కెసిఆర్ ceo ల సమావేశం అనంతరం విలేఖరుల తో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల ప్రస్తావన తెచ్చాడు. తెలంగాణా విభజన జరిగితే తానేమి చేయబోతున్నాడో తన మనసులో మాట అసంకల్పితంగా వెళ్ళబుచ్చాడు.
గుజరాత్ కంటే అగ్రగామిగా నిలుపుతానన్నాడు.అంటే గుజరాత్ లో నరేంద్రమోడి సర్కార్ లాగా హిందూ ముస్లిం వైషమ్యాలను రెచ్చగొట్టి తెలంగాణా ముస్లిం లను ఊచకోత కోసి ఆ సమాధుల మీద తన సామ్రాజ్య సౌధాలను నిర్మించుకొందామను కొంటున్నాడు.కర్ణాటకకు దీటుగా రాష్ట్రాన్ని నిలబెడతాడట.అంటే బయ్యారం నుంచి కరీంనగర్ వరకు విస్తరించి ఉన్న అపార ఖనిజ సంపదను ఏ దొరలకో అప్పజెప్పి రాష్ట్రాన్ని మరో గనుల మాఫియా చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు.
ఇక జార్ఖండ్ లో వృధ్ధి రేటు విడి పోక ముందు కంటే చాల మెరుగైంది అంటున్నాడు. తన కుటుంబ సభ్యుల్లో కొంత మందిని మధు కోడాల ను తయారు చేసి తెలంగాణాను మరో గుర్రపు సంత (horse trading centre ) లా మారుస్తాడు. ఈయన ఉదహరించిన మరో రాష్ట్రం చత్తిస్ ఘర్. అక్కడ లాగా పరిపాలన మొత్తం తీవ్రవాదుల కప్పజెప్పి ఎంతో మంది అమాయకుల ( రెండు వర్గాల నుంచి ) ప్రాణాలు గాలిలో దీపాల వలె చేస్తాడు.
అందాల రాముడు సినిమా లో నాగేశ్వరరావు, రాజబాబు తో అంటాడు` నీ బుర్ర ఒక బాత్రూం రా` అని. అలాగే ఈయన నోరు మరుగు దొడ్డి. తన నోటితో నిష్కారణం గా తెలుగు జాతి మధ్య వైషమ్యాలు సృష్టించి నిలువుగా చీల్చాలనుకొనే స్వార్థపరుడు. ఇతడొక విధ్వంసకరమైన రాజకియుడే కాని నిర్మాణాత్మక రాజనీతిజ్ఞుడు కాదు.
2009 ఎన్నికల్లో తెదేపా మరియు వామ పక్షాలతో కలసి మహాకుటమి గా ఏర్పడి, పోటీచేసి ఫలితాలు రాకుండానే భాజపా తో చేతులు కలిపినా అవకాశవాది. భాజపా పాలనలో భ్రష్టుపట్టిపోయిన నాలుగు రాష్ట్రాలను ఆదర్శం గా తీసుకొని అక్కడి సిద్ధాంతాలను తెలంగాణా లో ఆచరణలో పెట్టలనుకొనే ఒక భావ దారిద్ర్య,దివాలాకోరు వ్యక్తి. తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!
10 comments:
Chooste Peddamanishila Unnaru. Vichakshana Marchipoyi Post Raasaru. Nijaniki Yenta Abhivruddi Chendina Rastramina Samasyaluntayi. Overall ga chooste E Rastram Abhivruddhi lo Undi ani maatrame choodali. Deshamlo Avineeti, Akramala Kampu Kottani Rastramedi. AP aite number one. Daanikante Gujarat chala better. ee tapalo KCR meeda Unna vyatirekha Bhavame Kanapadutundi Tappa Janalaku edo vishayam cheppalni anipinchadam ledu.
అయ్యా srinucpd గారూ,
ఎంత విచక్షణాపూరితమైన కామెంట్ సార్ మీదీ?
"Deshamlo Avineeti, Akramala Kampu Kottani Rastramedi. AP aite number one."
ఔను. బందులు, బస్సులు తగలెయ్యడాలూ, దొంగ నిరాహార దీక్షలూ మరియూ నాలుకలు తెగ్గొయ్యడాలలో కూడా AP నంబర్ వన్నే.
"Daanikante Gujarat chala better."
నిజమే, అది భూతల స్వర్గం. ఏవో రైలు బోగీల దహనాల్లాంటి కొన్ని చిల్లర మల్లర సంఘటనలు తప్ప.
"ee tapalo KCR meeda Unna vyatirekha Bhavame Kanapadutundi Tappa Janalaku edo vishayam cheppalni anipinchadam ledu."
అద్భుతమైన విశ్లేషణ!
అంటే సీమాంధ్ర నేతల ఆగడాలు, శుష్క సమైక్య వాదనల గురించి తారకం గారు చెప్పాల్సింది. అంతే కదా ?
దైవ సమానుడైన KCR గారి పైన వ్యతిరేక భావనలా? ఎంత తప్పు!
అవును మరి పులకేసి అంటేనే తెలంగాణా , తెలంగాణా అంటే పులకేసి .
పులకేసిని ఏదన్న అంటే ఈ కలెక్షన్ ఏజెంట్లకు పొడుచుకుని వస్తుంది హెహెహ్
ఖలేజా, బృందావనం నిర్మాతల దగ్గర 4 కోట్లు దొబ్బరంటగా ... ఇప్పుడు దిల్ ఖుష్ అంటగా
/ గుజరాత్ లో నరేంద్రమోడి సర్కార్ లాగా హిందూ ముస్లిం వైషమ్యాలను రెచ్చగొట్టి .../
You are unnecessarily targetting Modi with meaningless emotion. KCR vs Modi is nakka vs nagalOkalam, respectively. Modi's Gujarath is #1 developed state. Tgna will be worse than Chattisghad if formed.
వాడిమొహం సార్. అసలు ఆ మీటింగులో ఏమి జరిగిందో బయటికివస్తేగానీ తెలీదు. ఈయనగారిచ్చే పవర్ పోయింట్లకోసం నాలుగ్గోడలమధ్య మీడియాకి అనుమతిలేకుండా చేయాల్సిన పనేంటి? ఏదో కారుకూతలు కూస్తున్నాడు, అదుగో తెలంగాణ, ఇదుగో తెలంగాణ అని జనాలని మభ్యపెట్టడంలో ఇది ఒక ఎత్తుగడ.
I agree with Sankar. Modi is much better than KCR, YSR or Rosaiah.
@srinucpd
మీ ద్రుష్టి లో మహానుభావుడైన కెసిఆర్ గురించి నిజాలు రాస్తే మీలాంటి వారికి విచక్షణ పూరింతంగా రాసారు అని అనిపించడం లో ఆశ్చర్యం లేదు ,, మీకు అర్ధం కాక పోతే ఇంకో సరి చదివి చుడండి ఇక్కడ రాసింది మన రాష్ట్రము లో జరుగుతున్న అవినీతి గురించో అభివ్రుది గురించో కాదు కెసిఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో అని......
తెలంగాణా విషయము పట్ల కెసిఆర్ అభిప్రాయములు మీరు బాగా ఊహించారు.ప్రత్యేకరాష్త్రము ఏర్పడితే వునికిని కొల్పేయే వ్యక్తి తానేనని ఆయనకు బాగా తెలుసు అందువల్ల సమైక్యవాదులకు ఆయన అండఎల్లప్పుడువుంటుంది,అందుకు మనమందరం ధన్యవాదాలు తెలుపుదాం..
dear sri tummala
27sep ఆంధ్రజ్యోతి లో ఇచ్చిన ప్రకటన లో కెసిఆర్ తెలంగాణా రాష్ట్రంలో నక్సల్స్ అజెండా అమలు చేస్తామన్నారు. నక్సల్స్ చెప్పినట్లుగానే తెలంగాణా లో సామాజిక, ఆర్ధిక అసమానతలను తొలగిస్తామని, భూపంపిణీ చేబట్టి, పారదర్శక పాలన చేస్తామన్నారు.
పైన పేర్కొన్న అంశాలన్నీ అన్ని పార్టీలు అమలు చేస్తామనేవే. కానీ నక్సల్స్ కు మిగతా పార్టీలకు వారనుసరించే పంథాలోనే మౌలికమైన తేడా ఉంది. మిగతా పార్టీలన్నీ ప్రజాస్వామ్యబద్ధం గానే ఈ కార్యక్రమాలను చేబడితే నక్సల్స్ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆ లక్ష్యాలు సాధ్యమని నమ్ముతారు. ఇంటువంటి ప్రాధమిక అంశం మీద కూడా కెసిఆర్ కు అవగాహన లేదంటే మీరు నమ్ముతారా? సమ కాలీన రాజకీయుల్లో అత్యంత తెలివైనవాడు కెసిఆర్.
మొన్న లగడపాటికి ప్రేమ సందేశాలు, నిన్న CEO ల సమావేశానంతరం చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు, ఇప్పుడు ఈ అనాలోచిత ప్రకటన. ఇవన్నే ఒక పధకం ప్రకారం వేసే ఎత్తుగడలుగా నా కనిపిస్త్తున్నది.ఇటువంటి చర్యల ద్వారా తనంతట తాను అప్రతిష్ట మూట కట్టుకొని నెరవేరని లక్ష్యం గల ఉద్యమానికి దూరంగా జరగడానికి సన్నాహాలు చేసుకొంటూన్నాడా? ఈ తైతక్కల వెనుక ఎ అమ్మ అదృశ్య హస్తం ఉందో?
sri srinucpd,sri srinivas,sri srikrishna,sri snkr,sri malakpetrowdy,sri tummala,& the one
మీరందరికీ వందనములు. మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా లేకున్నా నాతో మీ భావాలు పంచుకొన్నందుకు చాలా కృతజ్ఞతలు.
Post a Comment