వెన్ను పోట్లు దాని పుట్టు పూర్వోత్తరాలు



రాజకీయాల్లో వెన్నుపోట్ల శకం ఆరంభమైనది ఇందిరాగాంధీతోనే . లాల్ బహదూర్‌శాస్ట్రి చనిపోగానే అందరికంటే సీనియర్ మరియు ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు అయిన మొరార్జీ ను పక్కనబెట్టి ఇందిర ను ప్రధానమంత్రి ని చేసింది కామరాజ్ నేత్రుత్వం లోని సిండికేట్. తననా పదవిలో కూర్చోబెట్టిన సిండికేట్ కు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా నామరూపాల్లేకుండా చేసింది ఇందిరాగాంధీ . సంజీవరెడ్డి ని దేశాధ్యక్షుడు గా తనే ప్రతిపాదించి అంతరాత్మ ప్రభోదం అనే కొత్త దుస్సంప్రదాయంతో వి వి గిరి ని గెలిపించి సంజీవరడ్డికి వెన్నుపోటు పొడిచింది ఇందిర . తనకు కేంద్రం లో పదవి ఇవ్వలేదనే అక్కసుతో తెలంగాణా ప్రజా సమితి ని స్థాపించి తన వాఘాటితో ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఎన్నికల్లో పది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని పదవీ వ్యామోహంతో మూకుమ్మడిగా కాంగ్రెస్స్ లో దూరి తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చెన్నరెడ్డి . ఇందిర చే ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి గా నియమింపబడ్డ వెంగళరావు ఆమె దివి సేమ ఉప్పెన బాధితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు పదవిలో లేదు కాబట్టి విజయవాడ మున్సిపల్ అతిధిగ్రుహం గది ఇవ్వకుండా నిరాకరించి ఆమెకు వెన్ను పోటు పొడీచాడు .
ఆంధ్రప్రదేశ్‌నుంచి జనతా పార్టీ తరఫున ఏకైక పార్లమెంట్ సభ్యుడు గా గెలిచి పార్టీ తనను పార్లమెంట్ స్పీకరు గా తరువాత దేశాధ్యక్షుడు గా గెలిపిస్తే జగజీవనరాం ను ప్రధానమంత్రి అవకుండా కాలడ్డి తదుపరి మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రాధాని గా గెలవడానికి పరోక్షంగా దోహదపడి జనతా పార్టీకు వెన్నుపోటు పొడిచాడు సంజీవరెడ్డి .రాజీవ్‌గాంధీ సిఫార్సుతో 1983 లో పిసిసి అధ్యక్షుడు గా నియమించబడీ , అదే రాజివ్‌గాంధీ చే నియమించబడిన ముఖ్యమంత్రుల మీద అసమ్మతి కార్యక్లాపాలు నడిపి , హైదెరాబాద్‌లో మతకలహాలు స్రుష్టించి రాజీవ్ కు వెన్నుపోటు పొడిచాడూ రాజశేఖరరెడ్డి .లెగిలేటివ్ కౌన్సిల్ లో తన వాగ్ధాటి తో చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు గుప్పించి , చీల్చి,చెండాడి వారం రోజులు తిరక్కుండానే కాబినెట్ లో చేరి  ఆనాటి  ` ఈనాడు `    ఛీఫ్ ఎడిటర్ గజ్జెల మల్లారెడ్డి చే మగలంజ గా శ్లాఘించబడి నీతి ,నిజాయతీలకే వెన్నుపోటు పొడిచాడు రోశయ్య .
తెలుగు దేశం పార్టీ ద్వారా వెలుగు లోకి వచ్చి మంత్రి గా డెపూటీ స్పీకర్‌గా పదవులనుభవించి తనివి తీరని అధికార దాహంతో పార్టీ కు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి , తెలంగాణా అనే భావోద్వేగ నినాదంతో కాగ్రెస్స్ తో జతకట్టి , ఎన్నికల్లో గెలిచి పదవులనుభవించి కాంగ్రెస్స్ తో వెన్నుపోటు పొడిపించుకొని , గత్యంతరం లేక టిడిపి తో జతకట్టి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రాపకం తో నే గెలిచి ,టిడిపి ను తెలంగాణా లో భూస్థాపితం చేస్తానని రోజూ ఒక పోటు పొడుస్తూనే ఉన్నాడు కెసిఆర్.
ఇక జార్ఖండ్ లో శిబు సొరేన్ ఒక సారి బిజెపి కి మరో సారి కాంగ్రెస్  కు మార్చి మార్చి పోట్లు పొడుస్తూ ఉన్నాడు . తమిళనాడు లో కాంగ్రెస్  రెండు ద్రవిడ పార్టీలతో ఒకదాని తర్వాత ఒక దాన్ని పొడుస్తూనే ఉంది . కర్ణాటక లో ప్రస్తుత పరిస్థితి బిజెపి, కాంగ్రెస్,జెడియస్ ల లో ఎవరు, ఎవరిని, ఎప్పుడు  వెన్ను పోటు పొడుస్తున్నారో వాళ్ళకే తెలియనంత హాస్యాస్పద, జుగుప్సాకర రీతిలో మూడు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి .
అణుఒప్పందం బిల్లు విషయం లో సొంత పార్టీ వాళ్ళకంటే   ఎక్కువ మద్దతిచ్చి ,ప్రతి గండం లోనూ బాసటగా నిలిచిన లాలూప్రసాద్ ను బీహార్ వెనుకబాటుకు మూల కారణంగా చూపుతున్న సోనియా పెద్ద వెన్నుపొటుదారు . అధికార దాహంతో ఎంతో క్రమ శిక్షణ  గల  తల్లి లాంటి పార్టీ కి వెన్నుపోటు పొడిచాడు మాజీ స్పీకర్ సోంనాథ్ ఛటర్జీ  .ఇక చిన్నా చితకా రాజకీయనాయకుల చరిత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మందా జగన్నాధం , ఆదికేశవులనాయుడు చంద్రబాబుకు  , బొత్సా సత్యనారాయణ మరియూ తులశీరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబానికి పొడిచిన పోట్లు పెద్దవే.
చంద్రబాబు అసెంబ్లీ బల నిరూపణలో శాసనసభ్యుల మద్దతుతోనే గెలిచి ముఖ్యమంత్రి  అయ్యాడనేది  జగమెరిగిన సత్యమే . 1996, 1998, ల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు . 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తో కలిసి యంటీఆర్‌టిడిపి అనే పేరుతో పోటీ చేసిన లక్ష్మీపార్వతిని ప్రజలు తిరస్కరించారనే విషయం అందరికీ గుర్తుండే వుంటుంది . 1999 లో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబును ఇంకా వెన్నుపోటుదారునిగా చిత్రించడం రోశయ్య లాంటి ఫ్యూడల్ భావాలతో వ్యక్తిపూజ  చేసే  నాయకునికి  తగనిపని .
ఈ ప్రజాస్వామ్య వ్యవస్తలో వెన్నుపోటు అనే పదానికి అధికారికత (sanctity) లేదనేది నా నిశ్ఛితాభిప్రాయం  . పైన ఈ అభియోగం మోపబడ్డ రాజకీయనాయకుల్లో చాలామంది తదనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచినవాళ్ళే . ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయనాయకుడు ఆరోజు ఉన్న పరిస్థితులకనుగుణంగా తమ విచక్షణను వినియోగించి , తమ శ్రేయస్సు కోసం, కొంత సమాజశ్రేయస్సు కోసం పరస్పర విరుధ్ధ నిర్ణయాలను తీసుకొనవలసి వస్తుంది . వాటన్నిటినీ  వెన్నుపోట్లుగా అభివర్ణిస్తే ప్రతి రాజకీయనాయకుడికీ చేతిలో  కత్తి ఉంటుంది వెన్నులో పోట్లుంటాయి .

9 comments:

బాగుంది.బోల్డు హాశ్చర్యము వేసింది కూడా,మీ జ్ఞాపకశక్తి ని చూసి.నాదెండ్ల భాస్కర రావు ని మరిచిపోయారు ఎందుకో? ఆయన మళ్లీ గెలవలేదు ఎందుకో? :) :) :)

 

@తారకం గారూ!నిజంగానే ఎడారిలో ఒయాసిస్సు లాగా వున్నదండి మీ మాట !పోరంకి వికాస విద్యావనాన్ని గూర్చిన సమాచారం మనకు ఎక్కడయినా దొరుకుతుందా ! వారితో మాట్లాడి మన బ్లాగా లో పెట్టి మరింత మందికి ఈ విషయం తెలియ చేసేలా చేస్తే మన వంతు సేవ కార్య రూపం లో చేస్తున్నట్లు అవుతుంది కదా అని నా ఆలోచన. నా ఈమెయిలు కి సమాచారం వుంటే పంపగలరా!మీ అబ్బాయి విషయంలో మీరు చేస్తున్న విషయం చాలా గొప్పది.అభినందనలండి !
నా ఈమెయిలు:karlapalem2001@yahoo.co.in
or karlapalwm2010@gmail.com

 

మీరు వ్రాసిన తెలిపిన అన్ని సంధర్భాలు ఓకె ఓక్క సొమనాథ్ తప్ప అని నా అభిప్రాయం.సీతారాం కాని లేక కారంత్ కాని క్రితం వారము లొ ఆమెరికా లొ కామ్రేడ్స్ కాలం చెల్లిన విధానాలు తొ వున్నాం ఆని అంగీకరించినట్లు ఈ మధ్య పేపర్ లొ చదివినాను .సొమనాథ్ ఒక కమిటెడ్ భావాలు వున్న నేత ఆదిగాక జీవిత చరమాంకము లొ స్పీకర్ గా.. ఇంతకంటే ముఖ్యంగా పార్టి ముసుగు లొ కారంత్ తాలూకు స్వార్థపూరిత అహంభావిత నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.జ్యొతి బసు విషయం లొ అంగీకరించినటులు దీన్నికూడా ఎదొ ఓక రొజు తప్పు ఆని ఒప్పుకుంటారు.కాకపొతె కారంత్ హాయాము లొ కాదు.కామ్రేడ్స్ దగ్గరవున్న ఒక మంచి సుగుణం యెమిటి ఆంటె తప్పును ఆన్ని ముగిసిన తరువాత తీరికగా గతజలసేతుభందనం చేయటం. ఆసరికి వ్యక్తులు వుండరు పరిస్థితులు మారిపొతాయ్.వీళ్ళు సామ్యవాదం కావాలంటారు అన్ని నిర్ణయాలు నియంత్రుత్వంగానె వుంటాయ్. ఈ విషయం గమనించిన సొమనాథ్,బసు చేసిన తప్పు తాను చేయకూడదు అని అలా చెసారు అని ఒక వాదన.

 

రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవనేది పాత సామెతే కదా. ఆ దృష్టితో చూస్తే ఆ రంగంలో వెన్నుపోటు అనేది అర్ధంలేని మాట.

 

వెంకటరమణ గారూ,
వెన్నుపోటుదారుల చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం కేటాయించ దగినవాడు, ఆంధ్రా వెన్నుపోటుదారుల సంఘం అధ్యక్షుడు నాదెండ్ల భాస్కరరావు ను విస్మరించడం క్షమించ రాని నేరం .నా తప్పును ఎత్తి చూపినందుకు థాంక్స్.
rameshssbd గారూ,
అణు ఒప్పందం విషయం లో వామపక్షాలు పర్యాయ మార్గాలు చూపించకుండా గుడ్డిగా వ్యతిరేకించడాన్ని సమర్థించను . కానీ పదవీ వ్యామోహంతోనే సోమనాథ్ చటర్జీ UPA పక్షాన నిలిచాడనేది నా ప్రగాఢ విశ్యాసం .
అబ్రకదబ్ర గారూ ,
చాలా కరెక్ట్ గా చెప్పారండీ .

 

అదిరిపోయింది సర్‌. విమర్శలు అందరూ చేస్తారు, కానీ ఇలా ఇంత అరివీర భయంకరమైన విషయపరిఙ్ఞానంతో విమర్శలు చేసేవారు చాలా అరుదు. మీ అనుభవం అలాంటిది అనుకుందాం. అద్భుతం.
సరిగ్గా నేనూ ఇలాంటి ఒకవిషయం మీదే రాద్దాం అనుకుంటూ చాలా రోజులుగా రీసెర్చ్‌ చేస్తున్నా, తగిన డీటైల్స్‌ దొరకక ఎప్పటికప్పుడు వెనక్కిపోతోంది, ఈ వ్యాసాన్ని స్ఫూర్తిగా తీసుకుని త్వరలో పూర్తిచేస్తాను :)

 

krishna chintalapati గారూ,
మీ అభిమానానికి చాలా థాంక్స్ అండీ .మీరిచ్చిన స్పూర్తితో మరిన్ని మంచి విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను . మీ వ్యాసం పూర్తి కాగానే నాకు లింక్ పంపిస్తారుకదూ !

 

amazing article ,,, ప్రతి ఒక్కడికి ఈ వెన్నుపోటు అని వాడటం పెద్ద fashion ఐపొఇన్ది ,,,, ఈ దద్దమ్మ cbn కి తగినట్టే ఉన్నట్టు ఉన్నారు వాడి advisors కూడా ,, ఈ ఆర్టికల్ లో రాసిన 10 % విషయాలు తెలిసినా తన పైన విమర్శలు చేసే వారికి సరిగ్గా సమాధానం చెప్పే వాడు ఈ పాటికి ....

 

చాల బాగుంది అండి మీ వ్యాసం ,అసలు ఒక common man కే ఇన్ని విషయాలు తెలిస్తే చంద్ర బాబు కి వీటిల్లో కొన్ని విషయాలు అయిన తెలిసి ఉండాలి , ఎంత మంది తనని వెన్ను పోటు దారుడు అన్నా అసలు ఒక్క సారి కూడా తిరిగి స్పందిచలేదు అంటే తను కూడా తనను వెన్నుపోటు దారుడు అని నమ్ముతున్నాడు ఏమో అనిపిస్తుంది , ఈ మధ్య కాలం లో YSR ,కెసిఆర్ లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మరీ పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు , అందరికంటే ఎక్కువ ఇప్పుడు చంద్ర బాబు కి ఓదార్పు అవసరం .

 

Post a Comment