బాబ్రీమసీదు రామ జన్మభూమి వివాదం లో అలహాబాద్ హై కోర్ట్ స్పెషల్ ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఎంతో ఉత్కంట రేపి మరో వివాదానికీ తెర లేపింది. ఈ తీర్పు సమకాలిన దేశ రాజకీయనాయకులకు కొట్టిన చెంప దెబ్బ గా నేను భావిస్తున్నాను. ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం చూపెట్టాల్సిన రాజకీయ నాయకత్వం తమ నిశ్క్రియప్రియత్వంతో సమస్యను జటిలం చేసి తీర్పు వస్తోందన్న తలపే అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఇంత రాజకీయ శూన్యత ఏర్పడటానికి ప్రధాన కారణం ఇందిరాగాంధీ. ఏకత్వ(ఐడెంటిటీ) రాజకీయాలకు పునాదులు వేసి బ్రాహ్మణ ,ముస్లిం,దళిత,భూస్వామ్య వ్యవస్థ గల కులాల సమీకరణంతో ఒక గెలుపు సూత్రం ఆచరణలో పెట్టింది. ఇందిర తదనంతరం కాంగ్రెస్ పార్టీ అదే సూత్రాన్ని కొనసాగించటం వలన కాంగ్రెస్ ప్రత్యర్థులు ప్రత్యమ్న్యయ కులాలను ఏకీకృతం చేసి వెనకబడిన కులాల సారధ్యం లో ఆయా రాష్ట్రాల సామాజిక పరిస్థితులకనుగుణం గా ఎన్నికలలో పోటీ చేయడం మొదలు పెట్టారు . సోషలిస్ట్ సిధాంతాలతో ప్రభావీతులై న ములాయం ,లాలూ ,నితీష్ లాంటి నాయకులు సైతం ఇటువంటి సమీకరణాలతోనే ఎన్నికలలో గెలవటం జరిగింది. వి పి సింగ్ మండల్ కార్డ్ తో ముందుకొచ్చినా , మాయావతి ఉ.ప్ర . లో డళిత కార్డ్ తో గెలిచినా ఈ పరిణామ క్రమం లో భాగమె. ఈ విధం గా జారూడు మెట్లు దిగుతూ ప్రతి రాజకీయ నాయకుడు ఒక కులానికో, ప్రాంతానికో , భాషకో,లాబీ కొ పరిమితమై జాతీయ దృక్పధం కొరవడటమే నేటి దుస్థితికి కారణం.
1990 ల ప్రాంతం వరకు ముస్లిం లు ఐడెంటిటీ క్రైసిస్ తో బాధ పడుతూ వోట్ బాంక్ రాజకీయాల్లో పావుల్ళా మారి ప్రతి చిన్న విషయానికి తీవ్రం గా స్పందిస్తూ రాజకీయనాయకుల చేతుల్లో కీలు బొమ్మల్లా,ముళ్ళాల ఫత్వాలు అమలు చేస్తూ బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఆ గర్భ దారిద్ర్యంలో కొట్టు మిట్టాడుతూ ఉండే వారు. ఆర్ధిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత ముస్లిం యువత కలసివచ్చిన విద్యావకాశాలను అందుకొంటూ , అభివ్రిధ్ది బాటలో పయనిస్తూ లెక్క సరిచూసుకొనే స్థాయి నుంచి ముందుకు సాగిపోయే స్థాయి కి ఎదిగారు .ముస్లిం యువత ముళ్ళాల ఫత్వా కంటే మైక్రో సాఫ్ట్ కాల్ లెటర్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత దేశం లో అత్యున్నత స్థానాల నలంకరించి, విద్యా వాణిజ్య రంగాల్లో ముందంజ లో ఉన్నారు. పొరుగు ముస్లిం దేశాలలో అత్యధిక ప్రజానీకం సామాజికంగా, ఆర్థికంగా ఎంత దయనీయ పరిస్థితులలో ఉన్నారో , ఎంత మంది యువత హింసా మార్గం లో పయనిస్తూ జీవితాలు కోల్పోతున్నారో గమనిస్తూనే ఉన్నారు .
ఈ తీర్పు మీద మన దేశ ముస్లిం లు చాలా అసంతృప్తి తో ఉన్నారని, తమ బాధను దిగమ్రింగుకొని నివురుగప్పిన నిప్పులాఉన్నారనే చాలా మంది విశ్లేషకుల అభిప్రాయంతో నెనేకివభించను. ఎంతో మంది కుహనా లౌకికవాదులు , సంకుచిత రాజకీయనాయకులు రెచ్చగొట్టినా ముస్లిం సమాజం నుంచి ఈ తీర్పు కు వచ్చిన పరిపక్వ స్పందన కు పైన ఉదహరించిన కారణాలే మూలమని నమ్ముతూ ప్రతి భారతీయుడూ హర్షించ దగిన తీర్పు ఇచ్చినందుకు అల్లహాబాద్ హై కోర్ట్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .
2 comments:
వోహ్! చాలా చక్కగా చెప్పారు.
'ముస్లిం' తీసేసి, మహమ్మదీయులు అనో, సాయిబ్బులు అనో వ్రాస్తూ వుండండి. సరిపోతుంది.
తమసోమాజ్యూతిర్గమయ సూత్రము హిందూదేశ ముస్లిములకు పనిచేయటంప్రారంభమైనదని భావించుదాము.
Post a Comment