గద్దర్ కు ప్రశ్నలు - నా జవాబులు


7 తారీఖు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో తిగుళ్ల కృష్ణమూర్తి గారు `గద్దర్ ఫ్రంట్ రేపుతున్న ప్రశ్నలు` అనే వ్యాసం లో చాలా ప్రశ్నలు రేపారు . 
గద్దర్ తో సహా ఫ్రంట్ లోని నాయకులంతా ఏదో ఒక సందర్భం లో కె సి ఆర్ కు మద్దతు ప్రకటించినవారు కాదా ?తో మొదలుపెట్టి తెలంగాణా ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి అని తెలంగాణా వాదులంతా నమ్ముతున్న తెలుగుదేశాన్ని కూకటి వెళ్లతో సహా పేకలించి వేసే పనిలో కేసిఆర్ తలమునకలై ఉన్నప్పుడు ఆయన చాప క్రిందకు నీరు తెచ్చి ,ఆత్మ రక్షణలో పడేసే రీతిలో ఇప్పటికిప్పుడు ఫ్రంట్ ఆవిర్భవించటం లో అంతరార్థం ఏమిటి ? దాకా ఎన్ని నయ వంచనలో ఎంత అతి తెలివి ప్రశ్నాలో ? 
కేసిఆర్ పార్టీ లోంచి వచ్చాడో?మంత్రి పదవిలో ఉంచి నంత కాలం చాలా మంచి పార్టీ . డెప్యుటీ స్పీకర్ పదవి ఇస్తే నచ్చ బయటకు వచ్చి , కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి పదవి నలంకరించి తర్వాత ఎన్నో కుప్పిగంతులేసి తన పార్టీ వాళ్ళతో, ఉప ఎన్నికల్లో ప్రజలతో ఛీ కొట్టించుకొని కాంగ్రెస్ వాళ్ళు తన్ని తగలేస్తే , అక్కున జేర్చుకొని మహా కూటమిలో భాగస్వామి ని చేసి కోరిన గొంతేమ్మకోరికలన్ని తీర్చి మద్దతిచ్చి పార్లమెంట్ కు పంపితే , వేళ కూకటివేళ్ళతో పేకలించవలసిన పార్టీ అయిందా ? ఎంత విశ్వాస ఘాతకం? ఒక ప్రజా గాయకుడు తెలంగాణా తేవడం కోసం ఫ్రంట్ పెడితేనే చాప క్రిందకు నీళ్ళొచ్చి , ఆత్మరక్షణ లో పడితే నాయకుడి సత్తా ఏమిటో తెలియదంలేదా? 
` ప్రజా గాయకుడు ఎంత వరకు ప్రజానాయకుడు అవుతాడన్నది అసలు సంగతి`  
నాయకత్వం ఎవడిఆబ్బసొత్తా? అసలు సంగతేంటో చూస్తే గదా తెలిసేది ! 
`మంచో చెడో ,ఒంటి గానో జంట గానో ,ఎత్తుగాడో మెత్త బడో , తెలంగాణా ఉద్యమాన్ని కేసిఆర్ పదేళ్ళనుంచి బహుముఖం గా విస్తరించారు ` 
చాలా బాగా చెప్పారు గాని విస్తరించింది మాత్రం కేసిఆర్ కుటుబం . 
`సుదీర్ఘ ఉద్యమాన్ని ఫలితం దాకా తీసుకొచ్చి వ్యక్తి ప్రయోజన ఫలం లో వాటా కాంక్షించటం రాజకీయాలలో అసహజమేమీ కాదు ` 
జగన్ వాళ్ళ నాయన పోయిన తర్వాత రోజూ మొత్తుకొనెది అదే కదా ! 
`రాజకీయ పార్టీ అక్రమ సంపాదన తప్పేమీ కాదు.కెసి ఆర్ ఉద్యమ బలాన్ని చూపించి సంపాదించారు . అక్రమ సంపాదన లేకుండా రాజకీయాలు , ఉద్యమాలు నడపడం అయ్యే పనేనా ?` 
ఎంత బహిరంగం గా , నిర్లజ్జగా, అక్రమ సంపాదనను సమర్ధించే యన తెంపరితనానికి నా జోహార్లు. రాబోయే తెలంగాణా రాష్ట్రం లో అవినీతి నిరోధక శాఖ , విజిలెన్స్ లాంటి వాటితో పనే లేదన్నమాట . 
`మిగతా ఉద్యమకారులు కూడా కొడుకులు కూతుల్ల ఉద్యోగాలు మాన్పించి ఉద్యమం లోకి తీసుకొస్తే కాదన్నవారెవ్వరు?` 
మహానుభావుడు 70 సం లేటుగా పుట్టాడు . లేకుంటే మహాత్మా గాంధీ కి కూడా ఇదే ఉపదేశం చేసేవాడే. 
`మా లో మేము కోట్లాడుకున్నప్పుడు మేం ఇదుగురమ్,వారు నూరు మంది . మరెవరైనా మాపైకి వస్తే మాత్రం మేం 105 మంది అన్న ధర్మరాజు యుద్ధనీతిని గద్దర్ కు ప్రత్యేకం గా చెప్పనక్కర లేదు.` 
తెలంగాణా నాయకుల్లో పాండవులెవరో , కౌరవులెవరో యన చెప్పలేదు కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం కురుక్షేత్ర యుద్ధం తప్పదని చెప్పకనే చెప్పాడు . 
`తెలంగాణా కు శత్రువు ఎక్కడో లేడు. మన తెలంగాణా లోని కలసి నడవని అనైక్యతలోనే,ఎరకు ఆశ పడే అమాయకత్వం లోనే,అమ్ముడు పోయే తత్వం లోనే ,ఆరంభశూరత్వ ఆశక్తత లోనే ` 
సర్వ అవలక్షణాలు ఉన్నాయని ఒప్పుకుంటూనే స్వయం పాలన కావాలి అని అనడం సబబా ? 
`నాయకుడు లేక పోయినా పని చెడిపోతుంది , అనేక మంది నాయకులున్నా అంతే సంగతులవుతుంది ` 
అసలు మీకు కావాల్సినది ప్రజాస్వామ్యమా? దొరల రాజ్యమా ? 
 
ఇంత అపరిపక్వ . శూన్య సిద్ధాంత ,బరితెగించిన లేకి నాయకత్వమా తెలంగాణా కు కావలసినది ? విజ్ఞ గల తెలంగాణా వాదులారా ఆలోచించండి . 
 

3 comments:

I am belonging to Vijayawada. what you given the answer to Mr.Krishna Murthy all are correct. Mr. K.C.R is one and only person as hardile to Telangana.If telangana will declared his business complete .

 

గత్యంతరంలేక కేసీఆర్ ను బలపరిచేవాళ్ళకు వొకవేరు దారి గద్దర్ చూపించినాడు.మీరు బాగా అడిగారు.సంతోషం.

 

Post a Comment