సుమతీ శతకం-కులగజ్జి-వెర్రి డిమాండ్లు

15 నవంబర్ ఆంధ్రజ్యోతి లో" కులదూషన చేయదగునె కుమతీ సుమతీ"అనే వ్యాసం వ్రాశారు ప్రొ:పులికొండ సుబ్బాచారి(ద్రావిడ విశ్వ విద్యాలయం,కుప్పం).ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం లో జరిగే పి.హ్.డి ల భాగోతం గురించి ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి మనకందరికీ తెలుసు.ఇప్పుడర్థమయింది ఈ విశ్వవిద్యాలయం అంత నొటోరియస్ గా ఎందుకయిందో.
సుమతీ శతకం ,వేమనశతకాలో వివిధ కులవృత్తులవాళ్ళను దూషించారని,సుమతీశతకం లో ఈ దూషనపర్వం మరీ ఎక్కువగాఉందని ఎన్నో ఉదాహరణలతో ఎంతో చక్కగా విశ్లేషించారు.ఈ శతకంలో ఉర్దూ,హిందుస్తానీ పదాలు లేవుగాబట్టి ఇది 14 వ శతాబ్దం కంటే ముందుదనీ,స్త్రీల మీద వ్యతిరేకవ్యాఖ్యానాలు ఉన్నయి కాబట్టి వ్రాసినవారు పురుషుడయిఉంటాడని,అంటరాని కులాలను,వృత్తి కులాలను దూషించాడు కాబట్టి ప్రాబల్యకులానికి చెందినవాడని,వెలమల మీద,బ్రాహ్మణుల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కాబట్టి ఆ రెండు కులాలను మినహాయించాడు.తెలంగాణ లో వాడుకలో ఉన్న అగసాలె(కంసాలి) కులాన్ని రచనలలో విరివిగావాడాడుగాబట్టి రచయిత తెలంగాణ కు చెందినవాడనే నిర్ధారణకు వచ్చాడు.రాజుని దూషించాడు కాబట్టి రాఅయ్యే అవకాశం లేదన్నాడు గాని ప్రాబల్యకులాల్లో దేనికిచెందినవాడో ప్రస్తావించకుండా వదిలేశాడు.సుమతీ శతకకారుడు బద్దెన అనీ బద్దె భూపాలుడనీ సాహిత్యకారులు వ్రాశారంటూనే ఒక్కడు కాదని చెప్పడానికే ఎక్కువ అవకాశం ఉందని తేల్చాడు.
ఈ అమోఘమైన థీసిస్ ను ముగిస్తూ వివిధ వృత్తికులాలను కించపరిచే ఈ శతకాన్ని నిర్విద్దంగా నిషేధించాలని నొక్కి వక్కాణిచాడు.
14 వ శతాబ్దం కంటే ముందు ఆ రోజున్న కాలమానపరిస్తితులకద్దంపడుతూ ,ఒక నిండు జీవిత సారాంశాన్ని కాచివడపోసి,పద్యరూపంలో ,తెలుగువాళ్ళకొక్కరికే సొంతమయి ,వారసత్వంగా వచ్చిన వెలకట్టలేని అమూల్య నిధి నిక్షేపాలు మన శతకాలు.అడిగిన జీతంబియ్యని మిడిమేలపు కొలువుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల ఎద్దులగట్టుక మడిదున్నుకు బ్రతికవచ్చని ధైర్యం చెప్పి,సిరిదా వచ్చినవచ్చును సలలితమగు నారికేళ సలలము భంగిన్ సిరిదాపోయినపోవును కరిమింగిన వెలగపండని జీవిత సత్యం తెలిపి ,అల్పుడెపుడుపల్కు ఆడంబరముగాను సజ్జనుండుపలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అని విశదీకరించి,హీనుడెన్ని విద్యలను నేర్చినగాని ఘనుడు కాదు హీన జనుడుకాని పరిమళమును మోయు గార్దభము గజమగునె అని సూత్రీకరించిన ఆణిముత్యాలనెన్నిటినో పరిగణలోకి తీసుకోని ఈ మహానుభావుడిని పరిమళాన్ని మోసే గార్దభమనాలా లేక ప్రతి ఆంశాన్నీ కులమనే అద్దంలోంచి మాత్రమే చూడగలిగే అంధుడనాలా?
చంద్రబాబు ఒక ఉపమానం గా వాడిన గల్లాపెట్టె అనే మాటను కులానికి అన్వయించి మొత్తం వైశ్యకులాన్నే దూషించినట్లు రంగులద్దిన రోశయ్య,నరకాసురుడు,మహిసాసురుడు నిమ్నకులాలవాళ్ళనీ,దసరా,దీపావళి పండుగలు అగ్ర కులాలవాళ్ళు ,నిమ్నకులాలనవహేళన చేస్తూ జరుపుకొనే పండుగలని కొన్ని కులసంఘాలు చేస్తున్న వాదనులు వింటూ ఉంటే భారతంలో కొజ్జాలను చిన్న చూపు చూసినందుకు భీష్ముణ్ణి నిషేధించాలని కొజ్జాలు,నిమ్నజాతికి చెందిన ఏకలవ్యుడుకి అన్యాయం చేసినందుకు ద్రోణుడ్ని నిషేధించాలని నిమ్నజాతులవాళ్ళు,క్షత్రియులను ఊచకోతకోసినందుకు పరశురాముడుని నిషేధించాలని క్షత్రియులు,సీతనపహరించి లంకలో బంధించినందుకు రావణుణ్ణి నిషేధించాలని మహిళా సంఘాలవాళ్ళు,లాంటి వెర్రి మొర్రి డిమాండ్లు ఎన్ని వస్తాయో అని నాకు చాలా భయం గా ఉంది.

8 comments:

One of the best essays that I read, quite humorous and at the same time conveys thoughts succinctly.

 

Yes, really very good and thought provoking article. Those guys should be ashamed of.

 

తారానాధ్ గారు,
మీదంతా అగ్రకుల అభిజాత్యం, బ్రాహ్మిణికల్ పితృస్వామ్య ఫ్యూడల్ భావజాలం (Just Kidding) :))
టపా చాలా బాగుంది, as Rajesh said, it is very thought provoking.

వీలయితే wordverification తీసివేయ్యండి, కామెంట్ పెట్టటానికి సులువు గా ఉంటుంది.

 

చక్కటి వ్యాసం. వ్రాసినందుకు ధన్యవాదములు.

 

భలే పెట్టారు గడ్డి. ప్రతి దానికీ కులాన్ని వెంటేసుకు రావడం భలే పాషనైపోయింది. ఆ మధ్య కొండా సురేఖక్క వెనకబడ్డ కులమైనందుకు తనని,మరెప్పనీ ఏఐసీసీ సమావేశాలకి పిలవలేదని ఫైరై పోయింది. ఎవరైనా నిమ్న కులానికో, ఇంకేదైనా సో కాల్డ్ వనక బడ్డ కులానికో చెందిన అవినీతి ఆఫీసరుపై ఏసీబీ వాళ్ళు దాడి చేసినా మా కులంపైనే కక్ష కట్టి చేస్తున్నారని ఆ కులాల నాయకులు ఏడుస్తారు. వీళ్ళకి లంఛాలు బొక్కడంలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలేమో?

 

తారా నాధ్ గారు,

సుమతి గారేంటి, ఏ పూర్వ రచయతనీ/కవుల్నీ వదలట్లేదు. ఈకలు పీకుతునే ఉన్నారు.

అది కొద్దిగా పక్కన బెడితే,

మీరు ఉండవల్లి అరుణ్ కుమార్, అంబేద్కర్ ల ఉదంతం మరిచినట్టుంది. ఉండవల్లి గారు మనకున్న కొద్ది మంది నిజయితీ పరులైన నాయకులలో ఒకరు. పాపం ఆయన్నీ వదల్లేదు.
ఉండవల్లి గారన్న దానికి పెడర్థం తీసి, ఆ పెద్దాయన ఈ పెద్దయన కాళ్ళు కడిగేవరకు ఒప్పుకోలేదు.. **గజ్జి తామరగా రూపాంతరం చెంది బాగా పేరుకుపోయింది దాన్ని ఎగొదోసే వాళ్ళ వల్ల.

రాన్రాను నిజయితీ, మేధావితనం, మంచితనం లాంటివి, స్థలము, స్థాన మరియ్ సంఖ్యా బలిమి కి తలొంచక తప్పడం లేదు. దానివల్ల ఒకరిని చూసి ఒక్కరు బలిమి కొసం పోరాటం చేస్తున్నారు, ఆత్మగౌరవ నినాదంతో. తప్పేముందబ్బా?

@krishna గారు

మీకు రోజులు బాలేవు. అందుకే ఇలా రాశారు. కాసుకోండి.. నా డిమాండ్లు

అగ్రకుల అభిజాత్యం అని "అగ్ర" కులాల్ని, బ్రాహ్మిణికల్ అని ఒక కులాన్ని,పితృస్వామ్య0 అని మగాళ్ళని, ఫ్యూడల్ భావజాలం అని నా భావాలని మీరు అవమనించారు. స్క్రీన్ షొట్స్ అన్నీ తీసా, మీరు తప్పించుకోలేరు. మీరు వెంటనే ఒక్కో దానికి విడి విడిగా ఒక వంద పేజీల స.ధా చెప్పలి అని నా డిమండ్. లేనిచో ఇక మీకు ఎంతలేదన్నా అధమంగా ఒక్కోదానికి 20 యేల్ల చొప్పున(విడివిడిగా) మొత్తం 80 యేళ్ళు ఊచలు లెక్కిట్టుకోవాల్శిఉంటుంది.. జాగర్త :) . పైన నాలుగు మాటలకు చెందిన వాళ్ళు నన్ను బల పరచండి, సంఖ్యా బలం కోసం.

 

@Rajesh,
బానే ఇరికించేసారు :)) మీకెంత సంఖ్యాబలమున్నా ఏట్రాసిటీ కేసు పెట్టలేరుగా, LOL.

 

surya,rao s lakkaraju గార్లకు,
కృతజ్ఞతలండీ.
krishna గారికి,
నా ధన్యవాదాలు.మీ సలహాను పాటించి word verification తీశేసాను.
చెప్పుదెబ్బలు-పూలదండలు గారూ,
కృతజ్ఞతలండీ.చాలా వాలీడ్ పాయంట్ వ్రాశారు.మాకొక అధికారి ఉన్నాడు.ఆయనకు రిజర్వేషన్ ద్వారా వచ్చే పదోన్నతులు కావాలి గానీ ఆయన పేరు పక్కన గారూ పెట్టి పిలిచినా ఊరుకోవడం లేదు.(పేరు లోనే కులప్రస్తావన ఉండటం మూలాన).
రాజేష్ జి గారూ,
మీరు చెప్పినవి అక్షర సత్యాలు.ఉండవల్లి గారిని అభిమానించడం లో తప్పులేదు కానీ ,మార్గదర్శి ఉదంతంలోYSR కు ఒక hitman గా పని చేశాడన్నది వాస్తవం.

 

Post a Comment