sep 18 ఆంధ్రజ్యోతి లో ఆదిత్య గారు వ్రాసిన దారి తప్పిన న్యాయ - వాదం అనే వ్యాసం లో ఆయన పడిన ఆవేదన ఆలోచనపరులైన సభ్య సమాజ వ్యక్తులందరినీ కలచి వేసేదే. ప్రజాస్వామ్యానికి legislature , executive , judiciary లు మూడు మూలస్థంభాలు అనే విషయం మనకందరికీ తెలిసినదే. న్యాయవాదులు , న్యాయమూర్తులు పైన ఉదాహరించిన మూడవ స్తంభం లో అంతర్భాగం . ఈ సంగతి మరచి అతి జుగుప్సాకరం గా ( కిరాయి గుండాల లాగా అని వ్రాద్దామనుకొన్నాను గానీ అది చాలా చిన్న పదం లాగా నాకనిపించింది ),నీచంగా,హేయంగా న్యాయవాదులు తమ సొంత వ్యవస్థ మీద చేసిన దాడి , తల్లిని చెరిచిన ఘాతుకం తో సమానం . ఈ దాడికి పాల్పడిన న్యాయవాదులనే క్రిమి కీటకాలు రాజ్యాంగం ప్రకారం వేయబడే అతి పెద్ద శిక్షకు అర్హులు .
0 comments:
Post a Comment