కులసమావేశాలు-రాజ్యాంగ ఉల్లంఘన

వైశ్యజాతి కీర్తిని ఎలుగెత్తి చాటండి.టీవీ పెడితే ఈ ప్రకటనల హోరు.టీవీ తెర ఎడమ పైభాగంలో రోశయ్య గారి ఫోటో.హైదెరాబాద్ రోడ్డు మీద కెళితే KASS అనే పేరుతో పెట్టిన పెద్ద హోర్డింగులు.షరా మామూలే,రోశయ్యగారి పెద్ద పెద్ద ఫోటోలేగానీ ఈ సమావేశ నిర్వాహకుల పేర్లుగాని ఫోటోలు గాని లేవు.
కులమతాలకతీతంగా ,రాగద్వేషాలకు తావు లేకుండా,పాలన సాగిస్తానని,రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన పెద్దమనిషి , ఇంతకు ముందే ముఖ్యమంత్రీ ధైర్యం చేయని విధంగా కులసంఘాల కార్యక్రమాలకు హాజరవుతూ ,తన కులపోళ్ళతో సన్మానాలు చేయించుకుంటూ ,తన కులానికే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.ఈ నేరానికి రోశయ్య గారిని ప్రాసిక్యూట్ చేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేయాలని ప్రజాస్వామ్యవాదులకు నా విజ్ఞప్తి.
నవంబర్ 20 న ది హిందూ లో ఇచ్చిన ప్రకటన "congregation of arya vysyas "లో రోశయ్యగారి పెద్ద ఫోటో లు రెండు,మహాత్మా గాంధీ,పొట్టి శ్రీరాములు ,వాసవీమాత ల చిన్న ఫోటో లతో ప్రచురించారు.భారతదేశంలో దాదాపు అన్ని కులాలకు కులసంఘాలు ఉన్నాయి.అన్ని కులసంఘాలు సమావేశాలు జరుపుకోవడం ,కుల ప్రముఖులను సన్మానించడం అనే ప్రక్రియ తప్పొప్పుల గురించి చర్చించడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు.కానీ జాతిపిత మహాత్మాగాంధీని కేవలం ఒక కులనాయకుడీ స్థాయికి దిగజార్చడం ఈ రాజకీయమరుగుజ్జులు చేసిన దుస్సాహసం.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రోశయ్య ఈ కార్యనిర్వాహకులను వారించకుండా ఈ ప్రక్రియ లో భాగం పంచుకొని తన మరుగుజ్జు స్థాయికి జాతీయనాయకులను కుదించడం క్షంతవ్యం కాని నేరం.
P.S.:-భారతదేశ అతి పెద్ద స్కామువీరుల జాబితా కోసం గూగ్లింగ్ చేస్తే మొదటి పది స్థానాలలో ఏడు స్థానాలనాక్రమించిన పేర్లు దిగువనిస్తున్నాను .
2)హర్షద్ మెహతా(స్టాక్ మార్కెట్ కుంభకోణం),3)కేతన్ ఫరేఖ్ (స్టాక్ మార్కెట్ ),4)C.R. భన్సాలి (కాపిటల్ మార్కెట్),6)దినేష్ దాల్మియా (స్టాక్స్ ),8) వీరేంద్ర రస్తోగీ (బ్యాంకులను మోసం చేయడం),10)ఉదయ్ గోయల్ (చిన్న మదుపుదార్లను ప్లాన్ టేషన్ స్కాం ద్వారా మోసం). వీళ్ళు కాక మన రమేష్ గెల్లి (గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ).వీళ్ళందరినీ సన్మానిస్తే ఇంకా సముచితం గా ఉండేదేమో!

8 comments:

భలే చెప్పారు. ఈ విశయంలో రోశయ్య గారు అందర్నీ మించిపోయారు. నాకు తెలిసిన ఒక వైశ్యప్రముఖుడిని ఈ విషయమై కదిలిస్తే ఆయన ఇలాగన్నారు. "ఇప్పుడిప్పట్లో మళ్ళీ మా కులపోడు సీఎమ్ అవుతాడన్న నమ్మకం మాకు లేదు, అందుకే ఎంతో కాలానికి కానీ మాకు రాకరాక వచ్చిన ఈ అవకాశాన్ని మేం ఇలా ఊదరగొట్టుకుంటున్నాం."

 

weekend politician,చెప్పుదెబ్బలు-పూలదండలు,katti maheshkumar గార్లకు,
ధన్యవాదాలు.కాగల కార్యం గంధర్వులే తీర్చారు .

 

ఓహో! అదా విషయం. ఇప్పుడర్ధమయింది. మీరెవరో, మీరు నా పోస్టుపై అలా ఎందుకు కామెంట్ చేశారో. ముఖ్యంగా వెన్నుపోటు మీద మీరు రాసిన పోస్టులో...ప్రత్యేకంగా చంద్రబాబు చేసింది వెన్నుపోటు కాదని సమర్ధించడం చూసిన తర్వాత. మీకు నా పోస్టుపై కోపం రావడంలో అర్ధముందిలెండి. రోశయ్యది మరుగుజ్జుతనం సరే...మరి మీదేమిటి...దానినేమనాలో అది కూడా మీరే చెప్పండి.

btw, మీ కామెంటుకు నేను నా బ్లాగులోనే సమాధానం ఇచ్చాను అవధరించండి.

 

బాగా చెప్పారు అండి , మొత్తానికి రాష్త్రానికి పట్టిన ఒక శని వదిలిపోయింది ప్రస్తుతానికి
@tejawi -- నవ్వు వస్తుంది అండి మీలాంటి వారు రాసిన కామెంట్స్ చూసినప్పుడల్లా , గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ...
P .S - వెన్నుప్టు ఆర్టికల్ లో మీకు "వెన్నుపోటు ", " చంద్రబాబు", "కాదు" అనే మూడు అక్షరాలూ తప్పితే ఇంకా ఏమి కనిపించినట్టు లేవు ఇంకో సారి మళ్ళి చదివి అర్ధం చేస్కొడానికి try చేయండి

 

తెజస్వి గారూ,
మీకు జ్ఞానోదయం అయినందుకు సంతోషం.నాదేమిటో తెలియాలంటే నా ప్రొఫైల్ చూడండి

 

entha baga rasavura .ayana rosaiah ku tamilnadu governer ayyadu kadara

 

Post a Comment