కెకె గావు కేకలు

జుస్టిస్ శ్రీకృష్న దేశ సమగ్రత గురించి చేశిన వ్యాఖ్యలను ఖండిస్తూ కెకె ఇలా అన్నారు" దేశ భక్తి ,ప్రజాస్వామ్యం,రాజకీయాలు,శాంతి భద్రతల గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరంలేదు.ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు,ఎలా బాధ్యతగా వ్యవహరించాలో బాగా తెలుసు."
ఈయన దేశభక్తి సంగతేమో గానీ,స్వామిభక్తి,వందిమాగధ లక్షణాల గురించి మాత్రం ఏ అనుమానాలూ లేవు.ప్రజాస్వామ్యం,రాజకీయావగాహనల సంగతి కొస్తే ,ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక పైన పేర్కొన్న సుగుణాలతో రాజ్యసభ సీటు భిక్షగా పొందినవాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వేశ్య పాతివ్రత్యం గురించి పాఠాలు చెప్పడం లాంటిదే.పిసిసి అధ్యక్షుడిగా చేసిన మొదటి ప్రకటన నా పేరు కేశవరెడ్డి అయిఉంటే నేనెప్పుడో ముఖ్యమంత్రిని అయిఉండేవాణ్ణని.ఒక వర్గం మీద ఉన్న కడుపు మంట ఈయనకున్న రాజకీయ అవగాహన .
జార్ఖండ్ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జీ గా ఉండి టికెట్ల పంపిణీలో డబ్బు తిన్నాడని తన పార్టీ నేతలతోనే అరోపణలనెదుర్కొన్న ఇతగాడు బాధ్యతగా ప్రవర్తించడం తెలుసంటే ఎలా నమ్మాలి.
ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే , ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉండగా 2007,సెప్టెంబర్ 8న కొడుకు వెంకట్,ప్రశాంతరెడ్డి అనే రియాల్టర్ ను ఇంటికి పిలిపించుకొని తుపాకీతో కాల్చి చంపితే,అందరి కాళ్ళు పట్టుకొని ఆ కేసు మాఫీ చేయించుకొన్న ఘన చరిత్రగలవాడు.అదే కేసు జస్టిస్ శ్రీకృష్న లాంటి జడ్జ్ ముందుకెళితే కొడుక్కి కనీసం జీవితఖైదు,కెకె కు సాక్ష్యాధారాలను తారుమారు చేసి నేరం లో భాగస్వామ్యుడయినందుకు 10 సం జైలు శిక్ష తధ్యంగా పడేవి. ఇతగాడా జస్టిస్ శ్రీకృష్న లాంటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడేది.
నేరస్థులకు కొమ్ముకాయడం,అధినాయకత్వానికి భజన చేయడం తప్ప మరేమీ తెలియని ఇటువంటి నాయకులు తెలంగాణా సమాజాన్ని ఏవైపుకు నడిపిస్తారో తలుచుకొంటేనే వళ్ళంతా కంపరంగా ఉంది.

3 comments:

కేకే లాటి వాళ్ళు చరిత్రహీనులు

 

శ్రీనివాస్ గారూ,
నా బ్లాగ్ నచ్చినందుకు థాంక్స్.
chanukya గారూ,
ఒక్క మాటలో కరెక్ట్ గా చెప్పారు.కాంగ్రెస్ ప్లీనరీ లో అవినీతి గురించి విలేఖరులడిగిన ప్రశ్నకు 'ఎలా చేయాలో మేమే నేర్పాం' అని సమాధానం చెప్పాడట ఈ ప్రబుధ్ధుడు.

 

Post a Comment