తెలుగు తల్లి ముద్దు బిడ్డలా - తెలంగాణా నరమేధం లొ సమిధలా

తెలంగాణా అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు  రఘుమారెడ్డి నాయకత్వం లో 30మంది అమరవీరుల కుటుంబ సభ్యులు తెలంగాణా భవన్ ముందు ధర్నా చేసి తెరాస కు వ్యతిరేకం గా నినాదాలు చేసినట్లు , తెలంగాణా అమరవీరుల పేరిట దోచుకోవడం ఆపండి , చావులు మాకు పదవులు మీకా ? అని ప్లకార్డులు ప్రధర్సించినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీ కాంతాచారి తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, తన తనయుడి చావుకు తెరాస కారణమని ఆక్రోశించిందని , తెరాస పార్టీ వాళ్ళు తన కొడుకు ను వెంటేసుకొని తిప్పటం మూలాన అసలే ఉద్యేగాస్వభావు దైనందున ఆత్మహత్య చేసుకోన్నాడని, ఈ బలిదానానికి వెల కట్టవద్దని విలపించింది అంటే ఎంత కఠిన హ్రుదయులకైనా గుండె ధ్రవించక మానదు.
పరిస్థితులు ఇంత హ్రిదయ విదారకం గా ఉంటె కెసిఆర్ చేసిన ప్రకటన ` తెలంగాణా ఇవ్వకుంటే మానవ బాంబులు అవుతాం` అనేది పుండు మీద కారం చల్లినట్లు గా ఉంది.ఏమిటీ బాధ్యతా రాహిత్యం ? ఏమిటీ వాచాలత్వం? ఏమిటీ అరాచకత్వం ?
తమంత తాము మేధావులని పిలిపించుకొనే కోదండరాం, జయశంకర్ లాంటి నాయకులు ఎందుకిలా యువతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు? తెలుగు తల్లి ముద్దు బిడ్డలైన వీళ్ళంతా మట్టిలో కలసిపోయిన మాణిక్యాలు. ఈ తెలుగు తల్లి ముద్దు బిడ్డల మనసుల్ని కలుషితం చేసి తెలంగాణా బిడ్డలు గా పిలిచే అధికారం మీకేవరిచ్చారు? ఆత్మహత్య లను ప్రోత్సహించడం కూడా నేరమని ఈ కుహనా మేధావులకు తెలియదా? చేతికందిన బిడ్డలు ఒక ఉద్యేగా భరిత వాతావరణం లో భయంకరమైన మ్రిత్యువు ఒడి లోకి జారిపోతే ఆ తల్లితండ్రుల ఘోష,క్షోభ మీ కర్ణ పుటా లను బద్దలు చేయటం లేదా?
ఇకనైనా ఈ స్వార్థపూరిత, నిరర్థక నరమేధం ఆపండి.ఓ దగా పడిన తల్లులారా , తండ్రులారా మీ / మా అనుంగు బిడ్డల బలిపీటం మెట్లెక్కి సింహాసనం అధిష్టించాలనే క్షుద్ర రాజకీయనాయకులను తరిమి తరిమి కొట్టండి .

2 comments:

....ఇకనైనా ఈ స్వార్థపూరిత, నిరర్థక నరమేధం ఆపండి.ఓ దగా పడిన తల్లులారా , తండ్రులారా మీ / మా అనుంగు బిడ్డల బలిపీటం మెట్లెక్కి సింహాసనం అధిష్టించాలనే క్షుద్ర రాజకీయనాయకులను తరిమి తరిమి కొట్టండి . . ......

ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సింహాసనం అధిష్టించిన వారికి జై కొడుతూ బతకండి. అని కూడా అంటే మీరు చెప్పదలచుకున్నది సమగ్రంగా వుండేది.
నాణానికి ఒకవైపు మాత్రమె చూస్తున్నారు.
తెలంగాణా ప్రజల ప్రగాఢమైన ఆకాంక్షను ఏంచేద్దాం?
అనిచివేతేనా ....? ఆవిధంగా మరిన్ని ప్రాణాలను చిదిమేయడమేనా మీరు చూపించే పరిష్కారం?
ఈ చావులకు తెలంగాణా ప్రజా ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు డబ్బుతో కొంటూ, లాటీ లతో తుపాకులతో అణచివేస్తూ వస్తున్నా
ఆంద్ర పాలకుల బాధ్యతా ఏమీ లేదా? వాళ్ళ నేఁ చేద్దాం?
తెలంగాణా అంశాన్ని బాహాటంగా ఎన్నికల మానిఫెస్తోల్లో పెట్టి, వాగ్దానాలు చేసి, తీర్మానాలు చేసి, బిల్లు పెట్టండి సమర్దిస్తామంటూ
రంకెలు వేసి తీరా కేంద్రం ప్రకటన రాగానే బట్టేబాజిగాల్ల లా ప్లేటు ఫిరాయించి సమస్యను సామరస్యంగా పరిష్కరించే అవకాశం లేకుండా
చిసిన ఆంద్ర రాజకీయ నాయకుల బాధ్యతా ఏమీ లేదా?
తెలంగాణాకు సరైన నాయకత్వం లేక పోవడం అసలు దౌర్భాగ్యం.
ఇప్పుడిప్పుడే కొత్త నాయకత్వం రూపుదిద్దుకుంటోంది.
కేసీఆర్ చెన్నారెడ్డి లా మారిపోతే 1969 లో లాగా ఇప్పుడు ఎవరూ మౌనంగా వుండరు.

 

శ్రీ ప్రతాప్ గారూ,
నేను ఆంధ్రా తెలంగాణా రాజకీయాల్లొకి వెళ్ళడం లేదండీ.నా బాధంతా అన్యాయంగా బలి అయిపోతున్న అమాయకపు ప్రాణాల గురించే,వాటితో ఆడుకొనే క్షుద్ర నాయకులగురించే.

 

Post a Comment