2004
జగన్: నాన్న గారూ ఎంతో మంది మహానుభావులు మనవాళ్ళు ఉన్నారు. అంతెందుకు భావి తరాలకు ఆదర్సవంతుడు, మడం తిప్పని మన వంశానికి మూల పురుషుడు మా అబ్బ రాజారెడ్డి ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి మీరేమిటి ఇలా అన్ని పథకాలకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ల పేర్లే పెడుతున్నారు?
ysr : నాయనా ఒక విషయం గమనించావో లేదో పది నుంచి వెయ్యి రూపాయల నోటు దాకా ప్రతి దాని మీదా గాంధీ బొమ్మ ఉంటుంది. మనకు ఈ గాంధీ లు కావాలంటే ఆ గాంధీ ల భజన తప్పదురా !
2010
విజయలక్ష్మి: నాయనా జగన్ మీ నాన్న గారు బ్రతికి ఉండగా ప్రతి రోజు ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ ల నామ జపం చేసే వాళ్ళు. నీవేమిటి ఒక్క రోజు కూడా సోనియా గాంధీ ని కాని , రాహుల్ గాంధీ ని కానీ తలచు కోవేమిటి ?
జగన్: ఆమ్మామనకు కావలసిన గాంధీ లను నాన్నగారు మనకు పుష్కలంగా ఇచ్చి పోయారు గా . ఇంకా ఈ గాంధీ ల తో మనకు పనేమిటి ?
5 comments:
హహ్హహ్హా.. భలే!
("మా అబ్బ" అని పొరపాటున పడినట్టుంది.. "మీ అబ్బ" కదా!)
కాదు కరెక్టే. కడప భాష లో అబ్బ అంటే తండ్రి కి తండ్రి అని అర్థం
super andi
i like this best of all mamayya
thanq chinni
Post a Comment