బ్రాహ్మణుడు,మేకపిల్ల-నలుగురు దొంగల కధ
డిసెంబర్ 9 న చిదంబరం చేసిన ప్రకటన ,ఆంధ్రప్రదేష్‌రాజకీయాల్లో పెను మార్పు తెచ్చిన సంఘటన.ప్రకటన వెలువడిన మర్నాడు లగడపాటి రాజీనామా తో మొదలయి ఆంధ్రప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామాలతో జోరందుకొని అన్ని పార్టీ ల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించాయి.
ప్రణబ్‌ముఖర్జీ కమిటీ కు తాము తెలంగాణా కు అనుకూలం అని లేఖ ఇచ్చిన చంద్రబాబు,రోశయ్య ముఖ్యమంత్రి గా ఆయన అధ్వర్వం లో జరిగిన అన్ని పార్టీల సమావేశం లో కూడా తాము తెలంగాణా కు అనుకూలమని చెప్పారు.అయినా కెసిఆర్,కోదండరాం, తెలంగాణా జాక్‌నుంచి చిన్నా చితకా కాంగ్రెస్ నాయకుల వరకూ చంద్రబాబునూ,తెదేపా ను తెలంగాణా ఏర్పాటుకు ప్రధమ అడ్డంకి అనీ,తెలంగాణా ద్రోహుల పార్టీ అని నిందించడం నాలాంటి ఎందరినో సంభ్రమాఛ్యర్యాలకు గురి చేసింది.రాష్ట్రంలోను, కేంద్రంలోను అధికారంలో ఉన్న పార్టీ రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయి నిరాశా నిస్ప్రుహలతో ఉన్న విపక్షాన్నీ,చేష్టలుడిగి దిక్కుతోచని పరిస్థుతలో ఉన్న ఆ పార్టీ అధినేతను ఆడిపోసుకోవడం,తూలనాడటం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎంతో మంది మెదళ్ళను తొలుస్తున్న మాట మాత్రం నిజం.
అసలు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనకు తెర వెనక భాగోతం ఏమిటి ?2009 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి భద్రతాసలహాదారు నారాయణన్‌మావోయిస్టుల విజ్రుంభణ,ముస్లింఫండమెంటలిసంలు తెచ్చే కీడును ధ్రుష్టిలో ఉంచుకొని ,ప్రత్యేక తెలంగాణా కు వ్యతిరేకంగా ఇచ్చిన సలహాను చిదంబరం ఎందుకు పాటించలేదు?2014 లో రాహుల్‌గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమనే రంగుల కల అధినాయకురాలి ఏకైక అజెండా కాబట్టి,ప్రత్యేక తెలంగాణా ఇస్తేనే అది నెరవేరుతుందని కెసీఅర్ అనే రాజకీయమాంత్రికుడు క్రిస్టల్ బాల్ లో చూపించడమా?ఆంధ్రప్రదేష్‌సామాజిక రాజకీయ పరిస్థితుల మీద ఏమాత్రం అవగాహన లేని అహమ్మద్‌పటేల్ లాంటి రాజకీయసలహాదారులు ఇచ్చిన ఒకేదెబ్బకు రెండు పిట్టలు(జగన్,చంద్రబాబు)లాంటి అపరిపక్వ సలహా కారణంగానా?తన చిన్నతనంలో ఆనాటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర వేర్పాటు ఉద్యమం గురించి విన్న బాల చిదంబరం మనసులో ఉన్న వ్యతిరేకభావనల పర్యవసానమా? ఆం. ప్ర.రెండుగా చీల్చి,దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి తమిళనాడుకు లభ్ది చేకూర్చాలన్న కుట్రపూరిత భావనతోనా?ఏది ఏమైనా కాంగ్రెస్అధిష్టానం ఆంధ్రప్రాంతంలో ప్రజలనుంచి,తమ పార్టీ ప్రజాప్రతినిధులనుంచి ఉవ్వెత్తున ఎగసిన వ్యతిరేక స్పందనను ముందస్తుగా అంచనా వేయలేదనేది వాస్తవం .కాంగ్రెస్‌పార్టీ తన ఘోర తప్పిదాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నమే చంద్రబాబు మీద ఈ బురద జల్లే కార్యక్రమం.
చంద్రబాబును తెలంగాణా ద్రోహిగా చిత్రించడానికి కాంగ్రెస్ పార్టీకున్న రాజకీయ అవసరం మనం గుర్తించాం.మరి కెసిఆర్,కోదండరాం ,ఓయు జాక్ వీళ్ళ మాటేమిటి?రోజూ చంద్రబాబు మీద వీళ్ళు కారాలూ మిరియాలూ నూరాల్సిన అవసరం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందే ప్రత్యేకరాష్ట్రం ఇస్తే శాసనసభ్యుల సంఖ్యాపరంగా దానికే మెజారిటీ ఉంటుంది గాబట్టి అదే అధికారపార్టీ అవుతుంది.కాంగ్రెస్‌తర్వాత అత్యధిక శాసనసభ్య్లు మరియు ఓట్ బాంక్ ఉన్న పార్టీ తెదేపా.తెలంగాణా ఏర్పడితే తెదేపా ప్రతిపక్షం లో ఉండి రెండో స్తానం లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు పోటీ రెండో స్థానం కోసమే.కెసిఆర్.కోదండరాం.మొ: వాళ్ళంతాకాంగ్రెస్ పేరోల్ లో ఉండ బట్టీ తెలుగు దేశాన్ని ఎంత బలహీనపరిస్తే అంత లాభం కనుకే తెలంగాణా లో చంద్రబాబు పర్యటనలడ్డుకుంటూ వంతులవారీగా తెదేపా మీద తిట్ట్ల దండకం చదివేది.
ఈ తమాషా చూస్తుంటే చిన్నపుడు చదివిన బ్రాహ్మణుడు-మేక పిల్ల కధ గుర్తొస్తున్నది.బ్రాహ్మణుడు మేక పిల్లతో వెళ్ళ్తుంటే మైలుకొక దొంగ నిల్చొని కుక్కను కట్టేసి తీసుకెల్తున్నావని గేలి చేస్తూ ఉంటారు.చివర్లో బ్రాహ్మనుడు మేకనొదిలేసి వెళ్ళిపోవడం ఆ నలుగురు మేకను కోసుకొని తినడం అందరికీ తెలిసిన కధే.ఇప్పుడు జరుగుతున్న కధలో కూడా కెసిఆర్,కోదండరాం,ఓయు జాక్,కాంగ్రెస్ కలిసి తెలంగాణా అనే మేకను కోసుకొని తినడం ఖాయం.
ప్రతేక తెలంగాణా ఇస్తే ఆంధ్రాలో ఏ పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమేమీ కాదు.ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సంభవిస్తుంది. కేంద్రం లో మమతా బెనర్జీ(గూర్ఖాలాండ్) ,శరద్‌పవర్(విధర్భ),కరునానిధి (వన్నియార్ దేశం),తమ తమ రాష్ట్రాల్లో ఉన్న ప్రతేక రాష్ట్రాల కోరికల ద్రుష్ట్యా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించక తప్పదు.అయినా కాంగ్రెస్ పార్టీ మూర్ఘంగా ముందుకెళితే కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయం.పైన విశదీకరించిన కారణాలమూలాన కాంగ్ర్స్‌పార్టీ పరిస్థితి ముందు గొయ్యి,వెనుక నుయ్యి.
డిసెంబర్ 9 న చిదంబరం చేసిన అనాలోచిత ప్రకటన పరిణామాలకు బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం మీదా చంద్రబాబు మీదా చేసే దుష్‌ప్రచారం నపుంసక ఆగ్రహజ్వాల మాత్రమే.సమస్యలను నాన బెట్టడం వాయిదావెయ్యడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య . ఆ ప్రయత్నం లో భాగమే శ్రీక్రుష్న కమిటీ ఏర్పాటు.
వివిధ రంగాల్లోని నిపుణులతో కూర్చిన కమిటీ ఆంధ్రప్రదేష్ అవతరణ తర్వాత ప్రాంతాలవారీగా జరిగిన అభివ్రుధ్ధి,ఆదాయ వ్యయాల నిగ్గు తేలుస్తుంది కాబట్టి వేర్పాటువాదుల అభద్ద ప్రచారాలకు ఇకనైనా తెరపడుతుందని ఆశిద్దాం.
తెలంగాణా ప్రజలు ఇకనైనా నిజమైన దోషులను గుర్తించి (కాంగ్రెస్,టిఆర్యస్,కోదండరాం తదితరుల) మాయగాళ్ళ ఉచ్చు లో పడకుండా హైదరాబాద్ పునర్‌వైభవానికి, తద్వారా ఆంధ్రప్రదేష్ అభివ్రుధ్ధిలో భాగస్వామ్యులౌతారని ఆసిస్తూ.(నా స్నేహితుడు చలసాని శిశిర్ సలహాలు తీసుకొని వ్రాసిన వ్యాసం)
45 comments:
Meeru cheppindi 100% correct. Kaani gorre kasaayini nammadamanedi evaru maarcha leni thalaraatha.Nijanga ee vishayamlo evaru cheppina vine sthithilo vaaru leru. Avathalunna kasaayila jiththulu alaantivi mari.
ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి తాము తెలంగాణా కు అనుకూలం అని లేఖ ఇచ్చిన చంద్రబాబు,రోశయ్య ముఖ్యమంత్రి గా ఆయన అధ్వర్వం లో జరిగిన అన్ని పార్టీల సమావేశం లో కూడా తాము తెలంగాణా కు అనుకూలమని చెప్పారు.అయినా
>>>>>>>
తెలంగాణా ప్రజలు తెలుగు దేశాన్నీ, చంద్ర బాబునూ అన్యాయంగా ...మూర్ఖంగా .. తెలంగాణా ద్రోహులుగా
పరిగణించడం మీకు చాలా బాధగా ఉందంటారు.
తెలుగు దేశం, చంద్ర బాబు ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమే అని వాదిస్తూనే చివర్లో ఎంత నైస్ గా సమైక్య పాట పాడారో .
మీది ఎంత ఆత్మా వంచానో చంద్ర బాబుది అంతకంటే వెయ్యిరెట్ల నయ వంచన...
ఆయనదీ మీ పాలసీయే.
తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టో లో ప్రత్యేక తెలంగాణా అంశాన్ని చేర్చి, ప్రణబ్ ముకర్జీ కమిటీకి ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమని లేక ఇచ్చి ... ఆల్ పార్టీ మీటింగ్లో అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అని వాగ్దానం చేసి
తీరా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక తెలంగాణా ప్రక్రియను మొదలు పెడుతున్నాం అనగానే తెలుగు దేశం పార్టీ వ్యవహరించిన తీరు ఎలా వుంది?
రాజీనామాలు, హర్తాళ్లు, నిరాహార దీక్షలు, లగాపాతిని రాజకుమారి ముద్దుపెట్టుకోవదాలు
పార్లమెంటులో టీడీపీ ఎంపీల ధర్నా
మద్రాసులోని చిదంబరం బంగళూరు లోని మొయిలీ అర్ధరాత్రి ప్రకటన చేసారంటూ చంద్రాబాబు రెచ్చగొట్టడం
ఇవన్నీ మీకు బాగానే అనిపిస్తున్నాయా?
తెలంగాణా ప్రజలు వాళ్ళను నమ్మకపోవడం, ఉప ఎన్నికలలో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కకుండా ఘోరంగా వోదించడం మాత్రమే మింగుడు పడటం లేదా?
మరొక్క సారి మొత్తం వ్యవహారాన్ని నిజాయితీగా ఆలోచించండి.
తెలంగాణా ప్రజల ఆకాంక్ష ఇంట బలంగా వ్యక్తమవుతున్నా కూడా మీ పాట మీ దేనా ?
అయ్యా తారకం గారూ,
మీ రంగు కళ్ళద్దాలు తీసి ఒకసారి ఆలోచించండి.
మొదట సమైఖ్యాంధ్ర, తరువాత ప్రత్యేక తెలంగాణాకి సపోర్టు, ఆతర్వాత రెండుకళ్ళ సిద్ధాంతం; ఇన్ని రకాలుగా ప్లేటు ఫిరాయించిన వ్యక్తీ మంచోడు ఎలా అయ్యాడు? ఆయన్ని వ్యతిరేకించిన వారివి 'నపుంసక ఆగ్రహజ్వాలలు' ఎలా అయ్యాయి?
తెలంగాణా ప్రజలు నిజమైన దోషులను ఇప్పటికైనా గుర్తించారు కాబట్టే మారుతున్న ఎన్నికల ఫలితాలు అని గుర్తించండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశ ఐ.టి పటంలో హైద్రాబాద్ కు ఓ గుర్తింపు తెచ్చిన, అందుకు ఇంఫ్రా స్ట్రక్చర్ అభివృద్ది చేసిన పార్టీ ముఖ్యమంత్రిగా రెండు ప్రాంతాలు నాకు రెండు కళ్ళలాంటివి అనడంలో తప్పేముంది? ఆమాట ధైర్యంగా అనగలిగిన తెలంగాణా మంత్రులు/ముఖ్యమంత్రులు, సీమాంధ్ర మంత్రులు ఎందరున్నారు? ప్రస్తుతం వున్న లీడర్లలో లోపాలు వున్నా చంద్రబాబే బెటర్. ప్రస్తుతం టిడిపి ఒక్కటే అన్ని తెలుగు ప్రాంతాలు రెప్రజెంట్ చేస్తోంది. తెలంగాణా ఉద్యమం అంతా ఫార్స్. నీచ రాజకీయాలతో తెదెపాను కట్టడి చేసేందుకు సోనియా నడిపిస్తున్న తోలుబొమ్మలాటలో పాత్రలు కెసిఆర్, చిరంజీవి, మజ్లిస్లు. ఏమైనా రెండు బొమికలు దొర్కుతాయేమో అన్న ఆశ పడే నక్కలు బిజెపి, సిపీఇ లది.
చంద్ర బాబు 50% అవకాశ వాది ఇతే
కె సి ఆర్ 500% అవకాశ వాది.
కాంగ్రెస్ వారిది (సోనియా)5000% అవకాశ వాదం
చంద్రబాబును సమర్ధిస్తే వంచనా..? మరి, మీ వాదనను ఏమనాలి..? వేర్పాటు ఉద్యమాన్ని సమర్ధించే నాయకులు మాత్రమే తెలంగాణలో తిరగ్గలరు. సమర్ధించని వాళ్ళను "గ్రామాల్లోకి తిరగనీయరు". ఎంచేతంటే ప్రజల ఆకాంక్షలను సమర్ధించడమే నాయకుల కర్తవ్యం అంట. జోకేంటంటే.. - ఇలా ప్రజల ఆకాంక్షలను సమర్ధించే నాయకులు తెలంగాణలో మాత్రమే ఉండాలి. మిగతా ప్రాంతాల్లోని నాయకులు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలనే సమర్ధించాలి. ఇదీ తెవాదుల దిక్కుమాలిన వాదన. చంద్రబాబుది వంచన అయితే, తెవాదులది కుటిల, స్వార్థపూరిత వాదన. ఇలాంటి దగాకోరు వాదన చేసేందుకు సిగ్గెందుకు ఉండదో ఈ తెవాదులకు !?
"ఇవన్నీ మీకు బాగానే అనిపిస్తున్నాయా?" - నా ప్రతినిధి నాకు అనుకూలంగా మాట్టాడక ఇంకెలా మాట్టాడతాడు? అతడు నాకు అనుకూలంగా మాట్టాడితే మీకెందుకు బాధ కలుగుతోంది? కోస్తా సీమల ప్రతినిధులు కూడా తెవాద విధ్వంసానికి అనుకూలంగా మాట్టాడాలా? ఇదెక్కడి వింత వాదన !!!? ఏడుపుగొట్టు పిల్లకాయ సాటి పిల్లల చేతుల్లోని అప్పచ్చులు కూడా నాకే కావాలని ఏడుస్తారే.. అట్టాగుందిది. పైగా అట్టా అడగ్గానే అవతలి వాళ్ళు ఇచ్చెయ్యలేదని ఇంకా ఇంకా ఏడుస్తున్నారు. ఏడవం డేడవం డేడవం డేడవండి.
"తెలంగాణా ప్రజల ఆకాంక్ష ఇంట బలంగా వ్యక్తమవుతున్నా కూడా మీ పాట మీ దేనా ?" - బలంగా వినిపిస్తోందా? విషం చిమ్మి ప్రజలని రెచ్చగొడితే ఇలా ఉండక ఇంకెలా ఉంటది? పైగా, మీ గోల మీదేగానీ, మీ పాటమీదేగానీ అవతలివాడి వాదన వినడం ఎప్పుడో మానేసారు మీరు. మీ మాటలకు వ్యతిరేకంగా ఏమాత్రం గొంతు వినబడినా, కర్కశంగా నొక్కేసారు. ఎంతలా అంటే తెలంగాణలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారంట -నూటికొక్కరు, కోటికొక్కరు కూడా వద్దనడం లేదంట! (ఎన్నికల్లో నూటికి నూరు వోట్లూ పోలైతే, అందునా అవన్నీ కూడా ఒకే పార్టీకి పడిపోతే, దాన్ని ఏమనాలో మనకు ఎవడూ చెప్పనక్కర్లేదు) ఎప్పుడైనా చందా లింగయ్య లాంటివారు గిరిజన రాష్ట్రం కోసం అడిగితే, వాళ్ళ గొంతులు నొక్కేసారు, పీకలు పిసికేసారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడా కనబడ్డం లేదు, వినబడ్డమూ లేదు. ఇప్పుడేమో తెలంగాణ వద్దనేవాడు తెలంగాణలో ఒక్కడూ లేడని తెగ చెప్పేసుకుంటన్నారు. ఆపండిక ఈ దిక్కుమాలిన, దగాకోరు, దివాలాకోరు వాదనలు.
@GOUTHAM NAVAYAN --
అసలు ఇప్పుడు మన రాష్ట్రము లో కెసిఆర్ లాంటి వాడు ఈ విధంగా రేచ్చిపోవటానికి కారణం మీ లాంటి గొర్రెలు అయన తా అంటే తందాన అనటమే , నిజంగా కెసిఆర్ లాంటి వాడు తెలంగాణా ను ప్రగతి పధం లో నడిపిస్తాడు అని మీరు నమ్మటం ఆశ్చర్యం గా ఉంది ,
చంద్రబాబు తెలంగాణా లో చేసిన అభివృద్ధి మీకు కనిపించట్లేదు కాని ఆయన చెప్పిన మాటలు మాత్రం బాగా గుర్తున్చుకున్నట్టు ఉన్నారు ,
కెసిఆర్ తన మాటలతో తెలంగాణా ప్రజలని పెద్ద RADICALS గా మార్చేసాడు ,
రాజీనామాలు ,హర్తాళ్లు,నిరాహారదీక్షలు అని TDP ఎన్ని చేసినా , తెలంగాణా పేరు తో ప్రజల్ని రెచగొట్టి UNDEMOCRATIC పనులు చేయించటం కంటే మెరుగే లెండి ,
ప్రత్యెక తెలంగాణా వస్తుంది అన్న ఊహాగానాలు వస్తేనే తెలంగాణా అభివృద్ధి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంతే నిజంగా వస్తే పరిస్థితులు ఇంకా ఎంత దారుణం గా ఉంటాయో మనలాంటి చదువుకున్న వాళ్ళు గ్రహించాల్సిన చిన్న విషయం ,,,
P.S - PLEASE GROW UP
@HARI --
మీరు చెప్పేది నిజమే అండీ ,
100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని మన పెద్ద వాళ్ళు చెప్పినట్టు , అవే 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి పెటాకులు కాకుండా చంద్రబాబు చేస్తున్నాడు అని అనుకుందాం
రంగు కళ్ళద్దాలు కాన్సెప్ట్ బాగుంది అండీ , అది కెసిఆర్ మాటలు విని భవిష్యత్తు పాడు చేసుకున్తన్న OU స్టూడెంట్స్ కి ఇంకా కెసిఆర్ మాటలు విని తల ఊపే గోర్రెలకి అయితే అది ఇంకా బాగా వర్తిస్తుంది
@చదువరి
అద్భుతంగా చెప్పారు.
తారకం గారూ-
ఈ పరిస్థితి చంద్రబాబు తనంతట తానుగా తెచ్చిపెట్టుకున్నది. నాకు చంద్రబాబు అంటే విపరీతమైన అభిమానం, ఆయన రాజకీయ సామర్ధ్యం, చతురత మీద ఎనలేని నమ్మకం. కానీ ఈ విషయంలో విభేదించక తప్పడం లేదు.
తెలుగు భాష, సంస్కృతి అనే పునాదుల మీద ఏర్పరుచుకున్న పార్టీ సిద్ధంతాలకి విరుగుడుగా, 2008 దసరా పండగరోజు తెలంగాణకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని తన మరణశాశనం తానే రాసుకున్నాడు. ఆయన చేసిన ఆ తప్పిదం కారణమే, ఈరోజు తెలుగుజాతి మొత్తం, మొత్తం అనుభవిస్తోంది. ప్రతిపక్షం ఔనన్న మరుక్షణం, పాలక పక్షం ముందున్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోతుందని, జాతీయ పార్టీగా రాష్ట్రవిభజన పైన క్రెడిట్ మొత్తం తనఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశం వుందనీ ఆనాడు తట్టలేదా?
కనీసం ఎన్నికల తర్వాత, లేదూ, వై ఎస్ మృతి తర్వాత, తెలంగాణ అంశం తెరమీదకి రావడానికి పూర్వం, హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా సమైక్యవాదానికి తిరిగిరావచ్చుకదా?
కనీసం ఇప్పుడైనా ఇప్పుడైనా ఈ క్లిష్టమైన పరిస్తితిలోనైనా- "తెలంగాణ ఇవ్వండి, కానీ హైదరాబాదు సమ్యుక్త రాజధాని చేయండి" అలాంటి ఒక స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే కనీసం తెలంగాణలో తిరగగలుగుతాడు కదా.
ఏమీ తేల్చక, ఏదీ చెప్పక, ఎవరికీ సరైన మార్గ దర్శకత్వం ఇవ్వక ఎన్నాళ్ళు మనగలుగుతాడు.
నాయకుడు అనేవాడు నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం మీద నిలబడాలి, ఆ నిర్ణయానికి తన వర్గంలో తెచ్చుకోవాలి.
ఏమీ చేయలేని, ఏదీ చెప్పలేని ఈ మనిషికి విశ్వశనీయత ఎందుకొస్తుందండీ?
I hate to say this as an ardent admirer of CBN, but its a fact.
@ Chaduvari
నా ప్రతినిధి నాకు అనుకూలంగా మాట్టాడక ఇంకెలా మాట్టాడతాడు? అతడు నాకు అనుకూలంగా మాట్టాడితే మీకెందుకు బాధ కలుగుతోంది?
>>>>>>>>
అయ్యా చదువరి గారూ
చంద్ర బాబు మీ ప్రతినిధి అయి మీకు అనుకూలంగా మాట్లాడితే మాకెందుకు అభ్యంతరం?
కానీ మేక వన్నె పులిలా మాలో దూరి మమ్మల్ని దగా చేయడాన్నే మేం ఖండించేది.
తను పరిపాలించే కాలంలో అసెంబ్లీ లో తెలంగాణా అన్న పదాన్నే నిషేదించాడు.
౨౦౦౪ ఎన్నికలలో సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికలకు వెళ్ళే వెల్లకిలా పడ్డాడు.
౨౦౦౯ ఎన్నికలలో ఒక కమిటీ వేసి విస్తృతంగా చర్చించి మరీ తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేసాడు.
ఇప్పుడు కూడా తన పాలసీని మళ్ళీ మార్చుకునే స్వేచ్చ అతనికి వుంది.
చిరనజీవి సామాజిక తెలంగాణా అంటూ ప్రగల్భాలు పలికి తీరా ప్రకటన వెలువడగానే తెలంగాణా లో తన దుకాణం మూసేసి
సమైక్యాంధ్ర వైపు వెళ్ళలేదా?
అట్లాగే ఈ రెండు కళ్ళు , రెండు నాలికలు, రెండు గుర్రాలు, వొన్ షాట్ టూ బర్డ్స్ ఎత్తులు జిత్తులు కట్టిపెట్టి ఒకే నినాదం
ఇచ్చిఒకే రాజకీయ విధానాన్ని ప్రకటిస్తే ఎవరైనా హర్షిస్తారు.
....బలంగా వినిపిస్తోందా? విషం చిమ్మి ప్రజలని రెచ్చగొడితే ఇలా ఉండక ఇంకెలా ఉంటది?
>>>
తెలంగాణలో టీ ఆర్ ఎస్ ని పక్కన పెట్టండి కాంగ్రెస్ పార్టీ లోని మొత్తం ఎం ఎల్ ఎ లు , ఎం పీ లు జై తెలంగాణా అంటున్నారు.
టీడీపీ లోని మొత్తం ఎం ఎల్ ఎ లు , ఎం పీ లు జై తెలంగాణా అంటున్నారు.
బీ జే పీ , సి పీ ఐ తదితర పార్టీలు, ప్రజా సంఘాలు కులసంఘాలు అన్ని కూడా జై తెలంగాణా అంటున్నారు.
వీళ్ళంతా కూడా గొంతు నోక్కేస్తామంటేనో, పీక పిసికేస్తామంటేనో అలా చేస్తున్నారా?
మీరు ఇంత కబోదిలా వాదిస్తే చేయగలిగేది ఏమీ లేదు.
@ The One
మీ లాంటి గొర్రెలు అయన తా అంటే తందాన అనటమే
>>>>>>>>
మొదటి నుంచీ మీ ఆంధ్రా వాళ్లకి తెలంగాణా ప్రజలు అన్నా తెలంగాణా సంస్కృతి అన్నా ఎంత చులకనో.
మేం గోర్రేలమే అయితే మీరు తోడేళ్ళు, గో ముఖ వ్యాఘ్రాలు
ఇట్లా తిట్టుకోవడం వాళ్ళ ఏమీ ఉపయోగం లేకపోయినా మీరు వాడిన భాషకు ఇంతకంటే ఎ పద్ధతిలో సమాధానం చెప్పగలం
దండం దొరా
మమ్మల్ని మా మామానాన బతకనివ్వండి.
ఉసిల్ల దండులా వచ్చి తెలంగాణా మీద పడి మీరు మమ్మల్ని ఏమీ ఉద్ధరించ నవసరం లేదు.
అంత త్యాగాలు చేయవద్దు
@ Chaduvari
నా ప్రతినిధి నాకు అనుకూలంగా మాట్టాడక ఇంకెలా మాట్టాడతాడు? అతడు నాకు అనుకూలంగా మాట్టాడితే మీకెందుకు బాధ కలుగుతోంది?
>>>>>>>>
అయ్యా చదువరి గారూ
చంద్ర బాబు మీ ప్రతినిధి అయి మీకు అనుకూలంగా మాట్లాడితే మాకెందుకు అభ్యంతరం?
కానీ మేక వన్నె పులిలా మాలో దూరి మమ్మల్ని దగా చేయడాన్నే మేం ఖండించేది.
తను పరిపాలించే కాలంలో అసెంబ్లీ లో తెలంగాణా అన్న పదాన్నే నిషేదించాడు.
౨౦౦౪ ఎన్నికలలో సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికలకు వెళ్ళే వెల్లకిలా పడ్డాడు.
౨౦౦౯ ఎన్నికలలో ఒక కమిటీ వేసి విస్తృతంగా చర్చించి మరీ తెలంగాణాకు అనుకూలంగా తీర్మానం చేసాడు.
ఇప్పుడు కూడా తన పాలసీని మళ్ళీ మార్చుకునే స్వేచ్చ అతనికి వుంది.
చిరనజీవి సామాజిక తెలంగాణా అంటూ ప్రగల్భాలు పలికి తీరా ప్రకటన వెలువడగానే తెలంగాణా లో తన దుకాణం మూసేసి
సమైక్యాంధ్ర వైపు వెళ్ళలేదా?
అట్లాగే ఈ రెండు కళ్ళు , రెండు నాలికలు, రెండు గుర్రాలు, వొన్ షాట్ టూ బర్డ్స్ ఎత్తులు జిత్తులు కట్టిపెట్టి ఒకే నినాదం
ఇచ్చిఒకే రాజకీయ విధానాన్ని ప్రకటిస్తే ఎవరైనా హర్షిస్తారు.
....బలంగా వినిపిస్తోందా? విషం చిమ్మి ప్రజలని రెచ్చగొడితే ఇలా ఉండక ఇంకెలా ఉంటది?
>>>
తెలంగాణలో టీ ఆర్ ఎస్ ని పక్కన పెట్టండి కాంగ్రెస్ పార్టీ లోని మొత్తం ఎం ఎల్ ఎ లు , ఎం పీ లు జై తెలంగాణా అంటున్నారు.
టీడీపీ లోని మొత్తం ఎం ఎల్ ఎ లు , ఎం పీ లు జై తెలంగాణా అంటున్నారు.
బీ జే పీ , సి పీ ఐ తదితర పార్టీలు, ప్రజా సంఘాలు కులసంఘాలు అన్ని కూడా జై తెలంగాణా అంటున్నారు.
వీళ్ళంతా కూడా గొంతు నోక్కేస్తామంటేనో, పీక పిసికేస్తామంటేనో అలా చేస్తున్నారా?
మీరు ఇంత కబోదిలా వాదిస్తే చేయగలిగేది ఏమీ లేదు.
>>>@ చదువరి>>> నా ప్రతినిధి నాకు అనుకూలంగా మాట్టాడక ఇంకెలా మాట్టాడతాడు? అతడు నాకు అనుకూలంగా మాట్టాడితే మీకెందుకు బాధ కలుగుతోంది? కోస్తా సీమల ప్రతినిధులు కూడా తెవాద విధ్వంసానికి అనుకూలంగా మాట్టాడాలా?>>>>
నిజం చెప్పారు, చంద్రబాబు నిజంగా కోస్తా, సీమల ప్రతినిధి. మరి అదే విషయం తను ఒప్పుకుంటే సమస్య లేదు, కానీ తాను మొత్తం రాష్ట్రం ప్రతినిధినని చెప్పి మోసం చెయ్యడమే బాగోలేదు. ఆ మోసం ప్రజలు గ్రహించారు కాబట్టే ఇప్పుడూ తెలంగాణాలో తెదేపా అడ్రస్ లేకుండా పోయింది.
Goutham Navayan : "నా ప్రతినిధి" అంటే నా ఉద్దేశం కేవల చంద్రబాబు కాదు -కోస్తా, సీమల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అన్ని పార్టీల వాళ్ళూను. ఈ ప్రతినిధులంతా తమనెన్నుకున్న ప్రజల అభిప్రాయాల కనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంతమంది నాయకుల అభిప్రాయాలను చంద్రబాబే కాదు, అసలు ఏ నాయకుడైనా పట్టించుకోకుండా ఎలా ఉండగలడు? తెవాదులు గిరిజనుల గొంతును నొక్కినట్టు చంద్రబాబు సోనియాలు కోస్తా సీమల ప్రజల గొంతును నొక్కగలరనుకుంటన్నారా ఏంటి? అది అసంభవం! ఆ ప్రజల అభిప్రాయాలకు విలువ ఇచ్చారు కాబట్టే డిసెంబరు 9 తరవాత డిసెంబరు 23 వచ్చింది, శ్రీకృష్ణ కమిటీ వచ్చింది.
పోతే రెండు కళ్ళ విధానం - ఒక ప్రాంతపు ప్రయోజనాలను నెత్తికెత్తుకుని ఇతర ప్రాంతాల వాళ్ళను బూతులు తిట్టడం కంటే, భాగో అనడం కంటే, నాలుకలు కత్తిరిస్తామనడం కంటే, రక్తతర్పణం చేస్తామనడం కంటే, వాళ్ళను ద్రోహులని, వలసవాదులని, పరాన్నభుక్కులనీ తిట్టడం కంటే చంద్రబాబు విధానం ఎంతో నయం. బురద గుంటలో పొర్లుతూ దొర్లుతూ ఉండే పంది, దారిన పోయేవాడి చెప్పులకు బురద అంటిందని వేలెత్తి చూపినట్టుంది, తెవాదులు చంద్రబాబును అనడం.
"వీళ్ళంతా కూడా గొంతు నోక్కేస్తామంటేనో, పీక పిసికేస్తామంటేనో అలా చేస్తున్నారా?" - వీళ్ళేంటండి, మామూలు ప్రజలను కూడా భయపెట్టేసారు! ఉస్మానియాలో నాగంను పట్టుకుని కొట్టడం, దేవేందరును, చంద్రబాబును, మంద జగన్నాథం వగైరాలను రోడ్లమీద అడ్డుకోడం, ఉస్మానియాలో పంతుళ్ళను ఎమ్మటబడి కొట్టడం, పరీక్ష రాసేవాళ్ళను అడ్డుకోడం,.. ఈ బాపతు రౌడీ పనులు చేస్తూ ఉంటే చూసేవాళ్ళకు నోరెత్తే ధైర్యం ఎలా వస్తుంది? భువనగిరిలో ఒక మంత్రి బహిరంగసభలో రాశేరె గురించి మాట్టాడితేనే ఎంత రభస అయిందో చూసారా? ఆ రౌడీయిజమే గనక లేకపోతే ఇవ్వాళ ఖచ్చితంగా కొందరు నాయకులు బహిరంగంగానే సమైక్యరాష్ట్రాన్ని సమర్ధించి ఉండేవారు.
తెలంగాణ ఉద్యమం తెవాదులు ప్రజల మనసులను విషపూరితం చెయ్యడం కారణంగా వచ్చింది. అనుకూలంగా మాట్టాడనివాళ్ళపై దాడులు చేసి భయపెట్టడం కారణంగా వాళ్ళనోళ్ళు మూత పడ్డాయి. ఇంత హింస చేస్తూ దీన్ని అహింసాయుత ఉస్యమం అని చెప్పుకోడం పరమ హాస్యాస్పదం!
ఇప్పుడు చెప్పండి.. ఎవరు కబోది?
సత్యాన్వేషి: "నిజం చెప్పారు, చంద్రబాబు నిజంగా కోస్తా, సీమల ప్రతినిధి. " -నేను పైన రాసిన వ్యాఖ్య చూడండి.
@@నిజం చెప్పారు, చంద్రబాబు నిజంగా కోస్తా, సీమల ప్రతినిధి. మరి అదే విషయం తను ఒప్పుకుంటే సమస్య లేదు, కానీ తాను మొత్తం రాష్ట్రం ప్రతినిధినని చెప్పి మోసం చెయ్యడమే బాగోలేదు. ఆ మోసం ప్రజలు గ్రహించారు కాబట్టే ఇప్పుడూ తెలంగాణాలో తెదేపా అడ్రస్ లేకుండా పోయింది.
అందుకే కాబోలు పాపం తెలంగాణ గుండెకాయలాంటి హైదరాబాదుకి పాపం అంత చాకిరి చేశాడు. టాంక్ బండ్ అనీ, హైటెక్ సిటీ అనీ రోడ్లనీ, జూబ్లీహిల్స్ అనీ, ఫిలిం నగర్ సినిమా ఇండస్ట్రీ అనీ. అన్ని చేసీ చేసీ అన్నీ అభివృద్ధి అంతా అక్కడే చేస్తున్నాడని అధికారం కూడా పోగొట్టుకున్నాడు.
ఏం లాభం ఆశించి మైక్రోసాఫ్ట్ ని తెచ్చాడో గచ్చిబౌలికి? ఏ బావుకుందామని ప్రభుత్వుద్యోగుల గుండెల్లో నిద్రపోయాడో? ఎవరికి శత్రువడం మూలాన మావోయిస్టులు పగబట్టారో ? వెనుకబడిన కులాల్లోంచి కడియం శ్రీహరి లాంటి నాయకులని తయారుచేసి ఏం బాగుపడ్డాడొ?
చేసినన్నాళ్ళు తెలంగాణకి చేయించుకుని ఇప్పుడు మాత్రం సీమాంధ్ర ప్రతినిధి అయిపోయాడేం? రాత్రికి రాత్రి
ఎవడుచేయమన్నాడు మా తెలంగాణకి అని మాత్రం అడక్కండేం !
@ చదువరి
మీ బ్లండర్‌ను కవర్ చేసుకోవడానికి కష్టపడ్డారు, కానీ పేలలేదు. చంద్రబాబు అందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీల లాగా కాదు, అతను ఒక రాజకీయ పార్టీకి అధినేత. 2009 ఎన్నికలముందు పార్టీలో ఒక కమిటీని వేసి, విస్త్రుతంగా చర్చించి మరీ తెలంగాణాకు అనుకూలంగా ఒక విధానాన్ని ఏర్పరిచుకున్నాడు, దానితో 45 మంది ఎమ్మెల్యేలను తెలంగాణాలో గెలుచుకున్నాడు. చిదంబరం ప్రకటనకు ఒక రోజు ముందు కూడా తాను తెలంగాణాకు అనుకూలమని ప్రకటించాడు. మరి ఎవర్ని సంప్రందించి ఒక్కసారీఅ విధానాన్ని మార్చాడు? ఇది వంచన కాదా? అందుకే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కేవలం సీమాంధ్ర ప్రతినిధిలాగా మిగిలిపోయాడు. మీకు సానుభూతిగా ఉంటే వచ్చే ఎలక్షన్లలో సీమాంధ్రలో ఇంకొన్ని వోట్లు టీడీపీకి ఎక్కువ వేసి గెలిపించుకోండి. అంటే కానీ తెలంగాణా ప్రజలు మీ ఎక్స్‌పెక్టేషణు ప్రకారం ఉండాలని కోరుకోకండి.
ఇక తెలంగాణా ఉద్యమం ఉరించి మీ బ్లాంకెట్ స్టేట్మెంట్లగురించి: ప్రజలంటే మీకు మరీ చిన్నచూపులాగుంది. ఎవరో భయపెడితే 4 కోట్లమంది తమ అభిప్రాయాన్ని మార్చుకోరు. అసలు 15 రోజులు నడిచి ఇప్పుడు అడ్డ్రస్సు లేని సీమాంధ్ర ఉద్యమం అంతా కూడా లగడపాటి లాంటి కబ్జా కోరులు తమ కబ్జాలను కాపాడుకోవడం కోసం డబ్బు మీడియా సాయంతో చేసిన సృష్టే అనేది జగమెరిగిన సత్యం కదా, దాని గురించి ఏమంటారు? గిరిజనుల గొంతును మీరెలా పసి గట్టారో కానీ, తెలంగాణా ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సీమాంధ్ర దళిత సంఘాలు, ప్రత్యేక రాష్ట్రం వస్తే కొత్త రాజధాని పెరిగే అవకాశాలవల్ల విడిపోవాలనుకునే కోట్లమంది గొంతు ఎందుకు నొక్కేస్తారు?
చదువరి గారూ,
మీ ప్రతినిధులు మీకు అనుకూలంగా మాట్లాడొచ్చు, తప్పులేదు. కాని మీకు గాని మీ ప్రతినిధులకు గాని తెలంగాణా భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదు. ఆ హక్కు కేవలం తెలంగాణాకు సంబంధించిన ప్రజలకే ఉందని గుర్తించండి. అలా గుర్తించారు కాబట్టే నాడు మీరు ప్రత్యేకాంధ్ర కోసం ఉద్యమాలు చేసినప్పుడు తమిళులు మోకాలడ్డే ఉద్యమాలు చేయలేదు.
సత్యాన్వేషి :
"మీ బ్లండర్‌ను కవర్ చేసుకోవడానికి కష్టపడ్డారు," - ఏమిటి కవరు చేసుకున్నది? "నా ప్రతినిధి" అనేది చంద్రబాబును ఉద్దేశించి మాట్టాడింది కాదు అనేదా? :) ఏంటండీ బాబూ..!? సరే, "నా ప్రతినిధి" అంటే చంద్రబాబే అనుకోండి, ఇప్పుడు పోయేదేముంది? :)
"అంటే కానీ తెలంగాణా ప్రజలు మీ ఎక్స్‌పెక్టేషణు ప్రకారం ఉండాలని కోరుకోకండి." - సరిగ్గా తెవాదులు ఇలా అనుకుంటున్నారనే నేను చెప్పింది! తెలంగాణ కావాలని మేం అడుగుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలంతా, ప్రజాప్రతినిధులంతా అడగాల్సిందే అని మీరు అడగడం తప్పు అని చెప్పాను.
"ప్రజలంటే మీకు మరీ చిన్నచూపులాగుంది." - ప్రజలంటే కాదు, విషం చిమ్ముతున్న తెవాదులంటే నాకు చిన్నచూపు. తెవాదుల అసలు రూపు తెలిసినవాళ్ళందరికీ కూడా వాళ్ళంటే చిన్నచూపే ఉంటది.
"ఎవరో భయపెడితే 4 కోట్లమంది తమ అభిప్రాయాన్ని మార్చుకోరు." అదే మరి, తెవాదుల విషప్రయోగ మహిమ!
"అసలు 15 రోజులు నడిచి ఇప్పుడు అడ్డ్రస్సు లేని సీమాంధ్ర ఉద్యమం అంతా కూడా లగడపాటి లాంటి కబ్జా కోరులు తమ కబ్జాలను కాపాడుకోవడం కోసం డబ్బు మీడియా సాయంతో చేసిన సృష్టే అనేది జగమెరిగిన సత్యం కదా, దాని గురించి ఏమంటారు?"- ఒక సంగతి తెలుసుకోండి.., ఆ కబ్జాలను కాపాడుకోవాలంటే వాళ్ళకు తెలంగాణ వస్తేనే మంచిది! :) తెలంగాణ అంటూ వస్తే, అప్పుడేర్పడే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో, ఓవర్ టైము పనిచేసి మరీ, వాళ్ళ కబ్జాలను కాపాడుతుంది. ఉద్యమం నడుస్తున్నంత కాలమే వాటికి ప్రమాదం. తెలంగాణ అంటూ ఏర్పడితే వాళ్ళకు హాయి. అంచేత తమ కబ్జాలను కాపాడుకునేందుకు ఉద్యమాలు చెయ్యనక్కర్లేదు వాళ్ళు. అవునూ.., తెవాదుల ఉద్యమం వెనక ప్రజలకు మేలు చేసే ఉద్దేశం ఉందని అనుకుంటన్నారా ఏంటి? తమకు పదవులు, తమ ఉద్యోగాల్లో ప్రమోషన్లు లాంటి స్వంత ’మేళ్ళు’ తప్ప ప్రజలకు మేలేమీ జరగదు. తెలంగాణ ఉద్యమం అంటే అదేదో పవిత్ర కార్యం లాగా చిత్రించకండి.
కానీ సమైక్యవాద ఉద్యమం అలాక్కాదు -అది పర్పస్ ఓరియెంటెడ్! రాష్ట్ర విభజన ప్రజలకు మంచిది కాదు, దాన్ని వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో ఆ ఉద్యమం వచ్చింద. అప్పటికి ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది, అందుకే అక్కడితో ఆగింది. ఊరికే సాగదీసి, ప్రజల పనిపాటల్ని చెడగొట్టి, విద్యార్థుల చదువులను పడుకోబెట్టి, నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాల్ని దెబ్బతీసి, వ్యాపారస్తుల వ్యాపారాలను బజార్నపెట్టి, ఎలక దూరిందని కొంపకు నిప్పెట్టేసుకునే రకపు తెలివితక్కువ ఉద్యమం కాదది, అందుకే ఆగింది.
"గిరిజనుల గొంతును మీరెలా పసి గట్టారో కానీ," - వరంగల్లు ఖమ్మాల్లో మాట్టాడబోయిన గిరిజన ప్రతినిధులు నోరు మూసుకుని కూచ్చునేదాకా అరిచి గోల చేసారు. తెవాదుల కళ్ళకది ఆనదులెండి, ఎందుకంటే తెవాదులకు అనుకూలంగా కాక, మరో రకంగా మాట్టాడేవాళ్ళు దేశద్రోహుల కింద లెక్క కదా!
"తెలంగాణా ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సీమాంధ్ర దళిత సంఘాలు, ప్రత్యేక రాష్ట్రం వస్తే కొత్త రాజధాని పెరిగే అవకాశాలవల్ల విడిపోవాలనుకునే కోట్లమంది గొంతు ఎందుకు నొక్కేస్తారు?" - ఎవరు నొక్కారు? ప్రతి సభలోనూ మాట్టాడుతారు. టీవీల్లో మాట్టాడుతారు. వెయ్యి మంది సమైక్యవాదుల మధ్య నించొని ఒక్క విభజనవాది ధైర్యంగా తన వాదన వినిపించగలడు. ఆ ధైర్యం తెలంగాణలో ఒక సమైక్యవాది వినిపించగలడా? అతగాడెవరో పుస్తకం రాసాడు.. విడుదల చేసుకోగలిగాడా హై. నడిబొడ్డున? అంతెందుకండీ.. ఆత్మహత్య చేసుకున్నవాళ్ళ కుటుంబసభ్యుల్ని ఎన్నికల్లో పోటీ చేయించాలని అడిగిన (చాలా చిన్న భేదాభిప్రాయం అది!) విద్యార్థి తెవాదనేతను టీవీల్లో అందరిముందూ తిట్టలేదూ మిగతా తెవాదులు? ఖమ్మం/కృష్ణా జిల్లాల సరిహద్దు గ్రామంలో పుట్టావు, నువ్వు అచ్చ తెలంగాణవాడివి కాదు, "ఆంద్రోళ్ళ" కోవర్టువని అని అతణ్ణి అవమానించలేదూ? ఇదీ తెవాదుల సహనశీలత -అణుమాత్రపు అసమ్మతిని సహించలేరు! ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వినిపించకపోవడంలో ఆశ్చర్యమేముంది!?
హరి: "మీ ప్రతినిధులు మీకు అనుకూలంగా మాట్లాడొచ్చు, తప్పులేదు. కాని మీకు గాని మీ ప్రతినిధులకు గాని తెలంగాణా భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదు. ఆ హక్కు కేవలం తెలంగాణాకు సంబంధించిన ప్రజలకే ఉందని గుర్తించండి." - హరి గారూ, సరిగ్గా చెప్పారు. నేను మీ వాదనతో పూర్తిగా ఒప్పుకుంటాను. అలాగే కోస్తా సీమ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అధికారం కూడా తెలంగాణ ప్రజలకు లేదు. యాభైయేళ్ళుగా రాజధాని అభివృద్ధి కోసం మా ప్రాంతపు అభివృద్ధిని పణంగా పెట్టారు. ఇప్పుడు మీకు దానితో సంబంధం లేదు మీదారిన మీరు పొండి అని చెప్పే అధికారం కూడా ఎవరికీ లేదు.
"అలా గుర్తించారు కాబట్టే నాడు మీరు ప్రత్యేకాంధ్ర కోసం ఉద్యమాలు చేసినప్పుడు తమిళులు మోకాలడ్డే ఉద్యమాలు చేయలేదు." - మద్రాసు కూడా కావాల్సిందే అని అడిగిన ఒక్క విషయంలో తప్ప మరి ఎందులోనూ ఆంధ్రోద్యమాన్ని తమిళులు అడ్డుకోలేదు. మద్రాసును అడగడం మానేసాకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అది గుర్తించండి.
చదువరి గారు బాగా చెప్పారు ! ఇక్కడ వాదనలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్తితి . తెలంగాణా భవిష్యత్తు తో పాటు కోస్తాంధ్ర , రాయలసీమ ప్రాంతాల భవిష్యత్తు కూడా ముడిపడి ఉంది అన్న విషయం ఇంత కన్వీనియెంట్ గా మర్చిపోతారో నాకర్ధం కాదు . ఒకటి మాత్రం నిజం ఈ విభజన వాదం అనేది కాన్సర్ లాంటిది , ఒకసారి మొదలైన తరవాత అది ఎక్కడ ఆగుతుందో తెలివకుండా ఉంది .
చదువరి గారు,
మీరు చరిత్ర మరోసారి తిరగేస్తే మంచిది. రాజధాని వదులుకుంటే ప్రత్యేకాంధ్ర రాలేదు. ప్రత్యేకాంధ్ర ఇస్తానని సాక్షాతూ నెహ్రూ గారు పార్లమెంటులో ప్రకటించిన తర్వాత కూడా చెన్నై కోసం పోరాడి పొట్టి శ్రీరాములును పోగొట్టుకున్నారు.
అప్పుడు చెన్నై ఎలా రాలేదో, సరిగ్గా అదే కారణాల వలన హైదరాబాదుకూడా ఆంధ్రాకు దక్కే అవకాశం లేదు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు రాశ్రాలుగా మారుతున్న ఈరోజుల్లో కొత్తగా కేంద్ర పాలితాన్ని సృష్టించే అవకాశం లేదు. ఇవన్నీ తెలుసు గాబట్టే మీరు సమైఖ్యాంధ్ర రాగం ఎత్తుకున్నారు. అంతే గాని అన్నదమ్ములు, తెలుగుజాతి అనేవి పైకి చెప్పే మాటలు మాత్రమే.
అయితే మీరు గమనించ వలసినది ఒకటుంది. తెలంగాణలో హైదరాబాదు ఒక్కటే అభివృద్ధి చెందింది. అదే ఆంధ్రాలో అభివృద్ధిచెందిన నగరాలు చాలా ఉన్నాయి. ఎన్నో ఓడరేవులు అభివృద్ధి చెందాయి. సస్యశ్యామలంగా పండే పంట భూములు ఏర్పడ్డాయి. ఇవన్నీ సమిష్టి వనరులతోనే అభివృద్ధి చెందాయి. కాబట్టి మీరు హైదరాబాదు పోతుందేమోనని దిగులు చెందవలసిన అవసరం లేదు.
Interesting discussion. Let me add some fuel ;)
>> అప్పుడు చెన్నై ఎలా రాలేదో, సరిగ్గా అదే కారణాల వలన
>> హైదరాబాదుకూడా ఆంధ్రాకు దక్కే అవకాశం లేదు.
వేచి చూద్దాం సోదరా!
>> ఆంధ్రాలో అభివృద్ధిచెందిన నగరాలు చాలా ఉన్నాయి.
ఎన్ని, అవి ఏవి?
>> ఎన్నో ఓడరేవులు అభివృద్ధి చెందాయి.
ఎన్ని, అవి ఏవి? ఎంత వ్యాపారాన్ని చేస్తున్నాయి? ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి?
>> సస్యశ్యామలంగా పండే పంట భూములు ఏర్పడ్డాయి.
ఎప్పుడు ఏర్పడ్డాయి? ఈ నేల ఎప్పటి నుంచి సస్యశ్యామలంగా తయారయ్యింది?
నిన్నా? మొన్నా? పది సంవత్సరాల క్రితమా?
>> మొదట సమైఖ్యాంధ్ర, తరువాత ప్రత్యేక తెలంగాణాకి సపోర్టు,
>> ఆతర్వాత రెండుకళ్ళ సిద్ధాంతం; ఇన్ని రకాలుగా ప్లేటు ఫిరాయించిన
>> వ్యక్తీ మంచోడు ఎలా అయ్యాడు?
చంద్రబాబో సన్నాసి. వాడి మీద నాకు ప్రేమేం లేదు.
కానీ, 9న తెలంగాణా అనంగానే రాజీనామా చేసింది కాంగ్రేసు లగడపాటి.
అందరూ బాబుని యెదవని చేస్తున్నా ఏమి అనలేకపొతున్న దద్దమ్మ బాబు.
కాంగ్రేస్ అధిష్టానం ఇప్పటివరకు నోరు విప్పిందా?
విప్పనప్పుడు, కేకే, కాకా, బాకా ల స్వరాన్ని కాంగ్రేస్ OK గా ఎలా ప్రచారం చేస్తారు?
ఒక కేకే కి ఒక నాగం, ఒక వీహెచ్ కి ఒక ఎర్రబెల్లి, ఒక కాకా కి ఒక దేవేందర్, ఒక దామోదర్ కి ఒక రేవంత్ వున్నారుగా ఈ పక్క?
ఇక లొల్లి డ్రామా చేసుకోండి ;)
Now, do you see this authors' point? If not, read again: డిసెంబర్ 9 న చిదంబరం చేసిన అనాలోచిత ప్రకటన పరిణామాలకు బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం మీదా చంద్రబాబు మీదా చేసే దుష్‌ప్రచారం నపుంసక ఆగ్రహజ్వాల మాత్రమే.
@చదువరి
@"ప్రజలంటే మీకు మరీ చిన్నచూపులాగుంది." - ప్రజలంటే కాదు, విషం చిమ్ముతున్న తెవాదులంటే నాకు చిన్నచూపు. తెవాదుల అసలు రూపు తెలిసినవాళ్ళందరికీ కూడా వాళ్ళంటే చిన్నచూపే ఉంటది.
ఇప్పుడు తెలంగాణాలో ప్రజలూ, తెలంగాణా వాదులు అంటూ వేర్వేరుగా లేరు అన్న విషయం మీకు బై ఎలక్షను తరువాతైనా అర్ధమయిందనుకుంటాను. మరి ఇవరో విషం చిమ్మితే ప్రజలందరూ తెలంగాణా కోరుకోరు, తమమీద తరాలుగా జరిగే విషప్రయోగం గురించడం మూలంగానే ఇప్పుడు ప్రజలు ఉద్యమిస్తున్నారని గ్రహించండి.
"@అదే మరి, తెవాదుల విషప్రయోగ మహిమ!" మీరు మహిమలని నమ్ముతారని తెలుసుగాని, మరీ ఇలా ఉద్యమాలకు కూడా మహిమలు ఆపాదిస్తారని ఇప్పుడే తెలిసింది. కొంచెం వాస్తవం లోకి రండ్.
"@ఆ కబ్జాలను కాపాడుకోవాలంటే వాళ్ళకు తెలంగాణ వస్తేనే మంచిది!" అలాగా, ఆ విషయం లగడపాటికి చెప్పండి, పాపం భయపడిపోతున్నాడు. శ్మశానాలు కూడా వదలకుండా కబ్జా చేశాడుగా!!
"@కానీ సమైక్యవాద ఉద్యమం అలాక్కాదు -అది పర్పస్ ఓరియెంటెడ్! రాష్ట్ర విభజన ప్రజలకు మంచిది కాదు, దాన్ని వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో ఆ ఉద్యమం వచ్చిం"
ఎవరికి మంచిది? రెండు ప్రాంతాలవారు కలిసి చేస్తే అది సమైఖ్య ఉద్యమం. ఒక ప్రాంతం వారు చేస్తే అది స్వార్ధ ఉస్యమం.
కేంద్ర పాలిత ప్రాంతం వద్దు. హైదరాబాదునూ, మా నల్లగొండ జిల్లానూ కలిపి ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలి. మా సూర్యాపేటను దానికి రాజధానిని చెయ్యాలి. మా పాత ఇంటిని ముఖ్యమంత్రి అధికార నివాసం చెయ్యాలి. ఆంద్రోల్లూ, తెలంగాణోళ్ళూ మా రాష్ట్రం మీది నుండి వెళ్ళడానికి టోల్ కట్టాలి. ప్రస్తుతానికి ఇవే నా డిమాండ్లు. మళ్ళీ ఏవయినా గుర్తుస్తే కామంటేస్తా.
tollywoodtv,srikrishnachintalapati,theone,karlapalemhanumantarao,చదువరి గార్లకు,
నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు,నేను వదిలిన పలు అంశాల ప్రస్తావన తెచ్చినందుకు కృతజ్ఞతలు.
Goutamnavayan గారికి,
Dec9 ప్రకటన వెలువడిన తర్వాత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన తమ నాయకులను సన్నధ్ధం చేయకుండా చేసిన తొందరపాటు చర్య అన్నాడే గాని,నైసుగా సమైక్యపాట పాడారనడం,రెచ్చగొట్టాడని ఆయన అనని మాటలాయన నోట్లో పెట్టడం అసత్య ప్రచారం.లగడపాటి దీక్షలో రాజకుమారి ముద్దు పెట్టిందని వ్రాశారే కానీ,రాజీనామాలు,హర్తాళ్ళు,దీక్షలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే మొదలుపెట్టారనే విషయం మీకు గుర్తు లేదు కామోసు.తెదేపా యంపీలు పార్లమెంట్ లో ధర్నా చేశారన్నారు గానీ అధికార పార్టీ కే చెందిన జగన్ వాళ్ళ చేతిలో ప్లకార్డులు గుంజుకొని మరీ సమైక్యాంధ్ర నినాదాలు చేశాడనే విషయం విస్మరించారు.అధికారపార్టీ నాయకుల విచిత్ర విన్యాసాలను విస్మరించి తెదేపా నే టార్గెట్ చేయడం అభ్యంతరకరం అనే గదండీ నేను వ్రాసింది.మీకు అనుకూలంగా లేని వాస్తవాల గురించి మరచి పోయే వ్యాధిని సెలెక్టివ్ డిమెన్షియా అంటారు.
హరి గారూ,
నావి రంగు కళ్ళద్దాలు సరే,మీరు కళ్ళుండే చూడలేని అంధులు కదండీ.చంద్రబాబు తెలంగాణా ను నిషేధించడమేమిటండీ,కెసియార్ అసెంబ్లీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడాడు.అసెంబ్లీ రికార్డులను పరిసీలించండి,మీకే వాస్తవాలు తెలుస్తయి.ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రజల చేతుల్లో ఉండదండీ,చట్టసభల చేతుల్లో,అధికారంలో ఉన్న ప్రభుత్వం చేతిలో ఉంటుంది.మీరు చెప్పేది మాబోక్రసీ,డెమోక్రసీ కాదు.
>>ఇప్పుడు తెలంగాణాలో ప్రజలూ, తెలంగాణా వాదులు అంటూ వేర్వేరుగా లేరు అన్న విషయం మీకు బై ఎలక్షను తరువాతైనా అర్ధమయిందనుకుంటాను.
.....
బాగున్నది, అదెలా, తెలంగాణాలో ఉన్నది 12 నియోజకవర్గాలేనా, సరే మీ లెఖ్ఖన వచ్చే ఎన్నికల్లో తె.దె.పాకి ఒక్క ఓటు కుడా రాదా? మరి హైదరాబాదుల్లో ఉన్న సెటిలర్లకి ఓటు హక్కు తీసివేయిస్తున్నారా?
>>ఒక ప్రాంతం వారు చేస్తే అది స్వార్ధ ఉస్యమం.
కరస్టే, అదేంటో మీ డెఫినిషన్లు చాలా విడ్డూరంగా ఉంటాయి, ఈ లెఖ్ఖన విడిపోవడానికి చేస్తున్న మీ ఉద్యమం కుడా స్వార్ధ ఉద్యమమేగా, ఇద్దరూ కలిసి చేయడం లేదు కదా.
>>>ఎన్ని, అవి ఏవి?
అన్నీ లెక్కలు తేలుస్తారుగా, వేచి చూద్దాం సోదరా.
>>>ఈ నేల ఎప్పటి నుంచి సస్యశ్యామలంగా తయారయ్యింది?
మరే, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందే కూలిపోయిన మీ కృష్ణా బారేజ్ కట్టుకున్నారు మరి! శ్రీశైలం నుండి చిత్తూరు దాకా కాలువలు తొవ్వుకున్నారు కదా? ఎందుకు భాయీ, వేచి చూద్దాం, అదీ తేలుతుంది.
>>>చంద్రబాబో సన్నాసి. వాడి మీద నాకు ప్రేమేం లేదు. కానీ, 9న తెలంగాణా అనంగానే రాజీనామా చేసింది కాంగ్రేసు లగడపాటి.
చంద్రబాబు సన్నాసి ఎలా అవుతాడు? ఈయన సన్నాసీ కాదు, సంసారీ కాదు, రెంటికీ చెడ్డ రేవడి. లగడపాటి ఈయన మీద చాలా నయం.
శరత్,
నాదీ నల్లగొండ జిల్లాయే. మీ ప్రపోసల్ నాకు ఒకే, కోదాడ టోల్గేటు మీరు తీసుకోండి, హైదరాబాద్ టోల్గేట్ నేను తీసుకుంటాను:)
@ హరి
:)
నల్లగొండాలో ఎక్కడేంటి మీది? మాకేమన్నా దగ్గరేనా?
హరి: "మీరు చరిత్ర మరోసారి తిరగేస్తే మంచిది." - నాకు చరిత్ర అంత బాగా తెలవదులెండి, అందుకే నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోయినట్టున్నాను. మళ్ళీ ప్రయత్నిస్తాను.. మద్రాసును వదులుకుంటేనే ఆంధ్ర ఏర్పడింది. అదీ కావాలని పట్టుబట్టి ఉంటే రాష్ట్రం ఏర్పడి ఉండేదే కాదు అనేది నా ఉద్దేశం. స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెసు పార్టీ వేసిన కమిటీ (జేవీపీ కమిటీ) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని చెప్పింది -మద్రాసు లేకుండా! అప్పుడు గొడవ చేసారు. ఒప్పుకొని ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకా ముందే ఏర్పడి ఉండేది.
సత్యాన్వేషి: "ఇప్పుడు తెలంగాణాలో ప్రజలూ, తెలంగాణా వాదులు అంటూ వేర్వేరుగా లేరు అన్న విషయం మీకు బై ఎలక్షను తరువాతైనా అర్ధమయిందనుకుంటాను." - నిజమే. తెవాదుల అబద్ధాల విజయం అది!
"మీరు మహిమలని నమ్ముతారని తెలుసుగాని, మరీ ఇలా ఉద్యమాలకు కూడా మహిమలు ఆపాదిస్తారని ఇప్పుడే తెలిసింది. " - :) :) తెవాదుల అబద్ధాలు సాధించిన విజయాల సంగతి తెలిసినవా రెవరైనా మహిమలను నమ్మి తీరాసిందేనండి.
"ఆ విషయం లగడపాటికి చెప్పండి, పాపం భయపడిపోతున్నాడు." - :) లగడపాటిలాంటి వాళ్ళకి ఆ సంగతి బాగా తెలుసు. మనం పిచ్చి మొహాలం, మనకే తెలవదు ఆ సంగతి. ’తెలంగాణ రాగానే కొత్త ప్రభుత్వం లగడపాటిని పిచ్చాసుపత్రిలో చేర్పిస్తుంది, అతడి ఆస్తులన్నిటినీ తీసుకుని ప్రజలకు పంచేస్తుంది’ అంటూ తెవాదులు ప్రజలకు అబద్ధాలు చెప్పేస్తూ వాళ్ళను ఉత్తేజపరుస్తూ, ఉద్రేకపరుస్తూ, ఓట్లేయిస్తూ ఉంటారు. లగడపాటి లు నవ్వుకుంటూంటారు.
"రెండు ప్రాంతాలవారు కలిసి చేస్తే అది సమైఖ్య ఉద్యమం." - :) ఏంటండీ, జోకా? రెండు ప్రాంతాలూ కలిస్తే ఇక ’సమైక్య’ ఉద్యమం అవసరమేముంది!!!!?
@తార
>>>బాగున్నది, అదెలా, తెలంగాణాలో ఉన్నది 12 నియోజకవర్గాలేనా, సరే మీ లెఖ్ఖన వచ్చే ఎన్నికల్లో తె.దె.పాకి ఒక్క ఓటు కుడా రాదా? మరి హైదరాబాదుల్లో ఉన్న సెటిలర్లకి ఓటు హక్కు తీసివేయిస్తున్నారా?>>>
ఈ సెటిలర్లన్న పదం కొంచెం కాంట్రావర్షియల్. తెదేపాకి ఒక్క ఓటు అయినా రాదా అంటే వస్తుందేమో కానీ ఒక్క సీటు కూడా రాదన్నది తెలిసిందే. పాపం తెదేపా క్రియాశీల కార్యకర్తలు కూడా తెదేకి వోటేయలేదు.
"కరస్టే, అదేంటో మీ డెఫినిషన్లు చాలా విడ్డూరంగా ఉంటాయి, ఈ లెఖ్ఖన విడిపోవడానికి చేస్తున్న మీ ఉద్యమం కుడా స్వార్ధ ఉద్యమమేగా, ఇద్దరూ కలిసి చేయడం లేదు కదా."
లెక్కలు కరెక్టే, అది అర్ధం చేసుకోవడంలోనే తేడా ఉందిలాగుంది. ఏ ప్రజలయినా వారి స్వార్ధం కోసమే ఉద్యమాలు చేస్తారు. కానీ ఇంతవరకూ ఎవరూ తమ స్వార్ధం కోసం వేరే వారు తమతో కలిసుండాలనే ఉద్యమం చేయలేదు మరి. అంతోటి దానికి సమైఖ్యమనే పేరెందుకు? సీమాంధ్ర సమైఖ్యతనా వారు కోరేది?
>>తెదేపాకి ఒక్క ఓటు అయినా రాదా అంటే వస్తుందేమో కానీ ఒక్క సీటు కూడా రాదన్నది తెలిసిందే.
నాకు తెలియదులేండి, నేను పెద్దగా జాతకాలు గట్రా నమ్మను.
>>కానీ ఇంతవరకూ ఎవరూ తమ స్వార్ధం కోసం వేరే వారు తమతో కలిసుండాలనే ఉద్యమం చేయలేదు మరి.
అంటే మీ ప్రకారం కలిసుంటే అన్నీ లాభాలు మాకే, విడిపోతే అన్ని నష్టాలు మాకే అని మీ ఉద్దేశమా? కాస్త వివరణ ఎమైనా ఇవ్వగలరా?
@తార
జాతకాలనూ, బూడిద రాలడాలనూ నేనూ నమ్మను, కానీ ఈమాత్రం దానికి జాతకాలూ, గ్రహాలూ అక్కరలేదు. 2 లక్షలమంది క్ర్యాశీల కార్యకర్తలున నియోజకవర్గంలో వ్య్యి వోట్లు వస్తే చాలదా?
లాభాలూ, నష్టాలూ ఈ టపాలో తేలే విషయం కాదు కానీ, పక్కవాడు కలిసి ఉండను అంటుంటే కలిసి ఉండాల్సిందే అని ఉద్యమిస్తే అదేం విడ్డూరం?
@తార
>>>అంటే మీ ప్రకారం కలిసుంటే అన్నీ లాభాలు మాకే, విడిపోతే అన్ని నష్టాలు మాకే అని మీ ఉద్దేశమా? కాస్త వివరణ ఎమైనా ఇవ్వగలరా? >>
ఇక్కడ లాభాలూ, నష్టాలు ఎవరు మాట్లాడారు? మీ లెక్కలెప్పుడు ఇంతేనా? ఎదుటి వారు చెప్పని విషయాలను చెప్పినట్లు చెప్పి దానిని తప్పని నిరూపించడమే మీ లెక్కా?
>>ఏ ప్రజలయినా వారి స్వార్ధం కోసమే ఉద్యమాలు చేస్తారు.
>>కానీ ఇంతవరకూ ఎవరూ తమ స్వార్ధం కోసం వేరే వారు తమతో కలిసుండాలనే ఉద్యమం చేయలేదు మరి.
దీని అర్ధమేమి మహాశయ? స్వార్ధం అనగానేమి?
>> అన్నీ లెక్కలు తేలుస్తారుగా, వేచి చూద్దాం సోదరా.
పైపైన చూసిన లెక్కల్తోనే మనోల్లు డంగైపోనారు గదా...ఎంటనే, అభివృద్ధి ప్రాతిపదికన మొదలెట్టిన వుద్యమం, ఆత్మగౌరవం వైపు తిరిగి, అట్నుంచి సాస్కృతిక దోపిడీ అంటూ తచ్చాడి, చివరకు ఎటెల్లాలో తెలీక అసలు కిష్టుడి కమీటీనే గుర్తించం అనేదాకా పోయిందెవరు?
అందరు Nov 17 బకరీదు జరుపుంటుంటే, మీలాంటి అమాయకుల చేత బక్రీదు రెన్నెళ్ళ ముందరే Sep 17 చేపించినట్టున్నారు? విమోచన దినమో, విలీన దినమో తెలియలేదు సానా మందికి. అదేదో ఆలోచనా దినంగా జరుపుంటే బాగుండెది.
ఈ గొడవలన్నింటిలో పిల్లకాయల్నంపి, తానుమాత్రం, గప్-చుప్ సారాబుడ్డి అంటాడ్ మన KCR
@GOUTHAM NAVAYAN ---
మీరు చెప్పేది చూస్తుంటే నాకు నవ్వొస్తోంది అండి ,,ఎవరో ఎక్కడో ఏదో చేసారని మొత్తం ఆంధ్ర వాళ్ళు అని genralize చేసి మాట్లాడం ఎం బాలేదు అండి ,, ఇక్కడ ఎవరు త్యాగాలు చేసాం అని చెప్పట్లేదు అండి , తెలంగాణా వాళ్ళు ఎక్కడ ఉండాలో ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఉండాలో చెప్పే అధికారం ఎవరికీ లేదు అని చెప్తున్నా అంతే .
"మేం గోర్రేలమే అయితే మీరు తోడేళ్ళు, గో ముఖ వ్యాఘ్రాలు"--
సరే అండి కొంత సేపు మీరు అనుకున్నదే నిజం అనుకుందాం ,
ప్రజాస్వామ్యం లో మీరు చెప్పే తోడేళ్ళ వల్ల పక్కన ఉన్న జనాలకి ఇబ్బంది అయితే ,నేను చెప్పే గొర్రెల వల్ల దేశ భవిష్యత్తు కే ప్రమాదం .
అయ్యా, విట్రియలు గారూ,
ఇయ్యన్నీ రాజకీయులు అంటానే ఉంటారండీ, దాంట్లో ఆంధ్రా తెలంగాణా అని తేడా లేదు. సివరాఖర్ణ శ్రీకృష్ణ కమిటీని తిట్టిపోసింది ఎవరో తెలుసా? ఘనత వహించిన మన ఆంధ్రా ప్రాంతపు మంత్రులు.
చదువరి: నేను చెప్పిందీ అదేగా? మొదటి నుండి ఉన్న జబ్బే ఇదీ! అప్పనంగా మద్రాసు కోరితే ఎలా ఇస్తారండీ?
>>>ఏంటండీ, జోకా? రెండు ప్రాంతాలూ కలిస్తే ఇక ’సమైక్య’ ఉద్యమం అవసరమేముంది!!!!
ఇది మాత్రం నిజంగా జోకే. ఒక ప్రాంతం వారి ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ దాన్ని సమైక్య వాదంగా చిత్రించడం! అంతగా యావ ఉంటే 'హైదరాబాదు మాది' అంటూ ఉద్యమం చేసుకోండి.
తారకం: చంద్రబాబు సమైఖ్యాంధ్ర వాదమో మరోటో చేసినా ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన కమిటీ వేసి రెండు సంవత్సరాలు రాష్ట్రమంతా పర్యటించి, అభిప్రాయాలు సేకరించి, ఎన్టీయార్ భవన్ లో మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడి, అఖిల పక్షంలో మద్దతు పలికి, తర్వాత ఒక్కరోజులో నాలుక తిరగేయ్యడంతోనే అందరికీ అభ్యంతరం. ఇప్పటికైనా పోయిందేముంది, మీరేమైనా ప్రయత్నించి ఆయనతో 'జై సమైఖ్యాంధ్ర' అనిపించండి, సంతోషిస్తాం.
విచ్చేదకవాదుల వాదనల్లో పస లేదు. ఎదుటి వాడిమీద పడి ఏడవడమే అజెండా అనిపిస్తోంది. చేవ వుంటే దేశంలో ఎక్కడైనా వెళ్ళి బ్రతికేవాళ్ళు. నీళ్ళ విషయం మాత్రమే వారి వాదనకు అనుకూలంగా వుంది. దానికి ఎవరూ చేయగలిగిందిలేదు. ఎత్తైన ప్రాతంలో కేచ్ మెంట్ ఏరియా వుంటే దిగువప్రాంతానికి మాత్రమే నీళ్ళు అందుతాయి అది ప్రకృతి నియమం. ఎత్తిపోతల ద్వారా తాగునీరు అందిచగలమేమో కాని, పంటలు పండిచడానికి అది ఆర్థికంగా లాభసాటి కాని విషయం. హిమాలయాల్లోనుంచి నదులు దిగువకు ప్రవహిస్తాయి కాని హిమాలయాల పైకి నీళ్ళు ఎక్కించాలనడం అర్థంలేని వాదన.
పోతే ఆత్మగౌరవం - కెసిఆర్, కాకా, యాష్కీ, కోదండరాం లాంటి ఎదవలు మంత్రులైతే అది ఆత్మగౌరవమెలా పెంపొందిస్తుందో తెలగానా వాదులే చెప్పాలి. ఏదేమైనా మరో జార్ఖండ్, చత్తీస్ఘడ్, పాకిస్థాన్ ఆంధ్ర సరిహద్దుల్లో ఏర్పరుచుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇలాంటి ఇన్స్టాల్ మెంట్లమీద వచ్చే ఆత్మగౌరవ వేర్పాటు వుద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసే అవసరం దేశప్రజలందరి మీద వుంది. చేవవుంటే గుజరాతీల్లా దేశంలో ఎక్కడైనా పోయి అభివృద్ధి చెందండి, లేదా అంతరించిపొండి. పిచ్చి వాగుళ్ళు అనవసరం.
>>> చేవవుంటే గుజరాతీల్లా దేశంలో ఎక్కడైనా పోయి అభివృద్ధి చెందండి, లేదా అంతరించిపొండి. పిచ్చి వాగుళ్ళు అనవసరం
Watch it again! ఇలాంటి ఆలోచనలు మీకున్నాయి గాబట్టే ప్రత్యేక రాష్ట్రం. ఇక్కడ ఎవారూ చేవ చచ్చి లేరు. కాకపోతే మీకు అసెంబ్లీలో broot మెజారిటీ ఉంది. అందుకే అవసరం ఉన్నా, లేకపోయినా పోలవరం, పులిచింతల. ప్రక్కన వందలాది గ్రామాలు మునిగిపోయినా మీకు అవసరం లేదు. మీకోరికలు మీకు తీరాలి. క్యాచ్మెంటుల గురించి తెగ మాట్లాడేస్తున్నారు. మరి మొదలు పెట్టి మధ్యలో ఆపేసిన ప్రాజెక్టులన్నీ క్యాచ్మెంటు లేకుండానే మొదలు పెట్టారా?
కొంచం సేపు రాజకీయలని పక్కన పెదదాం
అసలు తెలంగాణ యెందుకు రావాలి:
ఆత్మాభిమనం, అభివ్రుధి అనే అజెండా తొ మొదలు పెట్టారు.
కే సీ ఆర్ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బయటికి తీస్తే 3/4th తెలంగాణ develop ఐతుంది. 20 కిలొమీటర్లు దూరంలొ ఉన్న వోటింగ్ బూథ్ కి వెళ్ళటానికి అతనికి హెలికాప్టెర్ కావాలి.అసలు ఆలొచిస్తున్నారా తెలంగాణ ప్రజలు, ఈ నిరహర దీక్షలు,బందులు అన్ని గొడవల్లొ ఎన్ని కొట్ల రూపాయిలు నష్టపొతున్నమో ... వాటికి invest చేయటానికి మన నాయకుల దగ్గర దబ్బులు ఎక్కడి నుండి వస్థున్నయి. అవి developmentకి ఎందుకు use చేయరు? వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపడుకొటానికి అంత డబ్బులు mostly దొచుకున్న ప్రజా ధనం waste చేస్తుంటే... ఒకరిని (కే సీ ఆర్ ని) నిలబెట్టటానికి... వందలమంది... వేలమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు... students ni colleges ki కి వెళ్ళనీకుండా exams రాయనీకుండా వాళ్ళ జీవితాలని ఒక గమ్యం లేని మార్గం లొ పెట్టడమే నా కే సీ ఆర్ or తెలంగాణ పోరాట యౌధుల్ల ద్రుష్టి లొ తెలంగాణ కి their so called అభివ్రుధ్ధి ? ఇదేనా అతని పొరటానికి అజెందా ? వందల సంవస్థరాల చరిత్ర ఉండి, ఎన్నొ వేల మంది విధ్యార్థులకి జీవితాలు ప్రసాదించిన O U ఇప్పుడు వాళ్ళ రాజకీయాలకి party office. అసలు ఏటు పొతుంది మీ ఉధ్యమం. దానికి అసలు నిజమైన అర్థం ఉందా? దీనికి గమ్యం ఉందని అనుకుంటున్నరా? తెలంగాణ రాకపొతే డెసెంబర్ లొ రాష్ట్రం అగ్ని ఐతది అంటాడు . అతనికి దీపావళి చేసుకొవాలనిపించినప్పుడల్లా ఒకసారి రాష్ట్రం అగ్ని గుండం ఐతది. ఒకసారి నిరహర దీక్ష చెసి ప్రజల జీవితాల్ని అస్థ వ్యస్థం చేసాడు . దాన్నుండి కొలుకొవడానికి కొంత time ఇచ్చాడు... మళ్ళి ఇంకొ జాతర. రాష్త అభివ్రుధి యెంత వెనకపదిపొతుందొ ఇలంటి వాళ్ళ వల్ల యెవరైనా ఆలొచిస్తున్నరా ?
ఆత్మాభిమానం గురించి అంటారా?? అది ఎవరి ఆత్మలకి వాళ్ళకే తెలియాలి... అసలు అభిమానం అనేది ఉంటే... నీచ రాజకీయాలకి atleast అరవై అడుగుల దూరంలొ ఉన్న వాళ్ళు ఆత్మాభిమానం గురించి మట్లడితే బాగుంటుంది . తెలంగాణ ప్రజలు ఏవరొచ్చి కే సీ ఆర్ కి చేప్పారనండీ మా ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని? వాళ్ళ తరపున ఇతన్ని పొరాడమని... ప్రజల్లొ భేధ భావలు కలిగించేదీ, గొడవలు స్రుష్టించేదీ వాళ్ళే మళ్ళీ పోరాటాలు చేస్తున్నారు. సరే ఇతనికి తన ప్రజల మీద అభిమానం ఉంటే... వాళ్ళకి మంచి చేయాల్సిన విధానం ఇది కాదు.
రాజకీయల్లొకి వచ్చిన తరువాత... అందరు దొంగలే అందులొ మంచి దొంగ ఒకడు... కసాయి దొంగ ఒకడు... దుర్మాగపు దొంగ ఒకడు... ఇప్పుడే దొంగల బడిలొ చేరిన పిల్ల దొంగ ఇంకొకడు... ఏ class లొ join అవ్వలొ కొద తెలీయని confusion lo లొ school చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా చేప్పుకుంటూ పొతే types of దొంగల listకి never ending list.
so మనకి ఉన్న chance ఒక్కటే మంచి దొంగని elect చెసుకొవడం...
మంచి దొంగ 30% వాడు దొబ్బి... 70% stateకి పేట్టాడు ... (or atleast viceversa) గుడ్డి కంటే మెల్ల నయం కదా కొంచం development చూపించడు. atleast మనకి ఏమి కావలి అనే దాని గురించి అలొచించేలా చేశాడు . కలియుగ రాజకీయల్లొకి 100% ప్రజాసేవ చెయడనికి రాడు అని మనకే కాదు దేవుడికి కూడా తెలుసు. ఆందుకే ఇంత దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళు కూడ ఇంకా happy గానే బ్రతికేస్తున్నారు.
కసాయి దొంగ --- అందరిని దగ్గరికి చేర్చి వాఠాలేసి... ఎవరి వాఠా వాళ్ళకి వచ్చాక... అందరిని చంపి మొత్తం వాఠా వాడే తీసుకున్నాడు... వాడి తరవాత వాడి రాబొయే తరాన్ని కూడ దొచుకొమోని వాడి successorని తయారుచేసి కనిపించటానికి అందరికి ఏదొ మంచి చెశాడు అనిపించాడు. చివరికి చూస్తే కొన్ని directions lo లొ రాష్ట్రం 20 (యేర్స్ బచ్క్) కి వెళ్ళింది. తల తన్నే వాడిని తాడి తన్నే వాడు ఉంటాడు అన్నట్టు ఏవరి కుట్రలకొ బలైపొయాడు. (లొగుట్టు లొకేశ్వరునికే తేలియాలి)
దుర్మార్గపు దొంగ... అందరికి బొంద పెదతా అంటున్నాడు... already సగం తెలంగాణ ప్రజలకి పేట్టేశాడు అది ఇంకా మీకు తెలుస్తుందొ లేదో అర్థం కావట్లెదు. ఇప్పుదు జరుగుతున్న దొపిడీలొ వాడి వాఠా ఇంకా తేలలేదని ఊరంతా తిరుగుతూ అరుస్తున్నాడు... ఆ అరుపుల్లొ ఎమి సంగీతం వినిపించిందొ.... ఇంకొంత మంది (కాదు చాల మంది) వాడి వెనక తిరుగుతూ వాళ్ళ జీవితాలకి ఒక అర్థం లెకుండా పొతున్నారు.
ఇక్కడ ఏదొ ఒకరు మంచి నాయకుడు ఇంకొకడు bad leader అనేమీ లేదు ... అందరూ cheap politiciansఏ నాకు ఏవరి మీదా soft corner లేదు.
తెలంగాణ వస్తే KG to PG OR PhD varaku ఫ్రీ education... నిజమే అది ఇవ్వల్సిందే. యెందుకంటే ఇప్పుదు తెలంగాణ పోరాట యొధులకి KG నుండి ABCDలతొ చెయలి education ఎందుకంటే ఈ పొరాటం వల్ల బుర్రలు మొధ్ధు బారిపోయాయి.
అంత చెయగలిగిన వాడు seperate state వస్తేనే చెస్తాడా... ఈలొపు atleast ఒక 10% ఐనా develop చెయొచ్చు కదా, అతనికి తెలంగాణ ప్రజల మీద అంత అభిమానం ఉంటే...
ప్లీజ్ ఈ పాయింట్ ని తీసుకొని.. చంద్రబాబు ఎంత develop చెసాడు... చిరంజీవి వళ్ళ వూరికేం చెసాడు అని మొదలు పెట్టకండి... పక్క ఊర్లొ నాలుగు తొడేళ్ళు గొర్రెలని చంపుతున్నై... మన ఊర్లొ ఒక్కటే ఉందిలే అనుకొవడం కాదు... నాలిగిటిని తరమడమంటే కష్టమేమో... ముందు ఈ ఒక్కదాన్ని చంపితే మన ఊరి గొర్రెలు బతుకుతై... తరవాత పక్క ఊరి గొర్రెల safety గురించి అలొచిద్దాం అనుకుంటే ఏమైన కొంచం use ఉంటుంది...ofcourse మీ ఊరి తోడేళ్ళ సంగతి నువ్వేం చెప్పవా అని అడగకండి అవి ఇంకా ఊరి పొలిమేరల్లొ ఉన్నై ఇంకా ఊర్లోకి రాలేదు అప్పుడు మీ హెల్ప్ తీసుకుంటా.
ఇది ఎలా ఉందంటే... సధాం హుస్సేన్ నియంత్రుత్వ పాలనలొ ఇరాకీలకి మనశ్శాంతి లేదు అని అలాంటి బతుకు బ్రతికే బదులు వాళ్ళని చంపేయడం better అని దేశం మొత్తం నాశనం చెసి వాళ్ళకి మరణ సాశనం రాశాడు బుష్. కానీ వాడి అసలు లక్ష్యం అక్కడి పెట్రొల్ బావులు. అంతా ఐపొయక ఇప్పుడు ఆ నియంత పాలనలొనే హాయిగా బ్రతికాం అనుకుంటున్నారు ఇరాకీలు.
మనది నియంత్రుత్వం కాదు మాట్లాడే స్వెచ్చ ఉంది... పొరాడే స్వేచ్చ ఉంది... అలాంటప్పుడు ఈ పోరాటాలు చేసే వాళ్ళు ... మేము జనాభా లెక్కల్లొ ఉన్నాం అని లొకానికి తెలియచెయడానికి కాకుండా ఈ నీచ రాజకీయనాయకుల కుఠిల బుధి మీద పోరాటం చేశారా ఎవరైనా? ఈ పొరటాలు చేసే వాళ్ళు ఏవరైనా ప్రజా వాజ్యలు వేశారా ? ప్రజలు ఈ బందులు వల్ల నష్టపొతున్నారు అని Supreme Court లో case పేట్టారా politicians మీద... వాళ్ళు వాళ్ళు అందరు దొంగలండి ... వాళ్ళ వాఠాలు వాళ్ళకి రాక... నువ్వు ఇంత తిన్నావ్ అంటే నువ్వు అంత తిన్నావ్ అని గొడవలు చేసుకుంటున్నారు... అందులొ మనం వాళ్ళ వెంటపడి మరీ మన దబ్బులు వాళ్ళలొ ఏవరికి ఇవ్వాలా అని మనమే కొట్టుకు చస్తున్నాం ...
ఒక్కటి అలొచించండి ఈ తెలంగాణ ఉధ్యమం లొ ఇంత మంది జీవితలు నాశనం చెసుకున్న తరువాత గ్రహపాటునో... కే సీ ఆర్ అధ్రుష్తం బగుండొ తెలంగాణ వచ్చిందనుకోండి... వచ్చినా ఎం చెసుకుంటారు? అక్కడ తెలంగాణ పిచ్చిని inject చేసిన ప్రజలతో అతనొక monarchలా తయరైతాడు... అందరం కళ్ళు తెరుచుని వాస్థవం చూసెప్పటికి ఎమి మిగలది... వాడు పెట్టిన బొందలు చూస్తూ బాధ పదటం, కే సీ ఆర్ కుటుంబ సభ్యుల ఖాతాల్లొ ఇంకొన్ని వేల కొట్లు తప్ప. అంతగా ఐతే ఇంకొతమంది అతనికి బినామీలుగా ఉంటూ బాంచన్ దొర అనే పరిస్థితే మిగులుతుంది.
మనదేమి బ్రిటీష్ పాలన నుండి విముక్తి కాదు... అసలు చెసే ఉధ్యమనికి అర్థం ఉందో లెదో తెలుసుకొని చేస్తే బాగుంటుంది... ప్రపంచం ఎటు పోతుంది, మనం ఎటు పొతున్నాం (మంచిని, నిజమైన అభివ్రుధ్ధిని పొల్చుకుంటూ మనం చేసే పని యెందుకు చేస్తున్నమో) atleast అర్థమయ్యే stageలొ ఉంటే better అనిపిస్తుంది)
నాకు అనిపించింది రాశను. నాకు మీ అంత లొకఝ్నానం లేదు. ఎవరి feelings ని ఐనా hurt చెసి ఉంటే Sorry in advance.
dear sri arjun,
మీ మనసులోని భావాల్ని చెప్పడానికి మంచి ప్రయత్నం చేశారు.congratulations.KCR కు ప్రత్యేక తెలంగాణా విషయంలో చిత్తశుధ్ధి లేదు.ఉన్న ఫళంగా తెలంగాణ ఇచ్చేస్తే ఆ ప్రాంతం వరకు ఎక్కువ నష్టపోయేది కెసియార్.అధికారంలో కాంగ్రెస్, ముఖ్య ప్రతిపక్ష స్థానం లో తెదేపా ఉంటే, కెసియర్ తన మరియు కుటుంబ సభ్యుల దుకాణాలు మూసుకొని నాటకంలో ప్రేక్షక పాత్ర పోషించాలి.కాంగ్రెస్ ను బలోపేతం చేస్తానని ,లగడపాటికి I Love U అని ఒక రోజు,కాదు కాంగ్రెస్ ను బలపరుస్తానని,లగడపాటికి పిచ్చి ముదిరిందని ఇంకొక రోజు కుప్పి గంతులేస్తున్నాడు .
Post a Comment