తెలంగాణా వాదం -మేధావులా?మేతావులా?-1

'నాకు నెలకు లక్ష జీతం వట్టిగ ఇస్తలేరు.30 ఏళ్ళుగా యూనివర్సిటీ కు సేవ చేస్తున్నా.ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన సర్కారుకు విశ్వసనీయుడుగా ఉండాల్సిన అవసరం లేదు.రాజ్యాంగానికి మాత్రమే విశ్వాసపాత్రుడిగా ఉంటా.ఒక పౌరునిగా కర్తవ్యాన్ని నిర్వర్స్తిస్తా.' అని శలవిచ్చారు తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొ.కోదండరాం .
గవర్నరుగానో,రాష్ట్రపతిగానో,లేక ఎన్నికలప్రధానాధికారిలాంటి రాజ్యాంగబధ్ధమైన పదవుల్లో ఉంటే రాజ్యాంగానికి విశ్వసనీయుడుగా ఉంటానంటే అర్ధముందిగాని,విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఈయన రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడుగా ఉంటాననడం తననుగురించి తాను ఎక్కువగా ఊహించుకొని పలికే ప్రగల్భాలు,వ్యర్ధ ప్రేలాపనలు.
నాయనా ప్రొ.కోదండరాం మీదేమీ రాజ్యాంగపరమైన కొలువు కాదు.విశ్వవిద్యాలయ నౌకరీనిబంధనల కనుగుణంగా మీకు ప్రొ.ఉద్యోగం ఇచ్చారు.ఈ ఉద్యోగ సక్రమ నిర్వహణకు రాజ్యాంగం లాంటి పెద్దమాటలు వాడాల్సిన పని లేదు.గత రెండు ఏళ్ళుగా ప్రత్యేక తెలంగాణా తలకెత్తుకొని ,నిరుద్యోగ రాజకీయనాయకులతో కలసి,సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ,అరాచకాలు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నారుగాని ప్రొఫెసర్ గా మీవిధులు నిర్వర్తించడం లేదు.విద్వేషాలు రెచ్చగొట్టడం,అరాచకం సృష్టించడం లాంటివి రాజ్యాంగవిరుధ్ధ కార్యక్రమాలే.విద్యార్ధుల తల్లితండ్రులు,తమ పిల్లలను విద్యాలయాలకు పంపేది విద్యాబుధ్ధులు నేర్పమనిగాని,ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలలో తర్ఫీదు ఇవ్వమని కాదు.
వెనకటికొకడు,పెళ్ళాం పిల్లలకు అన్నం పెట్టి దేశ సేవ చేశానన్నాడట.అలాగుంది ఈయన 30 ఏళ్ళు యూనివర్సిటీకి సేవ చేశాననడం.జీతం తీసుకోకుండా,నిస్వార్ధంగా విద్యార్ధులకు విద్యాబోధ చేస్తేనో,తన సొంతసొమ్ముతో యూనివర్సిటీకి లైబ్రరీ భవనాలో,ఆడిటోరియమో నిర్మించి ఇస్తేనో ,భూవిరాళం చేస్తేనో,దాన్ని సేవ చేయడం అంటారు కాని ఇది సేవ ఎలాగౌతుందో ఆయనే విశదీకరించాలి.చేశే ఉద్యోగానికి నెలనెలా జీతం పొందుతూనే ఉన్నాడు గదా!రాశేరె లక్ష కోట్లు దోచి రాష్ట్రానికి 5.1/2 ఏళ్ళు సేవచేశాననడం,గాలి జనార్ధన రెడ్డి,అక్రమంగా ఖనిజ సంపదను దోచి,దాన్ని విదేశాలకు తరలించి అప్పణంగా కోట్లు కూడబెట్టి,కర్ణాటకకు,దేశానికి సేవ చేశాననడం ఎంత నిజమో,ఈయనసేవ కూడా అంతే నిజం.
సర్కారు యుజిసి కి సొమ్ము మంజూరు చేస్తే,దానినుంచి యూనివర్సిటీలకు గ్రాంటు రూపంలో అందుతుంది.ఉద్యోగుల జీతభత్యాల దగ్గరనుంచి,ఉపాధ్యాయులు వివిధ సదస్సులలో పాల్గొనేటందుకు,మరియు అనేక ఇతర కార్యక్రమాలను నెరవేర్చేటందుకు అయ్యే వ్యయమంతా సర్కారు నుంచి అందేదే.దీన్నిబట్టి విషయ పరిజ్ఞానం,సరైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరికి విశ్వాసపాత్రుడుగా ఉండాలో తానే నిర్ణయించుకుంటాడుగాని,ఇలాంటి హాస్యాస్పద ప్రకటనలతో తన సామర్ధ్యలేమిని బహిర్గతం చేసుకోడు.ఏదిఏమైనా ఒక ప్రొఫెసర్ ,యూనివర్సిటీకి ,విద్యార్ధుల తల్లితండ్రులకు మాత్రం విశ్వసనీయుడుగా ఉండవలసిందే.
ఒక ఉపాధ్యాయుడుగా,సమాజానికి మార్గదర్శకుడుగా నిలవాల్సిన వ్యక్తి,ఒక పౌరుడిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తాననడం ఒక అలంకారిక పదప్రయోగం మాత్రమే.ఉద్యోగ బాధ్యతలను విస్మరించి చేపట్టే విధ్వంస కార్యక్రమాలకు,ఈ అత్మవంచనల కికనైనా స్వస్తి పలికి,ఒక సామాన్యపౌరుడిగా తన కర్తవ్యం(?) నిర్వర్తించాలనుకుంటే ,తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేసి,తన ప్రత్యర్ధులకు తొడ కొడతాడో,వాళ్ళతో కలబడతాడో తేల్చొకొంటే అది సమంజసంగా ఉంటుంది.
(నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గదర్శకంలో వ్రాసినది)

26 comments:

తారకం గారూ, కేవలం భూకబ్జాదార్లూ, రక్తచరిత్రలూ, మైనింగు మాఫీయాలూ రాజకీయనాయకులుగా చలామణీ అయ్యే సీమాంధ్రలో రాజకీయాలో సామాన్య ప్రజలపాత్ర స్వల్పం. అలాంటివారికి ప్రజాఉద్యమాలలో మేధావుల పాత్ర అర్ధం కాదు. వంగవీటి తుమ్మితే, దేవినేని దగ్గితే బందులు జరిగే చోట నిజమైన ఉద్యమాలంటే అనుమానాలు ఉండడం సహజం.

 

ప్రభుత్వ వుద్యోగులకు రాజ్యాంగం ఎండార్స్ చేసిన కాండక్ట్ రూల్స్ పాటించాలని, వూస్ మేనియా మేతావులకు తెలియదేమోలేండి. :)

 

ఈ గొట్టం గాడు, తన కొడుకుని అమెరికా లో చదివిస్తూ ఇక్కడున్న యూనివర్శిటి పిల్లల్ని చంకనాకిస్తున్నాడు.

 

నేతి బీరకాయలో నెయ్యెంతో మీ ఉద్యమాల్లో నిజమంత అని కమిటి తేల్చిందిగా.. ఇంకెందుకీ "సత్యాన్వేషి" అనే వేషం? దీనికి కొంత ప్రొఫెసర్లు, వీదుల్లో రగ్గు కప్పుకొని చిందులు తొక్కేవాళ్ళు, పని పాట లేకుండా సంవత్సరాలు దిల్సా గా వర్సిటి హాస్టల్స్ లో కాలం గడిపేవాళ్ళు, అంతా గలిస్తే ప్రజా ఉద్యమం.. LOL

 

మీ అభిప్రాయాలు కేవలం కొదండరాం గారికే వర్తిస్తాయా, లేక కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైఖ్యాంధ్ర JAC కి కన్వీనరుగా ఉండి బంద్‌లు బాయ్‌కాట్‌లు నిర్వహించిన Prof. N. Samuel గారికి కూడా వర్తిస్తాయా?

 

సత్యాన్వేషి గారూ,
భూకబ్జాదార్లకు,మైనింగ్ మాఫియాలకు ప్రాంతీయవిభేదాలుండవండీ.ఆంద్రాలో రాజకీయచైతన్యం గురించి తెలియాలంటే మీరు చరిత్ర క్షుణ్ణంగా చదవాల్సిందే.తెలంగాణా సాయుధపోరాటం గూర్చికూడా చదవండి.వంగవీటులు,దేవినేనులు ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన సంగతి మీకు తెలియకపోవడం శోచనీయం .ప్రజాఉద్యమాలలో మేధావులపాత్ర తెలుసుగనుకే,ఇటువంటి మిధ్యా మేధావులను వదలి,సరైన మేధావులకోసం అన్వేషించండి.
snkr,సత్య,astrojoyd, గార్లకు,
కరెక్ట్ గా చెప్పారు.నాబ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు.
హరి గారికి,
ఏ మూర్ఘుడికైనా వర్తిస్తాయి.

 

భూకబ్జాదార్లకు,మైనింగ్ మాఫియాలకు ప్రాంతీయవిభేదాలుండవండీ.
అదేకదా సమస్య..వీరు తెలంగాణాప్రాంతం వచ్చి మరీ తమ కార్యక్రమాలు యధేచ్చగా చేస్తున్నారు!!

ఆంద్రాలో రాజకీయచైతన్యం గురించి తెలియాలంటే మీరు చరిత్ర క్షుణ్ణంగా చదవాల్సిందే.
వర్తమానం చూడొద్దంటారా?

వంగవీటులు,దేవినేనులు ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన సంగతి మీకు తెలియకపోవడం శోచనీయం
ఒక దగుల్బాజీ గెలుస్టే ఇంకొకడు ఓడిపోవాలి కదా? గెల్చిన రోజులగురించి ఏమంటారు?

ఏ మూర్ఘుడికైనా వర్తిస్తాయి.
మరి ఆ మూర్ఖులగురించి టపాలో ఎక్కడా ప్రస్తావించలేదు?

 

.తెలంగాణా సాయుధపోరాటం గూర్చికూడా చదవండి.

నా చరిత్ర చదవమని నాకే గుర్తుచేసినందుకు సంతోషం.చదువుదామంటే సోషల్ పుస్తకాల్లో ఎక్కడా కనపడకుండా తుడిచేశారే?

 

సత్యాన్వేషి,
ఎక్కడాకనపడని చరిత్ర ఆధారంగా యిన్ని రోజులూ ఎలా వాదించారు? మీరు ప్రతిపాదించే అన్యాయపు చరిత్ర ఎక్కడ చదివారో, ఆపక్కనే యిదికూడా వుండే వుంటుంది చూడండి.కాకపోతే మీరు అది చూడకూడదనుకుని గబగబా పేజీలు తిప్పేసి వుంటారు.

 

తెలంగాణా సాయుధపోరాటమా? ఎవరిమీద? మా మంచి నిజాం రాజు మీద మీ కోస్తా సీమోళ్లు చేసిన కుట్ర కదూ అది? సత్యాన్వేషి గారు అందుకే చదివి ఉండరు లేకపోతే ఆ చరిత్ర గురించి వ్రాసిన పుస్తకాలలో నెల్లోరు సీమోడు కూడా ఉండటం వలన చదివి ఉండరులే :).

సత్యాన్వేషి గారు మీరు బాధపడకండి, ఆ చరిత్ర గురించి, మన మంచి రాజు గారు గురించి మన దొర గారు త్వరలో చరిత్ర వ్రాసి పెడతారు, పుస్తకాలలో మనం చదువుతాము. కావాలంటే దొర గారి దగ్గరకు వెళ్లి పాఠాలు చెప్పించుకొచ్చిన నాగార్జున దగ్గర ట్యూషన్ చేరదాము, బాధపడకండి సారు, మనకూ మన నిజాం గోర్కి, దొర గోరికి చరిత్ర లో చానా పెద్ద స్థానం కల్పించేంతవరకూ పోరాడతానికో ఓ జాకు కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేద్దము ఏమంటారు?.

 

@krishna
నేను చదివిన్నో లేదో నీకు తెల్వదు, ఆ టాపిక్ ఎందుకొచ్చిందో నీకూ, బ్లాగు రైటరుకూ తెల్వదులేగాని, నీలాంటోల్లు అలా అనుకున్నా తప్పులేదు, ఎందుకంటే అది సోషల్ పుస్తకాల్లో డెలిబ్రేట్‌గా పెట్టలేదు. అందుకే నీలాంటోల్లు తెలీకుండనే మాట్లాడుతున్నరు.

 


@సత్యాన్వేషి--"నా చరిత్ర చదవమని నాకే గుర్తుచేసినందుకు సంతోషం.చదువుదామంటే సోషల్ పుస్తకాల్లో ఎక్కడా కనపడకుండా తుడిచేశారే?"----
సోషల్ పుస్తకాలు వెతికితె డొరకలెదు అని KCR చెప్పినది నమ్మెసి మీ పొరటన్ని సాగిస్తున్నరు కద , keep it up

 

/సత్యాన్వేషి,
ఎక్కడాకనపడని చరిత్ర ఆధారంగా యిన్ని రోజులూ ఎలా వాదించారు? /
ఆహాహా! మరచెంబుతో ఒక్కటిచ్చారు. :)) గుడ్డి వారికి దారి చూపొచ్చు, గుడ్డి-చెవిటిగా నటిస్తున్నోళ్ళోకి... అదన్నమాట! :) ఇక ఆ విషయం వదిలేసి మళ్ళీ కెసిఆర్/కోదండంల తోక పట్టుకుంటారు. :D

 

తెలంగాణా నాయకుల ప్రతిభ అందరికి తెలిసిందె. పాత సినేమాలలో రేలంగి రాజు వేషం వేస్తే ఎలా నడచుకొంటారో వీరు అంతే. వీరికి నాయకత్వ లక్షణాలలో ప్రధానమైన వ్యుహం, తెగింపు, ధైర్యం సున్నా. వ్యూహాలు టి.వి. లలో చర్చించటం లో ఎదో పోడిచి వెసెవారిలా మాట్లాడుతూ ఉంటారు. అందరు వాగుడు కాయలు ఒకరంటె ఒకరికి పడదు. ఇంతమంది విద్యార్దుల జీవితాలతో ఆడుకొన్న వీరు కనీశం పదవులను రాజీనా చేయటానికి కూడా ముందుకురాక పోవటం చూస్తే పాపం ఆ విద్యార్థులను వారి బుర్రను పాడుచేసిన పుస్తకాలను. అవి రాసిన చచ్చు రచయితలదే ఆ తప్పంతా. కోదండరాం కి ఉద్యమం కన్నా జీతం ఎక్కువ వీరు పోరాట యోదులు. చూడబోతే ఆ రోజుల్లో జరిగిన తెలంగాణా సాయుధ పోరాటం కూడా ఆంధ్ర నాయకుల వలన ఆమత్రం పోరాడి నట్లు ఉన్నారు కోదండరాం లాంటి వారు ఉండి ఉంటే అంతే సంగతులు.
అయ్యా సత్యాన్వేషి గారు ఆంధ్రా వాళ్ళ మీద పడి మళ్ళి ఏడుద్దురు గాని మీ ప్రధాన లోపాలు ముందర సవరించుకోండి. మీ వారి ప్రతిభ అంతా నల్ల గొంగళి వొంటి మీద వేసుకొని పాటలు పాడుకోవటం, చప్పట్లు కొట్టుకొని ప్రజా చైతన్యం వచ్చిందని మురిసి పోవటం తో సరి పోతున్నాది. ఇవ్వని ఎప్పుడో 1920సం|| టెక్నిక్స్ వాటిని మీరు ఇంకా ప్రయోగిస్తున్నారు. అసలికి మీకు ఇప్పుడు కావలసినది ఒక మంచి నాయకుడు. ఈ ప్రజా చైతన్యాన్ని రాష్ట్రం సాదించే విధం గా మలచేవాడు. మీ దగ్గర ఉన్న వారంతా టి.వి. లో పేరు తెచ్చుకోవాలను కొనే పుచ్చు సరకు. ముందర ఒక మంచి నాయకుడిని పట్టు కోండి తరువాత రాష్ట్రం కొరకు ప్రయత్నించండి.
గమనిక: నాయకులు ప్రపంచ చరిత్ర పఠనం వలన, సమకాలిన సమాజల గురించి పుస్తకాల చదవటం ద్వారా, చర్చలనుంచి పుట్టించలేరు. అది పుట్టుకతో వచ్చే వ్యక్తిగత ప్రతిభ.

 

ఈ ఉద్యమం ఎoత నీరు గారి పోయిందంటె సం|| క్రితం ఎంతో మంది మేధావులు బ్లాగులలో దాని గురించి రాసేవారు. ఇప్పుడు ఒకరో ఇద్దరో దాని గురించి రాస్తున్నారు. మిగతా అందరు మొహం చాటేసారు. ఎంతైనా వారికి అవమానం కదా, ఎదో వారి నాయకులంతా పోరాట యోధులని అనుకొంటె, వాళ్ళు ఒక్కడిని మించి ఒకడు తమ స్వార్ధాన్ని కోదండరాం లా సామాన్య ప్రజలకు అర్థమయ్యె విధం గా మీడీయా ద్వారా బయట పడుతున్నారు. తెలంగాణా ప్రజలలో నాయకత్వ లేమి స్పష్టం గా తెలుసుతున్నాది.

 

@తారకం

మీరు నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు. మీ ఉద్దేశంలో సామ్యూల్ గారు మూర్ఖులా? బహుషా పరమమూర్ఖులయ్యుంటారు, మూర్ఖులను ఎవరు కాపీ కొడతారు? పరమమూర్ఖులు తప్ప!

 

@snkr
ఎక్కడాకనపడని చరిత్ర ఆధారంగా యిన్ని రోజులూ ఎలా వాదించారు?
ఎలాగంటే నేన్నీలాగా కేవలం పాఠ్యపుస్తకాలలో చరిత్రే చరిత్ర అనుకోలేదు కాబట్టి.

 

కెసిఆర్ తెలంగాణ యాసలో చెప్పిందే చరిత్ర, మీరు చేసిందే సత్యాన్వేషణ అని అందరూ ఒప్పుకుని తీరాలని ఫత్వా జారీ చేస్తున్నారా! :)) అలాగే! మీరు , మీ 'చరిత్ర 'రాయండి, మేము వీలున్నప్పుడు తీరిగ్గా చదికి పెడతాము. :P

 

సత్యాన్వేషి, ఒక్క చరిత్ర మాత్రమేనా లేక మేథ్స్, సైన్సు, జాగ్రఫి కూడా తెలంగాణాకు వేరేగా వున్నాయా? అన్నీ ముక్కోడు గారే చెబుతారా? :))

 

సత్యాన్వేషి,
మీకు ముందు ఒక విషయం స్పష్టం చేయాలి.నేను ఈ బ్లాగు వ్రాసేది మీలాంటి విద్యావంతులలో అలోచన రేకెత్తించి సమకాలీన పరిణామాలపై ఒక అర్థవంతమైన చర్చ జరగాలని.చర్చ పక్కదోవ పట్టకుండా నేను వ్రాసిన ముఖ్యవిషయాలు మీకు అర్థమయినవో లేదో తెలియజేయండి.
1)ఒక ఉపాధ్యాయుడు తను పనిచేసే సంస్థకు,విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసపాత్రుడుగా ఉండాలా,లేక రాజ్యాంగానికా?(ఉపాధ్యాయ పదవి రాజ్యాంగబధ్ధమైనది కాదు గాబట్టి)
2)కోదండరాం గారు 30 యేళ్ళనుంచి నౌకరీ చేస్తూ జీతం తీసుకొటున్నారా,లేక సేవ జేస్తున్నారా?
3)మీరుగూడా ఒక ఉద్యోగే అయ్యుంటారు.మీరు 30 యేళ్ళు ఉద్యోగం చేసి,30 ఏళ్ళు సంస్థకు సేవజేశాను కాబట్టి,రెండు ఏళ్ళు గాలికి తిరుగుతాను,నా జీతం నా హక్కనడం సబబేనా?(కోదండరాం అంటున్నది అదే కదా)

 

సత్యాన్వేషి,

ఇక దేవినేని వంగవీటిల విషయానికి వస్తే ,వాళ్ళిద్దరూ ఒక మామూలు వీధి రౌడీల స్థాయి నుంచి రాజకీయనాయకులు గా ఎదిగిన వాళ్ళు.కోస్తాంధ్ర ప్రాంతం ప్రజల సామాజిక చైతన్యం,ప్రజాఉద్యమాల గురించి మీకేమీ అవగాహన లేదని తెలుస్తోంది.చరిత్ర తెలియనివాడికి భవిష్యత్తు లేదని అంటారు.కందుకూరు వీరేశలింగం పంతులు,గురజాడ అప్పారావు,శ్రీ శ్రీ,చండ్ర రాజేశ్వరరావు ,మాకినేని బసవపున్నయ్య,పుచ్చలపల్లి సుందరయ్య,ఆచార్య రంగా,చలం,త్రిపురనేని రామస్వామి చౌదరి,అల్లూరి సీతారామరాజు,ప్రకాశం పంతులు లాంటి సంఘ సంస్కర్తలు,విప్లవకవులు,వామపక్ష నాయకులు,స్వాతంత్ర సమర యోధులు,రైతు ఉద్యమ నాయకుల లాంటి ఎందరో మహాను భావుల చరిత్ర చదివిన తర్వాత మీరు కోస్తా ప్రాంత ప్రజాఉద్యమాలు,సామాజిక స్పృహల గురించి మీ అభిప్రాయం చెబితే బాగుంటుంది.

 

హరి గారూ,
మీ ప్రశ్నకు సూటిగా సమాధానం చెబుతున్నాను.ప్రొ:శ్యామూల్ గారికి ఈబ్లాగులో వ్రాసిన విషయాలేమీ వర్తించవు.ప్రొ:శ్యామూల్ గారు,'రాజ్యాంగానికి బధ్ధుడనై ఉంటాను,యూనివర్సిటీ కి 30 యేళ్ళు సేవ చేసాను,నాకు జీతం వట్టిగ ఇస్తలేరూ లాంటి అనాలోచిత ప్రకటనలు చేసినట్లు నా దృష్టికి రాలేదు.కోదండరాం గారి మీద తెలంగాణా ప్రజాప్రతినిధులు చేసిన ఆరోపణల లాంటివి ,శ్యామూల్ గారి మీద ఆంధ్ర ప్రజాప్రతినిధులెవ్వరూ చేయలేదు.

 

@తారకం

రాజ్యాంగానికి విశ్వాస పాత్రంగా ఉండాలా, రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వాస పాత్రంగా ఉండాలా, లేక వైస్ చాన్సలర్‌కి విశ్వాస పాత్రంగా ఉండాలా అనే విషయాలు కాసేపు పక్కన పెడదాం. అలాగే వారు చేసేది రైటా, తప్పా అనే వివరాలు కూడా వదిలేద్దాం. వారు చేసేది చట్ట విరుద్ధమైతే ఆ పని చట్టం చూసుకుంటుంది.

ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒకే విధమైన పని చేస్తున్నప్పుడు ఒకరు చేసేది తప్పు, ఇంకొకరు చేసేది కరెక్టు ఎలా అవుతుంది?

అంటే తాము చేసేది సమర్థించుకొని చేస్తే అది తప్పు, సమర్థించుకోకుండా అదే చేస్తే అది ఒప్పు అవుతుందా?

 

@ హరి ---
మీరు చెప్పినవి అన్నీ పక్కన పెడితే అందరూ మంచి వారే అవుతారు

 

@hari---

గాంధీ ని చంపకపోతే గాడ్సే,
యూదులని ఊచకోత కోయకపోతే హిట్లెర్,
al qaeda స్థాపించి ఉగ్రవాదం చేయకపోతే బిన్ లాడెన్,
సిఖ్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించక పోతే భిన్ద్రన్వాలే,
ముంబై దాడులు చేయకపోతే కసబ్,
అలాగే మతిలేని ,బుద్ధి హీన వ్యాఖ్యలు చేయకపోతే కెసిఆర్ ,కోదండరాం , మీరు చెప్పిన దాని ప్రకారం మంచివారే అవుతారు ,
ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పక్కనపెట్టి మీరు వాదిస్తే , అసలు ఆ వాదనకు అర్ధం ఏంటి ?

 

Post a Comment