కెసిఆర్ తైతక్కలు

కెసిఆర్ ceo ల సమావేశం అనంతరం  విలేఖరుల తో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ప్రస్తావన తెచ్చాడు. తెలంగాణా విభజన జరిగితే తానేమి చేయబోతున్నాడో తన మనసులో మాట అసంకల్పితంగా వెళ్ళబుచ్చాడు.
గుజరాత్ కంటే అగ్రగామిగా నిలుపుతానన్నాడు.అంటే గుజరాత్ లో నరేంద్రమోడి సర్కార్ లాగా హిందూ ముస్లిం వైషమ్యాలను రెచ్చగొట్టి తెలంగాణా ముస్లిం లను ఊచకోత కోసి ఆ సమాధుల మీద తన సామ్రాజ్య సౌధాలను నిర్మించుకొందామను కొంటున్నాడు.కర్ణాటకకు దీటుగా రాష్ట్రాన్ని నిలబెడతాడట.అంటే బయ్యారం నుంచి కరీంనగర్ వరకు విస్తరించి ఉన్న అపార ఖనిజ సంపదను ఏ దొరలకో అప్పజెప్పి రాష్ట్రాన్ని మరో గనుల మాఫియా చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు.
ఇక జార్ఖండ్ లో వృధ్ధి రేటు విడి పోక ముందు కంటే చాల మెరుగైంది అంటున్నాడు. తన కుటుంబ సభ్యుల్లో కొంత మందిని మధు కోడాల ను తయారు చేసి తెలంగాణాను మరో గుర్రపు సంత (horse trading centre ) లా మారుస్తాడు. ఈయన ఉదహరించిన మరో రాష్ట్రం చత్తిస్ ఘర్. అక్కడ లాగా పరిపాలన మొత్తం తీవ్రవాదుల కప్పజెప్పి ఎంతో మంది అమాయకుల ( రెండు వర్గాల నుంచి ) ప్రాణాలు గాలిలో దీపాల వలె చేస్తాడు.
అందాల రాముడు సినిమా లో నాగేశ్వరరావు, రాజబాబు తో అంటాడు` నీ బుర్ర ఒక బాత్రూం రా` అని. అలాగే ఈయన నోరు మరుగు దొడ్డి. తన నోటితో నిష్కారణం గా తెలుగు జాతి మధ్య వైషమ్యాలు సృష్టించి నిలువుగా చీల్చాలనుకొనే స్వార్థపరుడు. ఇతడొక విధ్వంసకరమైన రాజకియుడే కాని నిర్మాణాత్మక రాజనీతిజ్ఞుడు కాదు.
2009 ఎన్నికల్లో తెదేపా మరియు వామ పక్షాలతో కలసి మహాకుటమి గా ఏర్పడి, పోటీచేసి ఫలితాలు రాకుండానే భాజపా తో చేతులు కలిపినా అవకాశవాది. భాజపా పాలనలో భ్రష్టుపట్టిపోయిన నాలుగు రాష్ట్రాలను ఆదర్శం గా తీసుకొని అక్కడి సిద్ధాంతాలను తెలంగాణా లో  ఆచరణలో పెట్టలనుకొనే ఒక భావ  దారిద్ర్య,దివాలాకోరు వ్యక్తి. తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!    

చంద్రబాబు- సఫల ముఖ్యమంత్రి,విఫల రాజకీయనాయకుడు-ఒక విశ్లేషణ

చంద్రబాబు- సఫల ముఖ్యమంత్రి,విఫల రాజకీయనాయకుడు-ఒక విశ్లేషణ

తెదేపా ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి` పల్లెపల్లెకు తెదేపా`అనే కార్యక్రమం చేపట్టారని ఈనాడు (sep 21 ) లో ఒక వార్తా వచ్చింది.పై పై పూతలతో బాగా ముదిరి పోయిన జబ్బు తగ్గుతుందా? రోగ నిర్ధారణ చేస్తేనే గదా వైద్య సహాయం అందించ గలిగేది.
మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు రాజకీయ నాయకుడు గా ఎందుకు విఫలం అయ్యాడు ? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం మౌలిక సమస్యల్లోకి వెళ్ళాల్సిందే.
ముఖ్యమంత్రి గా IT  కు పెద్ద పీట వేసి హైదరాబాద్ ను చెన్నై, బెంగలూరు ల సరసన చేర్చి లక్షల మంది మధ్య తరగతి,దిగువ తరగతి,యువతకు ఈ రంగం లో ఉపాధి కల్పించాడు. ISB , IIIT లాంటి ఉన్నత విద్యాసంస్థలను నెలకొల్పి క్లీన్ & గ్రీన్ లాంటి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ ను ఒక సుందర మెట్రో నగరం గా తీర్చి దిద్దాడు. వైఫల్యాలలోకి వెళితే వ్యవసాయ రంగాన్ని చిన్న చూపు చూడడం, హైదరాబాద్ ను తప్పించి మిగతా నగరాల అభివృద్ధి గురించి పట్టించుకోక పోవడం, రాజకీయం గా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా అధికారులకు వదలి పెట్టి వారి మీద పూర్తిగా ఆధారపడటం మొదలగునవి.
ముఖ్యమంత్రిగా ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనా రాజకీయ నాయకుడిగా కనిష్ట మార్కులు కూడా ఎందుకు తెచ్చుకోలేక పోతున్నాడో చంద్రబాబు ఆత్మ పరిశీలనా చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఈ మధ్య కాలంలో ఉద్యమ బాట పట్టి నా రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కు చందాన చేస్తున్నాడు. పార్టీ కార్యకలాపాల్లో సామాజిక స్పృహ గలిగిన నాయకులు గాని నిబద్ధత తో పనిచేసే కార్యకర్త గాని పాలు పంచు కొనే మార్గం లేకుండా చేసాడు.పార్టీ వ్యవహారాల్లో దళారులదే పెత్తనం . ఉమ్మారెడ్డి, సుజనా చౌదరి లాంటి వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది.ఈయన సలహాదారులంటే అతి తక్కువ మేథస్సు,పూర్తి హ్రస్వ దృష్టి గల కడియం, ఎర్రబెల్లి వంటి వాళ్ళే.ఇటువంటి రాజకీయ మరుగుజ్జులే పార్టీ కి దిశా నిర్దేశం చేసేది.
అదే కాంగ్రెస్ పార్టీ ను తీసుకుంటే మన రాష్ట్రము లో పరిస్థితి తెదేపా కన్నా ఇంకా అధ్వాన్నం గా ఉంది. క్రోనీ capitalisam ద్వారా లబ్ది పొంది వేలు, లక్షల కోట్లు గడించిన వాళ్ళు ( kvp,ధర్మాన,కన్నా, జగన్), అమ్మకు అడుగులకు మడుగు లోత్తే వీర విధేయులైన కాకారాయుల్లు(వి హెచ్ ,కే కే ), దళారులు ( TSR, రాయపాటి) తో నిండి ఉంది. కానీ కేంద్రం లో పరిస్థితి దీనికి చాలా భిన్నం గా ఉంది. రాజ్యసభ కు ఎంపిక చేసిన వాళ్ళలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన మన్మోహన్ సింగ్ , జై రామ్ రమేష్ లాంటి వాళ్ళు, లోక్ సభ నుంచి మని శంకర్ అయ్యర్ ,కపిల్ సిబాల్ ,చిదంబరం ,కమల్ నాథ్ లాంటి సామాజిక స్పృహ గలిగిన మేధావులు ఉన్నారు .వీళ్ళే పార్టీ విధి విధానాలను రూపొందించి దిశా నిర్దేశం చేయడం లో భాగం పంచు కొంటారు. వివిధ రంగాలకు సంబంధించిన విషయాల్లో మాంటెక్ సింగ్ ఆహుల్వాలియా,రంగరాజన్, స్వామినాధన్ వంటి నిష్ణాతుల సలహాలు తీసుకొంటారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ కు ప్రత్యామ్నాయం లేకుండా చూసుకో గలుగుతున్నారు.
ఇక తెదేపా ఎగువ సభకు ఎవరిని పంపుతుందో గమనించండి.మైసురారెడ్డి,కంభంపాటి,సుజనా చౌదరి,(ఇదివరలో ఉమ్మారెడ్డి,జయప్రద,రామచంద్రయ్య,)లాంటి వాళ్ళు. వీళ్ళు పార్టీ కు ఏరకంగా దిశానిర్దేసం చేయగలరో చంద్రబాబు కే తెలియాలి.పోలిట్ బ్యూరో అంటే పార్టీ విధివిధానాలను రూపొందించి దిశానిర్దేశం చేసే అతున్నత సమూహం. ఇప్పుడు పోలిట్ బ్యూరో లోని వ్యక్తుల బయోడేటా ను పరిశీలిస్తే, పార్టీ ఇప్పుడున్న అతోగతి కి కారణాలు మీకు అవగత మగుతాయి. మన తెలుగు సమాజం లో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నిపుణులు,దార్శనికులైన మేధావులు ఎంతోమంది ఉండగా, చంద్రబాబు అభద్రతా భావం మరియు ఆత్మ న్యూనత లతో బాధ పడుతూ ఏరంగంలోను నిష్ణాతులు కాని వాళ్ళు , అల్ప మేథస్సు ,అతి తక్కువ సామర్థ్యం గల దిగువ స్థాయి మనుషులతో పోలిట్ బ్యూరో ను నింపి వేసాడు. ఉమ్మారెడ్డి లాంటి చెరుకు పిప్పి లాంటి నాయకులు ఒక వినూత్న ఆలోచన ఎలా చేయగలుగుతారు ? గతం లో అనుఇంధన  ఒప్పందం బిల్లు లోక్ సభ లో ఓటింగ్ కు పెట్టినప్పుడు పోలిట్ బ్యూరో మెంబర్ అయిన మందా జగన్నాధం ఏమి చేసాడో అందరికి తెలిసినదే. 2009 ఎన్నికలకు ముందు ప్రతి విషయం లోను చంద్రబాబు కు సలహాదారులు గా పనిచేసిన కోటగిరి, దేవేంద్ర గౌడ్, సుబ్బారాయుడు, కళా, తమ్మినేని మొదలగు వారంతా చంద్రబాబు ను క్లిష్ట పరిస్థితులలో వదిలేసి ఎలా వెళ్ళిపోయారో అందరికి తెలిసినదే. ఇవన్ని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే తక్కువ నాణ్యత గల వ్యక్తుల మీద సలహాల కోసం ఆధారపడితే ఏమి జరుగుతుందో చంద్రబాబు కు ఒక సారి అనుభవం లోకి వచ్చిన తర్వాత గూడా తన పంధా మార్చుకొన్న దాఖలాలు లేవని తెలియ జేయడానికే.చంద్రబాబు దృష్టి లో తెలుగు మహిళా అంటే ఒక వోట్ బ్యాంకు, ఒక గ్లామర్ డాల్(జయప్రద, రోజా ). స్వతంత్ర సమరం లో పాల్గొన్న మహిళలు ఎంతో మంది ఈ తెలుగు గడ్డ మీద ఉన్నారు.రాజకీయ చైతన్యం గల మహిళా లెందరో తెదేపా లో కూడా ఉన్నారు.కాని ఈయన ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒక్క మహిళా కూడా స్టేజీ మీద కనపడదు.చంద్రబాబు తన ఎత్తుగడలతో తీరిక లేకుండా గడుపుతూ ఏసమస్యనైనా పూర్తీ చిత్రం(big picture)చూడలేక పోవడం వలన మంచి వ్యుహకర్త కాలేకపోతున్నాడు అందుకని ఎసమస్యనైన కర్యసీలతతో(proactive) పరిష్కరించకుండా ప్రతిచర్య (reactive) తీసుకొనే రాజకీయనాయకుడు గానే మిగిలి పోతున్నాడు.
ఈ పరిస్థితులలో పార్టీ కు పునర్ వైభవం రావాలంటే ఏమి చేయాలి ? తెలుగు యువత, తెలుగు విద్యార్ధి వంటి సంస్థలను పునరుద్ధరించి/పునర్ వ్యవస్థీకరించి భావి తరానికి స్పూర్తి వంతమైన నాయకత్వాన్ని అందించడానికి గట్టి పునాదులు వేయాలి.మేధావుల, నిపుణుల సామాజిక రాజకీయ చైతన్యం గల దార్శనికుల దగ్గరనుంచి సలహాలు తీసుకొని పార్టీ కు దిశా నిర్దేశం చేసే ప్రక్రియ లో భాగస్వామ్యం కల్పించాలి. కేంద్రం లో సోనియా / కాంగ్రెస్స్ ఒక national advisory council నియమించుకోన్నట్లే తెలుగు జాతి అభ్యుదయానికి ఒక advisory council ను నియమించు కోవాలి. కాంగ్రెస్స్ పార్టీ ను అనుకరించాలా అని మీకు ధర్మ సందేహం రావచ్చు. కాని గతం లో NTR ఏమి చేసారో మీరొకసారి గుర్తుకు తెచ్చుకొంటే మీ సందేహాలు పటాపంచలవుతాయి. నీటి పారుదల రంగానికి sreeraamakrishnayya, వైద్య రంగానికి కాకర్ల సుబ్బారావు,విద్యుత్ రంగానికి నార్ల తాతారావు సలహా దార్లు గా ఉండేవారు.
మెకిన్సీ లాంటి బిజినెస్స్ consultants ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ CEO అనే బిరుదుతో సంబరపడిపోయి ( రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శి CEO మరియు ముఖ్య మంత్రి క్రింద పని చేసే ఒక అధికారి మాత్రమె) తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించిన చంద్రబాబు ఒక రాజకీయ దురంధరుడు (STATESMAN)గా ఎదగాలని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశిద్దాం.తెలుగు జాతికి ఇప్పుడు ఒక రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ గల రాజకియకోవిధుని(statesman) అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ఈ తరం నాయకుల్లో ఆ స్థాయికి ఎదగగలిగిన సామర్థ్యం గల ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమె అనేది నా ప్రఘాడ విశ్వాసం.
ఈ వ్యాసం లో విశదీకరించిన పొరపాట్ల వలెనే చంద్రబాబు సామర్థ్యం ఉన్నా ఆ స్థాయికి ఎదగ లేక పోయాడు అనేది ఒక చారిత్రిక విషాదం.
(ఈ వ్యాసం చలసాని శిశిర్ అనే నా స్నేహితునితో రోజూ మాట్లాడే విషయాల్లోనుంచి సంగ్రహించి/ స్ఫూర్తి పొంది వ్రాసినది )  

దొంగల పాఠశాలా-పూర్వ విద్యార్థులు

`వినోదం` సినిమా లో ఒక చిల్లర దొంగతనం చేయబోయి దొరికిపోయి తరువాత దొంగల కాలేజి లో చేరి శిక్షణ పొందుతాడు బ్రహ్మానందం.ఇప్పుడు తమిళనాడు తిరుచ్చి సమీపంలో రాంజినగర్ అనే ఊల్లొ దొంగల పాఠశాలా ఉందంటే ఆశ్చర్యం కలిగి , ఆ పాఠశాలా గురించి పరిశోధన చేస్తే చాలా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పాఠశాలా లో చదివిన విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ ఆంధ్రప్రదేశ్ లో చేబడుతున్నట్టు గూడా ఈనాడు లో వార్త వచ్చింది.ఆ పాఠశాలా పూర్వ విద్యార్థులు చాలామంది రాజకీయనాయకులు , వ్యాపారవేత్తలు, ఐఏఎస్ , IPS ఆఫీసర్లు ఉన్నట్లు  అత్యంత విశ్వసనీయ వర్గాల భొగట్టా. ఆ పాఠశాలా పూర్వ విద్యార్ధుల జాబితా సేకరించి మీ కందిస్తున్నాను.మీరు దీన్ని అత్యంత గోప్యంగా   ఉంచాలని మనవి.౧) రాగాసేకరరెడ్డి ౨) జగత్ సరస్వతిరెడ్డి ౩)కే వి పండుచంద్రారావు ౪)బోట్ల ముత్యన్నారాయణ ౫) కరుణా మోహనరెడ్డి ౬) తిక్క శంకరామిరెడ్డి ౭)అంబా రాం బాంబు ౮) కంత్రీ  జివరెడ్డి ౯) సత్య లింగరాజు ౧౦) కృషీ ఈశ్వరరావు ౧౧) BP పంతులు ౧౨) GP యాదవ్ ( జాబితా సశేషం )

న్యాయ వాదుల ఆందోళన

sep  18  ఆంధ్రజ్యోతి లో ఆదిత్య గారు వ్రాసిన దారి తప్పిన న్యాయ - వాదం అనే వ్యాసం లో ఆయన పడిన ఆవేదన ఆలోచనపరులైన సభ్య సమాజ వ్యక్తులందరినీ కలచి వేసేదే. ప్రజాస్వామ్యానికి legislature , executive , judiciary  లు మూడు మూలస్థంభాలు అనే విషయం మనకందరికీ తెలిసినదే. న్యాయవాదులు , న్యాయమూర్తులు పైన ఉదాహరించిన మూడవ స్తంభం లో అంతర్భాగం . ఈ సంగతి మరచి అతి జుగుప్సాకరం గా ( కిరాయి గుండాల లాగా అని వ్రాద్దామనుకొన్నాను గానీ అది చాలా చిన్న పదం లాగా నాకనిపించింది ),నీచంగా,హేయంగా న్యాయవాదులు తమ సొంత వ్యవస్థ మీద చేసిన దాడి , తల్లిని చెరిచిన ఘాతుకం తో సమానం . ఈ దాడికి పాల్పడిన న్యాయవాదులనే క్రిమి కీటకాలు రాజ్యాంగం ప్రకారం వేయబడే అతి పెద్ద శిక్షకు అర్హులు .

గాంధీ ల కోసం గాంధీ ల భజన

2004
జగన్: నాన్న గారూ ఎంతో మంది మహానుభావులు మనవాళ్ళు ఉన్నారు. అంతెందుకు భావి తరాలకు ఆదర్సవంతుడు, మడం తిప్పని మన వంశానికి మూల పురుషుడు మా అబ్బ రాజారెడ్డి ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి మీరేమిటి ఇలా అన్ని పథకాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ల పేర్లే పెడుతున్నారు?
ysr : నాయనా ఒక విషయం గమనించావో లేదో పది నుంచి వెయ్యి రూపాయల నోటు దాకా ప్రతి దాని మీదా గాంధీ బొమ్మ ఉంటుంది. మనకు ఈ గాంధీ లు కావాలంటే ఆ గాంధీ ల భజన తప్పదురా !
2010
విజయలక్ష్మి: నాయనా జగన్ మీ నాన్న గారు బ్రతికి ఉండగా ప్రతి రోజు ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ ల నామ జపం చేసే వాళ్ళు. నీవేమిటి ఒక్క రోజు కూడా సోనియా గాంధీ ని కాని , రాహుల్ గాంధీ ని కానీ తలచు కోవేమిటి ?
జగన్: ఆమ్మామనకు కావలసిన గాంధీ లను నాన్నగారు మనకు పుష్కలంగా ఇచ్చి పోయారు గా . ఇంకా ఈ గాంధీ ల తో మనకు పనేమిటి ?

అమెరికా యువత కు సందేశం

7వ తారిఖు జ్యోతి లో భరత్‌ఝున్‌ఝున్‌వాలా అమెరికాకు వీసా చిక్కులు అనే వ్యాసం లో ఇలా వ్రాసారు
"భారతీయ మేథాశక్తిపరిపూర్ణం కావడానికి దోహద పడుతోన్న పథ్థతులను అమెరికన్లు నేర్చుకోవడం ఎంతైనా అవసరం. నుదుట తిలకం థరించడం,ముంజేతికి కాసీదారాలు కట్టుకోవడం,దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం,తీర్థక్షేత్రాలలో స్నానాలు చేయడం,గుడిలో గంటలు మోగించటం,అగర్ బత్తీల పరిమళాలను ఆస్వాదించడం మొదలైనవాటిని అలవర్చుకోవాలి.అమెరికన్ విద్యార్ధులు ఈ పథ్థతులను అనుసరించినప్పుడు వారి మేధాశక్తి పెరిగి భారతీయులతో సమర్ధంగా పోటిపడగలుగుతారు". అయ్యా ఇది చదివితే అమెరికా,రష్యా వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు.
మన వాళ్ళకు ఇవన్నీ చెయ్యొద్దురా బాబూ అని చెప్పాలిసింది పోయి వాళ్ళకు ఇయన్నీ చెయ్యమని చెబుటాడా ఈ సన్నాశి!

జగన్ కు ఉచిత సలహా

జగన్ కు ఉచిత సలహా
మేరి మాత కరునాకటాక్షాలకోసం ఇస్రాయులు దాకా వెల్లావు. సోనియా మాత కరుణ  ఉంటే నీ కోరిక ఢిల్లి లోనే తీరేది కదా.