దేవత సోనియా,ఇటలీ నియంతగా మారిన వైనం

భారతదేశమంతా సోనియాగాంధీ సొంత సామ్రాజమైనట్లు,అందులో ఆంధ్రప్రదేష్ ఒక సామంత
రాజ్యమైనట్లు వ్యవహరిస్తున్నారని,దేశంలో ఇంగ్లీష్ పాలన పోయి ఇటలీ పాలన
వస్తుందనే భయం వేస్తుంది అని వ్యాఖ్యానించాడు తుడా మాజీ అధ్యక్షుడు
చెవిరెడ్డి భాస్కరరెడ్డి.ఈయన ఏ భాజపా వాడో లేక ఆర్యస్‌యస్ వాడో అని సందేహం
కలగడం సహజం.ఇతగాడు రాశేరె అనుంగు శిష్యుడు.టిటిడి పాలకమండలి సభ్యుడుగా
దేవస్థానం డబ్బు దారిమళ్ళించి తన వూరికి రోడ్డు వేయించుకొని అన్నిరకాల
అవకతవకలకూ పాల్పడ్డ వ్యక్తి.2009 లో ప్రజలు రాశేరె ను ముక్యమంత్రిని
చేయడానికే కాంగ్రెస్ కు వోటు వేసారట.కాంగ్రెస్ పార్టీ,ఆం.ప్ర.రాష్ట్రం
రాశేరె కుటుంబసభ్యుల సొత్తు లా కనపడుతోందీ సత్రకాయలకు.
2004 లో పిసిసి అధ్యక్షుడికే ముఖ్యమంత్రి పదవి అనేసంప్రదాయాన్ని పక్కకు
పెట్టి మరీ రాశేరె ను ముఖ్యమంత్రిని చేస్తే,ఆయన తన అనుచరగణాన్ని అందలం
ఎక్కించి ,రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేయనిచ్చినన్నాళ్ళూ సోనియా ఒక
అమ్మ,ఒక దేవత.2004 లో రాశేరె కు అవకాశమిచ్చిన రీతిలోనే కిరణ్ కుమార్ కు
సియం పదవి కట్టబెట్టగానే ఆమె ఇటలీ వనిత,నియంత గా మారిపోయిందట.ఎంత
హాస్యాస్పదం.పాపం సోనియా చిన్నప్పుడు కొత్త ఆంధ్రవాచకం చదువుకోలేదు.అందుకే
పాముకు పాలు పోసింది,ఫలితం అనుభవిస్తున్నది.చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత
మహదేవా అన్నారు పెద్దలు.(కొ.ఆ.వా.లో కధ మనకందిరికీ తెలిసిందే.రైతుకు తన
చేలో పాముపిల్ల దొరికితే దాన్నింటికి తెచ్చి పాలుపోసి ప్రేమగా
పెంచుతాడు.పాము పెద్దదై రైతును కాటు వేసి చంపుతుంది.నీతి:దుష్టులను
చేరదీయరాదు.)

5 comments:

బాగా చెప్పారు తారకం గారు,
చంద్ర బాబు వెన్నుపోటు పొడవ లేదు.చంద్రబాబు మరో అశోకుడు.
N T రామా రావు మరో బుద్దుడు.
పరిటాల రవి మరో భగత్ సింగ్.
బాలకృష్ణ మరో రామ కృష్ణ పరమహంస.
బుడ్డ రామా రావు మరో వివేకానంద.
కోడెల శివ ప్రసాద్ మరో అర్జునుడు.
NG రంగా చాణక్యుడు.
ఇటువంటి విషయాలు చెప్పి మా కళ్ళు తెరిపిస్తున్నారు. ఈ విషయాల మీద మీరే ఒక బుక్ రాసి ఈ బ్లాగు లోకం లో విడుదల చెయ్యొచ్చు కదా!!!
ప్రజలు విని తరిస్తారు.

 

ఈ వీడియో చూస్తుంటే మీరు చెప్పే దానికి,రామా రావు గారు చెప్పే దానికి పోలికే లేదు.ఇంతకీ మీరు అబద్దాలు చెప్తున్నర?రామా రావు గారు అబద్దం చెప్తున్నర?

http://www.youtube.com/watch?v=ZmnFXHU2dqo&feature=player_embedded

 

తారకంగారూ, నాకేగాదు మీ రాతలు చదివితే...మీరేమిటో కామన్ సెన్స్ ఉన్న ప్రతిఒక్కరికీ అర్ధమవుతుందని పై కామెంట్(అప్పి-బొప్పి) చూసయినా తెలుసుకోండి. కళ్ళు మూసుకుని పాలుతాగిన పిల్లి చందాన ఉంది మీ వ్యవహారం చాకిరేవుగారూ...సారీ తారకంగారూ.

 

ఏది అయితే ఏం లెండి మన రాష్ట్రానికి పట్టిన పెద్ద శని విరగడ అయిపొఇన్ది .
సోనియా మాత పెద్ద శిష్యులు వచ్చారు anti -కామెంట్స్ చేయటానికి మీరు వాళ్ళని ఏమి పట్టించుకోవద్దు .


@అప్పి-బొప్పి --

అసలు అంటే అన్నము అంటారు కాని మీరు రాసిన కామెంట్ కి ఈ ఆర్టికల్ కి ఎమన్నా సంబంధం ఉందా? , మీరు చెప్పిన పేర్లలో ఒక్కటి కూడా అక్కడ ప్రస్తావించారా?
, మీ సోనియా మాత గురించి కుడా మీకు కొన్ని నిజాలు చెప్పాలి , ofcourse మీకు పెద్ద ఎక్కవు లెండి కాని నా ప్రయత్నం నేను చేస్తా కింద links చుడండి ఒకసారి మీ సోనియా మాత గురించి రాహుల్ బాబు గురించి మరిన్ని గొప్ప విషాలు తెలుస్తాయి

http://video.google.com/googleplayer.swf?docId=4429400474217380163

మీ రాహుల్ బాబు గురించి చిన్న శాంపిల్

http://en.wikipedia.org/wiki/Rahul_Gandhi#Controversies

మీరు లిస్టు లో చెప్పిన వారు అందరు మహానుభావులు అవునో కాదో తెలియదు కాని మీ మాత ఇంకా వారి పుత్ర రత్నం మాత్రం చాల పెద్ద గొప్ప వారు అండి బాబు

@తేజస్వి--

వచ్చేసారా మీ పెద్ద మాత శిష్య batch ని వేసుకుని , మీ లాంటి వారి గురించి కృష్ణ గారు తన బ్లాగ్ లో ఎప్పుడో ఒక ఆర్టికల్ రాసారు ఒక సరి చదువుకోండి

http://hittingontheface.blogspot.com/2010/10/blog-post_30.html

btw ఇప్పుడే మీ బ్లాగ్ లో కొన్ని ఆర్టికల్స్ చదివాను , కామన్ సెన్స్ గురించి మీరు మాట్లాడ వద్దు అండి ప్లీజ్ నాకు నవ్వు ఆగట్లేదు ,

 
This comment has been removed by the author.
 

Post a Comment