రాజకీయాల్లో వెన్నుపోట్ల శకం ఆరంభమైనది ఇందిరాగాంధీతోనే . లాల్ బహదూర్‌శాస్ట్రి చనిపోగానే అందరికంటే సీనియర్ మరియు ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు అయిన మొరార్జీ ను పక్కనబెట్టి ఇందిర ను ప్రధానమంత్రి ని చేసింది కామరాజ్ నేత్రుత్వం లోని సిండికేట్. తననా పదవిలో కూర్చోబెట్టిన సిండికేట్ కు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా నామరూపాల్లేకుండా చేసింది ఇందిరాగాంధీ . సంజీవరెడ్డి ని దేశాధ్యక్షుడు గా తనే ప్రతిపాదించి అంతరాత్మ ప్రభోదం అనే కొత్త దుస్సంప్రదాయంతో వి వి గిరి ని గెలిపించి సంజీవరడ్డికి వెన్నుపోటు పొడిచింది ఇందిర . తనకు కేంద్రం లో పదవి ఇవ్వలేదనే అక్కసుతో తెలంగాణా ప్రజా సమితి ని స్థాపించి తన వాఘాటితో ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఎన్నికల్లో పది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని పదవీ వ్యామోహంతో మూకుమ్మడిగా కాంగ్రెస్స్ లో దూరి తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చెన్నరెడ్డి . ఇందిర చే ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి గా నియమింపబడ్డ వెంగళరావు ఆమె దివి సేమ ఉప్పెన బాధితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు పదవిలో లేదు కాబట్టి విజయవాడ మున్సిపల్ అతిధిగ్రుహం గది ఇవ్వకుండా నిరాకరించి ఆమెకు వెన్ను పోటు పొడీచాడు .
ఆంధ్రప్రదేశ్‌నుంచి జనతా పార్టీ తరఫున ఏకైక పార్లమెంట్ సభ్యుడు గా గెలిచి పార్టీ తనను పార్లమెంట్ స్పీకరు గా తరువాత దేశాధ్యక్షుడు గా గెలిపిస్తే జగజీవనరాం ను ప్రధానమంత్రి అవకుండా కాలడ్డి తదుపరి మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రాధాని గా గెలవడానికి పరోక్షంగా దోహదపడి జనతా పార్టీకు వెన్నుపోటు పొడిచాడు సంజీవరెడ్డి .రాజీవ్‌గాంధీ సిఫార్సుతో 1983 లో పిసిసి అధ్యక్షుడు గా నియమించబడీ , అదే రాజివ్‌గాంధీ చే నియమించబడిన ముఖ్యమంత్రుల మీద అసమ్మతి కార్యక్లాపాలు నడిపి , హైదెరాబాద్‌లో మతకలహాలు స్రుష్టించి రాజీవ్ కు వెన్నుపోటు పొడిచాడూ రాజశేఖరరెడ్డి .లెగిలేటివ్ కౌన్సిల్ లో తన వాగ్ధాటి తో చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు గుప్పించి , చీల్చి,చెండాడి వారం రోజులు తిరక్కుండానే కాబినెట్ లో చేరి ఆనాటి ` ఈనాడు ` ఛీఫ్ ఎడిటర్ గజ్జెల మల్లారెడ్డి చే మగలంజ గా శ్లాఘించబడి నీతి ,నిజాయతీలకే వెన్నుపోటు పొడిచాడు రోశయ్య .
తెలుగు దేశం పార్టీ ద్వారా వెలుగు లోకి వచ్చి మంత్రి గా డెపూటీ స్పీకర్‌గా పదవులనుభవించి తనివి తీరని అధికార దాహంతో పార్టీ కు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి , తెలంగాణా అనే భావోద్వేగ నినాదంతో కాగ్రెస్స్ తో జతకట్టి , ఎన్నికల్లో గెలిచి పదవులనుభవించి కాంగ్రెస్స్ తో వెన్నుపోటు పొడిపించుకొని , గత్యంతరం లేక టిడిపి తో జతకట్టి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రాపకం తో నే గెలిచి ,టిడిపి ను తెలంగాణా లో భూస్థాపితం చేస్తానని రోజూ ఒక పోటు పొడుస్తూనే ఉన్నాడు కెసిఆర్.
ఇక జార్ఖండ్ లో శిబు సొరేన్ ఒక సారి బిజెపి కి మరో సారి కాంగ్రెస్ కు మార్చి మార్చి పోట్లు పొడుస్తూ ఉన్నాడు . తమిళనాడు లో కాంగ్రెస్ రెండు ద్రవిడ పార్టీలతో ఒకదాని తర్వాత ఒక దాన్ని పొడుస్తూనే ఉంది . కర్ణాటక లో ప్రస్తుత పరిస్థితి బిజెపి, కాంగ్రెస్,జెడియస్ ల లో ఎవరు, ఎవరిని, ఎప్పుడు వెన్ను పోటు పొడుస్తున్నారో వాళ్ళకే తెలియనంత హాస్యాస్పద, జుగుప్సాకర రీతిలో మూడు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి .
అణుఒప్పందం బిల్లు విషయం లో సొంత పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మద్దతిచ్చి ,ప్రతి గండం లోనూ బాసటగా నిలిచిన లాలూప్రసాద్ ను బీహార్ వెనుకబాటుకు మూల కారణంగా చూపుతున్న సోనియా పెద్ద వెన్నుపొటుదారు . అధికార దాహంతో ఎంతో క్రమ శిక్షణ గల తల్లి లాంటి పార్టీ కి వెన్నుపోటు పొడిచాడు మాజీ స్పీకర్ సోంనాథ్ ఛటర్జీ .ఇక చిన్నా చితకా రాజకీయనాయకుల చరిత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మందా జగన్నాధం , ఆదికేశవులనాయుడు చంద్రబాబుకు , బొత్సా సత్యనారాయణ మరియూ తులశీరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబానికి పొడిచిన పోట్లు పెద్దవే.
చంద్రబాబు అసెంబ్లీ బల నిరూపణలో శాసనసభ్యుల మద్దతుతోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడనేది జగమెరిగిన సత్యమే . 1996, 1998, ల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు . 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తో కలిసి యంటీఆర్‌టిడిపి అనే పేరుతో పోటీ చేసిన లక్ష్మీపార్వతిని ప్రజలు తిరస్కరించారనే విషయం అందరికీ గుర్తుండే వుంటుంది . 1999 లో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబును ఇంకా వెన్నుపోటుదారునిగా చిత్రించడం రోశయ్య లాంటి ఫ్యూడల్ భావాలతో వ్యక్తిపూజ చేసే నాయకునికి తగనిపని .
ఈ ప్రజాస్వామ్య వ్యవస్తలో వెన్నుపోటు అనే పదానికి అధికారికత (sanctity) లేదనేది నా నిశ్ఛితాభిప్రాయం . పైన ఈ అభియోగం మోపబడ్డ రాజకీయనాయకుల్లో చాలామంది తదనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచినవాళ్ళే . ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయనాయకుడు ఆరోజు ఉన్న పరిస్థితులకనుగుణంగా తమ విచక్షణను వినియోగించి , తమ శ్రేయస్సు కోసం, కొంత సమాజశ్రేయస్సు కోసం పరస్పర విరుధ్ధ నిర్ణయాలను తీసుకొనవలసి వస్తుంది . వాటన్నిటినీ వెన్నుపోట్లుగా అభివర్ణిస్తే ప్రతి రాజకీయనాయకుడికీ చేతిలో కత్తి ఉంటుంది వెన్నులో పోట్లుంటాయి .