థులుగానే భావిస్తున్నాడన్నమాట. సోనియాగాంధీ తను అడగంగానే ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పలేదు గనుక ఆమె మీద దుగ్ధ వుండటం సహజమే,మరి అంబానీలను జగన్ తన ప్రత్యర్థులుగా ఎందుకు భావిస్తున్నట్లు?రాశేరె,జగన్ రిలయన్స్ గ్యాస్ లో వాటాలడిగినట్లు గా పుకార్లు వచ్చాయి. తన తండ్రి మరణంలో అంబానీల పాత్ర ఉందంటే ,వాటా అడిగినమాట పుకారు కాదు ,నిజమని జగన్ అంగీకరించినట్లే.బందిపోటు దొంగల తరహాలో జాతి సంపదను కొల్లగొట్టినట్లు ఒప్పుకొన్నట్లే.
18 వ తారీఖున కడప జిల్లాలో మాట్లాడుతూ ,పులివెందుల ,కడప ఉప ఎన్నికల్లో తనని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ పోలీసు బలాన్నీ ,డబ్బునూ ప్రయోగించే అవకాశం ఉందని జగన్ ఆరోపించారు.అంటే 2009 ఎన్నికల్లో తను అలాగే చేసానని ప్రజల ముందు నేరం ఒప్పుకొన్నట్లే.
ప్రాణాలను సైతం లెక్కచేయక 1500 కిమీ పాదయాత్ర చేసి అధికారం అందించాడట మహానేత.ప్రాణాలను పణంగా పెట్టి యుధ్ధభూమి కెళ్ళినట్లో,టెర్రరిస్టుల బారినుంచి దేశాన్ని కాపాడినట్లో పాదయాత్రనభివర్ణించాడంటే ప్రజలను వెర్రి వెధవల కింద జమకడుతున్నాడన్నమాట.దోచిన లక్ష పైగా కోట్లను 1500 పెట్టి భాగిస్తే కిమీ కు షుమారుగా 70 కోట్లు వస్తుంది.కిమీ పాదయాత్రకు 70 కోట్ల చొప్పున గిట్టుబాటైతే రోడ్లన్నీ పాదయాత్ర చేసే జనంతో నిండి పోవా?ఈ భూప్రపంచంలో పాదయాత్రతప్ప వేరే వ్యాపకం పెట్టుకొనే వెర్రిబాగులవాళ్ళు ఉంటారా!

కెకె గావు కేకలు

జుస్టిస్ శ్రీకృష్న దేశ సమగ్రత గురించి చేశిన వ్యాఖ్యలను ఖండిస్తూ కెకె ఇలా అన్నారు" దేశ భక్తి ,ప్రజాస్వామ్యం,రాజకీయాలు,శాంతి భద్రతల గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరంలేదు.ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు,ఎలా బాధ్యతగా వ్యవహరించాలో బాగా తెలుసు."
ఈయన దేశభక్తి సంగతేమో గానీ,స్వామిభక్తి,వందిమాగధ లక్షణాల గురించి మాత్రం ఏ అనుమానాలూ లేవు.ప్రజాస్వామ్యం,రాజకీయావగాహనల సంగతి కొస్తే ,ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక పైన పేర్కొన్న సుగుణాలతో రాజ్యసభ సీటు భిక్షగా పొందినవాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వేశ్య పాతివ్రత్యం గురించి పాఠాలు చెప్పడం లాంటిదే.పిసిసి అధ్యక్షుడిగా చేసిన మొదటి ప్రకటన నా పేరు కేశవరెడ్డి అయిఉంటే నేనెప్పుడో ముఖ్యమంత్రిని అయిఉండేవాణ్ణని.ఒక వర్గం మీద ఉన్న కడుపు మంట ఈయనకున్న రాజకీయ అవగాహన .
జార్ఖండ్ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జీ గా ఉండి టికెట్ల పంపిణీలో డబ్బు తిన్నాడని తన పార్టీ నేతలతోనే అరోపణలనెదుర్కొన్న ఇతగాడు బాధ్యతగా ప్రవర్తించడం తెలుసంటే ఎలా నమ్మాలి.
ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే , ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉండగా 2007,సెప్టెంబర్ 8న కొడుకు వెంకట్,ప్రశాంతరెడ్డి అనే రియాల్టర్ ను ఇంటికి పిలిపించుకొని తుపాకీతో కాల్చి చంపితే,అందరి కాళ్ళు పట్టుకొని ఆ కేసు మాఫీ చేయించుకొన్న ఘన చరిత్రగలవాడు.అదే కేసు జస్టిస్ శ్రీకృష్న లాంటి జడ్జ్ ముందుకెళితే కొడుక్కి కనీసం జీవితఖైదు,కెకె కు సాక్ష్యాధారాలను తారుమారు చేసి నేరం లో భాగస్వామ్యుడయినందుకు 10 సం జైలు శిక్ష తధ్యంగా పడేవి. ఇతగాడా జస్టిస్ శ్రీకృష్న లాంటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడేది.
నేరస్థులకు కొమ్ముకాయడం,అధినాయకత్వానికి భజన చేయడం తప్ప మరేమీ తెలియని ఇటువంటి నాయకులు తెలంగాణా సమాజాన్ని ఏవైపుకు నడిపిస్తారో తలుచుకొంటేనే వళ్ళంతా కంపరంగా ఉంది.