టీవీ చూస్తే పిచ్చెక్కుతుందా ?

బ్రిస్టల్ యూనివర్సిటీ లోని సెంటర్ ఫర్ ఎక్సెరసైజ్, నుట్రిషన్ అండ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఏంజి పేజ్ పరిశోధనల ద్వారా తేలింది ఏమిటంటే పిల్లలు శారీరక కార్యకలాపాల్లో ఎంత చురుగ్గా పాల్గొన్నా రనే విషయంతో సంబంధం లేకుండా రెండు గంటలు టీవీ చూసినా,కంప్యుటర్ వాడినా పది పదుకొండేళ్ళ వయసున్న పిల్లలకు మానసిక పరమైన సమస్యలు వస్తాయని, ఎంతో కొంత మేరకు పిచ్చెక్కు తుందని .
ఈ పరిశోధనా ఫలితాలు చూసింతర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలకు దీనికి ఏమన్నాసంబంధం ఉందా అనే అనుమానం నాలో తలెత్తింది.బేస్ బాల్ బ్యాట్ తో ఆడ పిల్ల తల చితక్కొట్టి , వేరే అబ్బాయితో సన్నిహితం గా ఉంటం చూల్లేకే అలా చేయాల్సి వచ్చిందని టీవీల్లో సమర్ధ్ధించు కోవడం చూశాక భయంకరమైన పిచ్చి లేకపోతే అలా చేయడం సాధ్యమా? అనిపించింది.ఈ కోవకే చెందిన పిచ్చి పనులు ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు , కత్తి తో గొంతు కొయడాలూ,ప్రేమిస్తావా? చస్తావా ? అని వెంట బడతాలు నిత్యకృత్యాలు అయిపోయాయి.
వేరే తరహా పిచ్చి పనులు కూడా చాలా చూస్తున్నాం . ఒక రాజకీయనాయకుడు పోయాడని , ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయలేదని , ఆయన్ను రాజకీయం గా ఇబ్బంది పెడుతున్నారని,ఎవరో ఒక స్వార్థపరుడు తన వ్యక్తిగత ఎజండా తో నిరాహార దీక్షకు దిగాడు అనో,ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేసారనో,ఒక అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయిందని, ఒక ప్రత్యేక రాష్ట్రం రాలేదనో, ఆతహత్యాలు చేసుకుంటున్న యువతీయువకుల గురించి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ రకమైన పెడ ధోరణులకన్నిటికీ 90 వ దశకం లో వచ్చిన టీవీ విప్లవమే కారణమా ? లేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఆర్థిక అసమానతలే అగ్నికి ఆజ్యం పోసి యువతలో ఈ విధంగా విక్రుత రూపంలో బహిర్గతమవుతున్నదా ? ఈ సమస్య గురించి తల్లితండ్రులు, సామాజిక శాస్త్రవేత్తలు , మానసిక నిపుణులు ఒక వేదిక మీదకు వచ్చి చర్చించి తగు పరిష్కారాలను సూచించ వలసిన అవసరం ఉన్నది
చిన్న పిల్లల తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. మీ పిల్లలు టీవీ ముందు, కంప్యూటర్ ల ముందు గడిపే సమయాన్ని వీలైనంతవఱకు తగ్గించండి . పిల్లలకు కధలు చెబుతూ , వాళ్ళ ఆట పాటల్లొ పాలు పంచుకొంటూ వాళ్ళను పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చి దిద్దండి . పిల్లలకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేదనికంతే వారితో మీరెంత సమయం గడుపుతున్నరో అదే ప్రేమకు కొల బద్దగా తీసుకొంటారు.(ఉదా:-ఒక యువకుడు తనకు కొనిపెట్టిన మోటర్ సైకిల్ ను తుడవడానికి అది మెరవడానికి ఎంతో సమయం వెచ్చిస్తాడు కాని , నువ్వంటే  నాకిష్టం అని దానితో చెప్పడు ) . మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లొనే ఉందని గ్రహించండి . prevention is better than cure . ( కంటి పాపలై దంపతులెపుడూ  చంటి పాపలను సాకాలోయి  అనే ఘంటసాల పాత పాట సందర్భానుచితం అని నమ్ముతూ)

3 comments:

విగ్రహం లోని గ్రహం పదాన్ని భలే చెప్పారు -అభినందనలు తారకం గారూ!

 

టి వీ చూస్తే పిచ్చెక్కుతుందా -బాగా రాసారు. మీ అభిప్రాయంతో నేను వంద శాతం ఏకిభవిస్తున్నాను తారకం గారూ! ఒక్క టివీ నే ఏమి ఖర్మ ..సినిమాలు ఇప్పుడొస్తున్న వాటిలో చాలావరకు ...మన పిచ్చికి ఇంకో ప్రధాన కారణం .నాగరికత అభివృద్ధి లో ముందున్నామని గొప్పలు చెప్పుకునే కొన్ని అమెరికా లాంటి దేశాలు ప్రశాంతత కోసం మన యోగా వైపు దృష్టి సారిస్తుంటే, మన కుర్రకారేమో వాటి మీద వెర్రి వ్యామోహంతో ఇదిగో ఇలా గందరగోళంలో వున్నారు.మంచి టపా రాసారు అభినందనలు.

 

మీకు నా క్రుతజ్ఞతలు . మీరు వ్రాసిన చాలా వ్యాసాలు ఈనాడు లో చదివాను. ఇక క్రమం తప్పకుండా మీ బ్లాగులు చదువుతాను .

 

Post a Comment