జగన్నాటకం-1

రాశేరె బావ మరిది రవీంద్రనాథరెడ్డి 17 డిసెంబర్ కడపలో మాట్లాడుతూ ,రాశేరె మరణం ప్రమాదవశాత్తూ కాదని,సోనియా రిలయన్సులు కుమ్మక్కై చేసిన హత్యగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం ఒక సిబీఇ అధికారి స్వయంగా జగనుకు చెప్పినట్లు తెలియపర్చారు.అదే రోజు జగన్ పులివెందులలో మాట్లాడుతూ తన తండ్రి మరణం గురించి జనం అందరికీ సందేహాలున్నాయని ,అదే విషయం సాక్షి పేపర్ లో మరియు టీవీ చానల్ లో వస్తే సాక్షి ఆఫీసులో పోలీసులు సోదాలు చేశారని ,ఆవిషయం అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను అడిగితే అధీష్ఠానం ఆదేశాల మేరకే అలా చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చుకొన్నట్లు కూడా తెలియజేశారు.సాక్షిలో ఈ విషయం గురించి చెబితే తప్పేమిటని దబాయించారు.జగన్ అబ్బ రాజారెడ్డి ఎంతోమంది అమాయకులను కడప, అనంతపూర్ జిల్లాలలో హతమారిస్తే,ఆకుటుంబాల వ్యధ గురించి ఒక్క క్షణమన్నా ఆలోచించారా?
అందరి ఆలోచనా ధోరణి తనలాగే ఉంటుందని జగన్ భావిస్తూ ఉన్నాడు.తండ్రి ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ పాపాన్ని సోనియా మరియు అంబానీల కాపాదిస్తున్నారంటే వాళ్ళిద్దరినీ తన ప్రత్యర్థులుగానే భావిస్తున్నాడన్నమాట. సోనియాగాంధీ తను అడగంగానే ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పలేదు గనుక ఆమె మీద దుగ్ధ వుండటం సహజమే,మరి అంబానీలను జగన్ తన ప్రత్యర్థులుగా ఎందుకు భావిస్తున్నట్లు?రాశేరె,జగన్ రిలయన్స్ గ్యాస్ లో వాటాలడిగినట్లు గా పుకార్లు వచ్చాయి. తన తండ్రి మరణంలో అంబానీల పాత్ర ఉందంటే ,వాటా అడిగినమాట పుకారు కాదు ,నిజమని జగన్ అంగీకరించినట్లే.బందిపోటు దొంగల తరహాలో జాతి సంపదను కొల్లగొట్టినట్లు ఒప్పుకొన్నట్లే.
18 వ తారీఖున కడప జిల్లాలో మాట్లాడుతూ ,పులివెందుల ,కడప ఉప ఎన్నికల్లో తనని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ పోలీసు బలాన్నీ ,డబ్బునూ ప్రయోగించే అవకాశం ఉందని జగన్ ఆరోపించారు.అంటే 2009 ఎన్నికల్లో తను అలాగే చేసానని ప్రజల ముందు నేరం ఒప్పుకొన్నట్లే.
ప్రాణాలను సైతం లెక్కచేయక 1500 కిమీ పాదయాత్ర చేసి అధికారం అందించాడట మహానేత.ప్రాణాలను పణంగా పెట్టి యుధ్ధభూమి కెళ్ళినట్లో,టెర్రరిస్టుల బారినుంచి దేశాన్ని కాపాడినట్లో పాదయాత్రనభివర్ణించాడంటే ప్రజలను వెర్రి వెధవల కింద జమకడుతున్నాడన్నమాట.దోచిన లక్ష పైగా కోట్లను 1500 పెట్టి భాగిస్తే కిమీ కు షుమారుగా 70 కోట్లు వస్తుంది.కిమీ పాదయాత్రకు 70 కోట్ల చొప్పున గిట్టుబాటైతే రోడ్లన్నీ పాదయాత్ర చేసే జనంతో నిండి పోవా?ఈ భూప్రపంచంలో పాదయాత్రతప్ప వేరే వ్యాపకం పెట్టుకొనే వెర్రిబాగులవాళ్ళు ఉంటారా!

6 comments:

ప్రాణాలను సైతం లెక్కచేయక 1500 కిమీ పాదయాత్ర చేసి అధికారం అందించాడట మహానేత.ప్రాణాలను పణంగా పెట్టి యుధ్ధభూమి కెళ్ళినట్లో,టెర్రరిస్టుల బారినుంచి దేశాన్ని కాపాడినట్లో పాదయాత్రనభివర్ణించాడంటే ప్రజలను వెర్రి వెధవల కింద జమకడుతున్నాడన్నమాట.దోచిన లక్ష పైగా కోట్లను 1500 పెట్టి భాగిస్తే కిమీ కు షుమారుగా 70 కోట్లు వస్తుంది.కిమీ పాదయాత్రకు 70 కోట్ల చొప్పున గిట్టుబాటైతే రోడ్లన్నీ పాదయాత్ర చేసే జనంతో నిండి పోవా?ఈ భూప్రపంచంలో పాదయాత్రతప్ప వేరే వ్యాపకం పెట్టుకొనే వెర్రిబాగులవాళ్ళు ఉంటారా! -ఒక్కొక్క అక్షరానికి ఒక కోటి విలువ చేసే మాటలు చెప్పారు!కొత్త పాయింట్ సార్!

 

istam vachinatlu raste eh sari rayadaniki chetulu undav ....

 

@love

ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇలాగే పిచ్చి కూతలు కూస్తే ఎవడో నీ తల తీసేసినట్టు ఉన్నాడు , మతి లేని కామెంట్స్ రాస్తున్నావ్ .

 

@ love,
ఓ సారి అద్దంలో మొఖం చూసుకొని రండి. తారకం గారు వ్రాసిన దానిలో మీకు అభ్యంతరకరమయిన వి, విభేదించేవి ఉంటే, విభేదిస్తూ వ్రాయండి, లేకపోతే మీ కిష్టమయిన వారి (వారు ఎవరయినా) చెక్కభజన చేస్తూ కాలం గడపండి కాని, ఇలా బెదిరిస్తే బ్లాగు లలో పెద్దగా ఉపయోగాలు ఉండవు అని గ్రహించడి :)

 

హనుమంతరావు గారూ,
నమస్తే అండీ.నా పాయింటు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
the one & krishna గార్లకు,
ప్రత్యక్ష రాజకీయాల్లొ దోపిడిదొంగలు,ఖూనీకొరులు,మానాభిమానాలు లేనివాళ్ళు జేరి ఎప్పుడో భ్రష్టుపట్టించారు .చదువు, సంస్కారం ఉన్నవాళ్ళనుద్దేశించి వ్రాసే ఈ బ్లాగులో అవిలేని వాళ్ళు దూరడం దురదృష్టకరం.నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు.

 

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

 

Post a Comment