పేరు మార్పు - ప్రగతి పధం లో మన రాష్త్రం

ప్రియతమ ముఖ్యమంత్రి రోశయ్య గారికి ,
తెలుగు లలిత కళాతోరణం ముందు రాజివ్ పేరు తగిలించినందుకు మీకు నా మనహ్‌పూర్వక అభినందనలు . మీరు రాజశేఖరరెడ్డి గారి  అడుగు జాడలలో   నడుస్తూ ఆయనకు మించిన కీర్తి(?) ని గడించాలని కోరుకొంటున్నాను .మీరు ఇదే స్పూర్తిని కొనసాగించి ప్రతి జిల్లా పేరు ముందు రాజివ్ పేరు గాని ఇందిర పేరు గాని తగిలించండి .ఇందిరా పొట్టిశ్రీరాములు   నెల్లూరు జిల్లా,రాజివ్‌వైయస్సార్ కడప జిల్లా  ల లాగా అన్న మాట .ప్రతి మండలానికి ముందు సోనియా ,రాహుల్,ప్రియాంకా పేర్లు , ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రియాంకా పిల్లల పేర్లు (అవి నాకు తెలియనందుకు నన్ను మన్నించాలి ) తగిలించండీ .ఇక ప్రతి బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్లకు ( వాటిలో ఉన్న సులభ కాంప్లెక్ష్ లకు గూడా) గాంధీల కుటుంబం లో ఎవరో ఒకరి పేరు తగిలించండి . ప్రభుత్వ ఆసుపత్రులకు (రాజీవ్ NIMS   ఆసుపత్రి , ఇందిరా ఉస్మానియా ఆసుపత్రి ) ,ప్రభుత్వ భవన సముదాయాలకు (రాజీవ్ సచివాలయం, ఇందిరా బూర్గుల రామక్రుష్నారావు భవనం ), ప్రభుత్వ రంగ సంస్థల  (ఇందిరా BHEL , రాజీవ్ ECIL ), అన్ని మున్సిపాలిటీల (రాజీవ్ GHMC , ఇందిరా VUDA)పేర్లు మార్చమని సిగ్గు లజ్జ లేని తెలుగు వాడిగా మిమ్ములను డిమాండ్ చేస్తున్నాను.
ఇప్పటికే ఉన్న ప్రైవేటు సంస్థలన్నిట్కీ విధిగా పేర్లు మార్చాల్సిందే (రాజీవ్ మైక్రోసాఫ్ట్, ఇందిరా ఇన్‌ఫోసిస్,సోనియా సత్యం ). ఇక్కడ ఏ బుధ్ధిమాలినవాడెవడన్నా   కొత్తగా పరిశ్రమలు పెడతానని వస్తే ఈ విధంగా పేర్లు పెడితేనే రాయితీలు ఇస్తామని ప్రకటించండి .అలా సిధ్ధమైన పారిశ్రామికవేత్తలకు ఎంత భూమి కావాలన్నా ఉచితంగా ఇస్తామని చాటండి.(రైతులెలాగూ వర్షాలు పడకో,వరదలొచ్చో , ఎరువులు దొరక్కో , మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అప్పు చేసో , మిల్లర్లు ధాన్యం కొనకో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.వాళ్ళ  భూమినంతా జాతీయం చేద్దాం.సర్కారు భూమి అంతా మీ ముందాయన వదిలి పెట్టకుండా భోంచేశాడు  గదా  ). ఇక నుంచి మన రాష్ట్రం లో పుట్ట బోయే ప్రతి శిశువు కూ గాంధీ కుటూంబం లో వాళ్ళ పేరే ఏదో ఒకటి పెట్టాలని శాసనం చేయండి .
ఆ చేత్తోనే సోనియా గాంధీ గారికి  గఠ్ఠిగా ఉత్తరం వ్రాయండి . మన పార్టీ అధ్యక్షుడు గా చేసిన దేవకాంత్ బారువా గారన్నట్లుగా  ఇండియా పేరును గూడా ఇందిరా గా మార్చమని . వందేమాతరం , జనగణ మన ల లో సవరణలు చేసి వీలైనన్ని సార్లు ఇందిరా ,రాజీవ్ పేర్లను దూర్చమని గాఠ్ఠిగా డీమాండ్ చేస్తూ ,
                                                                        ఇట్లు
                                                         మీ  వేపకాయ వెర్రినాధం
                      జై ఇందిరా హింద్  ,  వందే రాజీవ్ మాతరం

7 comments:

బాగాచెప్పారు........!! అంత అబిమానం వున్నవాళ్ళు వాళ్ళ మనువలకు మనవరాలకు పెట్టుకోవచ్చుగా

 

"రాజీవ్, సోనియా,ఇందిరా పబ్లిక్ Toilets" "రాజీవ్ sulabh కాంప్లెక్స్, "రాజీవ్ స్మశాన వాటిక "; "ఇందిరమ్మ వేశ్యా గృహం" "రాజీవ్ కుక్కలు", "రాజీవ్ పందు లని" "రాజీవ్ తెలంగాణా" తర్వాత తెలుగు భాష పేరు సోనియా భాష. ITALIAN OF EAST. "రాజీవ్ లంగాణ" ,"ఇందిరా తిరుమల, రాజీవ్ వెంకటేశ్వర స్వామి"

రోశయ్య గాని కి బుద్ధి సరిగా పని చేయటం లేదు - మైండ్ కరాబు అయింది . ఎర్రగడ్డ దవాఖానా లో కే సి ర్ గాడి బెడ్ పక్కన జాయిన్ చేసి ఇద్దరికీ కలిపి షాక్ ట్రీట్ మెంట్స్ ఇవ్వాలి .

 

ఈ వెధవలని ఏ భాషలో బూతులు తిట్టినా ఆ భాషకే అవమానం ...

 

I support your views and agree with RaktaCharitra's comment.

Hell with these Rajeev-shoe-lickers and your word verification :)

 

ఏమిటో ఈ పేర్ల పిచ్చి వాళ్ళకి. దాని వల్ల లాభాలుంటే వాళ్ళ కుటుంబసభ్యులకు పెట్టుకొంటే బాగుండేది. అందమైన పేర్లు పాడు చేస్తున్నారు. వేలంవెర్రి అయిపోయింది.

శ్రీవాసుకి

 

శ్రీ ప్రసన్న , వెన్నెలరాజ్యం ,రక్తచరిత్ర , ది వన్ , snkr ,శ్రీవాసుకి గార్లకు ,

మీ అందరికీ నా ధన్యవాదములు . అభిమానం , పిచ్చి ఇవన్నీ ఏమీ కాదండీ . అనూహ్యమైన లాభాల కోసం నిర్లజ్జగా పెట్టే రాజకీయపెట్టుబడి మాత్రమే .

 

వీళ్ళని ఇలాగే వదిలేస్తే కొన్ని రోజులకి INDIA ని INDIRA గా మార్చేస్తారు

 

Post a Comment