ఆలీబాబా-40దొంగల కధ -చంద్రబాబు అజ్ఞానం


చంద్రబాబు ఈ మధ్య పాల్గొన్న సమావేశాల్లో తరచుగా అంటున్నది ఆలీబాబా పోయాడు , 40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచుకొంటున్నారని . ఈ అభియోగానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్నించి ఏమీ ప్రతిక్రియ  వ్యక్తం కాకపోవవడం తో మనం చిన్నప్పుడు చదువుకున్న ఆలీబాబా40దొంగల కధ చాలామందికి తెలియకపోవడమో లేక వాళ్ళ స్మ్రుతి పధం లోంచి చెరిగిపోయిందనో  భావిస్తూ ఈ కధ క్లుప్తం గా క్రింద వ్రాస్తున్నాను.
ఆలీబాబా అనే నిరుపేద కట్టెలకోసం తన గాడిదతో అడవికి వెళ్ళడం,ఒక దొంగలముఠా తమ నిధిని దాచుకొన్న గుహను చూడటం,వాళ్ళ రహస్య కోడ్ వినడం వాళ్ళు వెళ్ళిపోయినతరువాత ఆ గుహలోనుంచి కొంత బంగారం సంగ్రహించి గాడిద మీద ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది.ఈ విషయం తెలుసుకొన్న ఆలీబాబా అన్న దురాశతో ఆ గుహలో దూరి రహశ్య కోడ్ మరిచిపోయి దొంగల చేతికి చిక్కి హతమవడం ,ఆలీబాబా ఆ శవాన్ని ఒక దర్జీ సాయంతో దహన సంస్కారాలు నిర్వర్తించడం ,అదే దర్జీ సాయంతో దొంగలు ఆలీబాబా ఇల్లు గుర్తించి మారు వేషంలో 38 నూనె పీపా లతో (ఇద్దరు దొంగలను నాయకుడే చంపుతాడు) ఆలీబాబా ఇంటిలో ఆశ్రయం పొందటం , మోర్జినియా  (ఆలీ బాబా ఇంట్లో పనిమనిషి) సమయస్పూర్తితో కాగే నూనె పోసి నాయకుడు మినహా అందరినీ హతమార్చడం . నాయకుడు పారిపోయి మళ్ళా ప్రతీకారేఛ్ఛతో కోర్గియా అనే మారు పేరుతో ఆలీబాబా ఇంట్లో ప్రవేసించడం , న్రుత్య ప్రదర్శన లో భాగంగా చురకత్తితో పొడిచి మోర్జినియా దొంగలముఠా నాయకుడిని హతమార్చడం , ఆలీబాబా మోర్జినియా  ను తన కోడలిగా చేసుకోవడంతో కధ సుఖాంతమవుతుంది.
చంద్రబాబు రాశేరె గురించి మాట్లాడుతూ ఆలీబాబా పోయాడు ,40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అనడం ఆయన అజ్ఞానాని  బయటపెట్టుకున్నట్లు గా నాకనిపిస్తోంది . పైకధలో ఆలీబాబా హీరో ,దొంగల నాయకుడు విలన్. చంద్రబాబు ఇదే పేరుతో ఉన్న రామారావు గారి సినిమా చూస్తే కనీసం కధన్నా తెలిశేది . ఈ విధంగా మాట్లాడి చంద్రబాబు తన అజ్ఞానాన్ని వెల్లడి చేయరని ఆశిస్తూ .

8 comments:

దొంగల నాయకుడి పేరు కూడా ఆలీ బాబ్బానే అని మీకు తెలియకపోవటం, మేము చింతిస్తున్నాము. :))

 

Iraqi citizens often use the term Ali Baba to describe looting bandits, whether they be coalition troops or insurgents of any nationality. For protection against "Ali Baba," Iraqis are allowed one AK-47, and one 30 round magazine of ammunition per household.

http://en.wikipedia.org/wiki/Ali_Baba

 

మొత్తానికి తారకం గారూ మంచి పాయింటే పట్టారు.ఆలీబాబా నలభై దొంగలు అని మనకీ తెలిసిన కథలో ఆలీబాబా హీరోనే.చంద్రబాబు ఇదంతా అలోచించి మాట్లాడి వుండరు.ఒరెమున గారి లాగా వికీపీడియా చూసి మరీ మాట్లాడే నేతలు మనకు ఎక్కడనుంచి వస్తారండి?

 

snkr గారూ,
ఎన్ని కధల్లో వెతికినా దొంగలముఠానాయకుని పేరు కెప్టెన్ అనే వుందండీ .కాకపోతే కోగియా హసన్/ఖోజా హుసేన్ అనే మారుపేరుతో వ్యాపారిలా మారువేషం లో వస్తాడు.

oremuna గారూ,
మీరు చెప్పింది చదివాను.నా పాయింట్ హీరో కు విలన్‌కు తేడా తెలియకపోతే ఎలాగనే ?

 

karlapalem hanumantarao గారికి ,
నమస్తే .అధికారపక్షం వాళ్ళకు చంద్రబాబు అసలే అలుసయ్యాడు.ఇటువంటి చిన్న విషయాల్లో కూడా తగినంత జాగ్రత్త తీసుకోకపోతే ఎలాగన్న బాధతోనేనండీ .

 

తారకం గారు, నేను సరదాగా అలా అన్నాను. ఆలీబాబా హీరోనే.

దయచేసి, వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి.

 

ఈ ఆలీబాబా కామెంటు విన్నప్పుడల్లా నాకు ఆశ్చర్యమేసేది, ఏమిట్రా వీళ్ళు హీరోని దొంగని చేశారు అని. ఆలీబాబా- నలభై దొంగలు అన్న టైటిల్ తప్ప కథ తెలియక పోవడం వల్ల వచ్చిన తిప్పలివి. ఇందులో ట్విస్టు ఏమిటంటే అసలు ఆలీబాబా చంద్రబాబే అని అధికార పక్షం వాళ్ళు ఎదురు దాడి చేయడం.

 

snkr గారూ,
నన్ను కొంచెం కంగారు పెట్టారండీ.
చెప్పుదెబ్బలు-పూలదండలు గారూ,
అధికార పక్షం వాళ్ళింకా పరమ మూర్ఘులు గదండీ.

 

Post a Comment