జగన్నాటకం-2

అదపాదడపా అంతర్జాలంలోనూ,కొద్ది మంది స్నేహితుల మధ్య సంభాషణలలోనూ ఈ మధ్య తరచుగా వినబడుతున్నమాట 'ఏదిఏమైనా జగన్ మగాడు,సగటు కాంగ్రెస్ వాదుల్లాగా సోనియాకు దాసోహమనకుండా ,ఆమె మీద విమర్శనాస్త్రాలెక్కుపెడుతూ ,125 సం: చరిత్రగల కాంగ్రెస్ పార్టీకు సవాల్ గా మారాడని. ఈ అభిప్రాయం సమంజసమా కాదా అనేది పరిశీలిద్దాం.
విదేశీ వనిత అనే విషయాన్ని పక్కకుపెడితే సోనియా ను విమర్శించేవాళ్ళ ముఖ్య అభియోగాలేమిటి?1) కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి పాతరేసి ,రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అన్ని పదవులలో తన ఇష్టం వచ్చిన నాయకులను కూర్చోబెడుతుంది.2) ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమైన కుటుంబపాలన తో పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. 3)మన్మోహన్ సింగ్ లాంటి కీలుబొమ్మలను పదవిలో కూర్చోబెట్టి ,కీలకనిర్ణయాలన్నీ తను తీసుకొంటూ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధానిని బాధ్యుడిని చేస్తూ, పార్టీ మరియు ప్రభుత్వ విజయాలను తన ఖాతాలో వేసుకొంటుంది. 4) కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను,కేంద్ర మంత్రులను తన కలక్షన్ ఏజెంట్లుగా వాడుకొంటూ అవినీతి కూపంలో మునిగిపోయింది.
రాశేరె ఆరేళ్ళ పాలనలో మన రాష్ట్రంలో జరిగిన నిర్వాకం ఏమిటి? తన అనుయాయులను యోగ్యతాయోగ్యతలతో నిమిత్తం లేకుండా కీలక పదవుల్లో కూర్చోబెట్టిన సంఘటనలు కోకొల్లలు.కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా రాజకీయ ఆరంగేట్రం చేసినవాడు,తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అక్రమార్జన చేసినవాడు,ప్రజా సమస్యల గురించి ఏనాడూ ఉద్యమించనివాడు,ఏమాత్రం రాజకీయానుభవం లేనివాడు,చనిపోయిన ముఖ్యమంత్రి వారసుడుగా మాత్రమే లోకానికి తెలిసినవాడు,ముఖ్యమంత్రి పదవినాశించడం ఏవిధంగా సమర్ధనీయం?
2004 ఎన్నికల్లో మరియు 2009 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడటానికి తన తండ్రే కారణమనే వితండవాదంతో,తన గొంతెమ్మ కోర్కె సోనియా తీర్చలేదనే అక్కసుతో, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి,పార్టీను,అధ్యక్షురాలిని దూషిస్తున్నాడు.సైధ్ధాంతికంగా,నైతికంగా,ప్రజాసేవాపరంగా ముఖ్యమంత్రి పదవినధిష్టించడానికి ఏరకంగా అర్హుడు?సోనియాగాంధీ తన కుటుంబాన్ని చీల్చిందని అభియోగం మోపుతున్నాడుగాని ,అది అబధ్ధమని జగన్ బాబాయి ఎన్నో మార్లు వివరణ ఇచ్చుకున్నాడు.ఇంత జరిగినా సోనియా, జగన్ ను పిలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే జై సోనియా అనడా? ఆమె ముందు మోకరిల్లడా?
జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే తన తండ్రి పాలనను మరపిస్తానని,స్వర్ణయుగం తెస్తానని,30 ఏళ్ళు నిర్విఘ్నంగా పరిపాలిస్తానని అంటున్నాడు .అవినీతి,కుంభకోణాలు,ఆశ్రితపక్షపాతం,వనరుల దోపిడీ,వ్యవస్థల కుప్పకూల్చడం లాంటి పనులన్నీ యధేచ్ఛగా చేస్తానని హెచ్చరించడమన్నమాట.
సిధ్ధాంతాల ప్రాతిపదికన,నైతిక విలువలకోసం లేక ప్రజా హితం కోసం సోనియాను ఎదురిస్తున్నాడా? లేక తన స్వార్ధ ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ,తన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికో,తన ముఠాసభ్యులతో రాష్ట్రాన్ని మరింత దోచుకోవడంకోసం ఈ అలజడి సృష్టిస్తున్నాడా? ప్రజాస్వామ్యవాదులు,సమాజం అభివృధ్ధిపధంలో పయనించాలని కోరుకునే అభ్యుదయవాదులు,చదువుకొన్న సంస్కారవంతులు,ఇటువంటి అఘాయిత్యాలకు అంతిమంగా బలయ్యే అమాయక ప్రజానీకం , పై రెండు ప్రశ్నలలో ఒక సమాధానాన్ని ఎంచుకొని జగన్ పయనిస్తున్న బాట హర్షనీయమో కాదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.
(ఈ వ్యాసం నా స్నేహితుడు చలసాని శిశిర్ మార్గ దర్శ్యకత్వంలో వ్రాసినది.)

జగన్నాటకం-1

రాశేరె బావ మరిది రవీంద్రనాథరెడ్డి 17 డిసెంబర్ కడపలో మాట్లాడుతూ ,రాశేరె మరణం ప్రమాదవశాత్తూ కాదని,సోనియా రిలయన్సులు కుమ్మక్కై చేసిన హత్యగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం ఒక సిబీఇ అధికారి స్వయంగా జగనుకు చెప్పినట్లు తెలియపర్చారు.అదే రోజు జగన్ పులివెందులలో మాట్లాడుతూ తన తండ్రి మరణం గురించి జనం అందరికీ సందేహాలున్నాయని ,అదే విషయం సాక్షి పేపర్ లో మరియు టీవీ చానల్ లో వస్తే సాక్షి ఆఫీసులో పోలీసులు సోదాలు చేశారని ,ఆవిషయం అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను అడిగితే అధీష్ఠానం ఆదేశాల మేరకే అలా చేయవలసి వచ్చిందని వివరణ ఇచ్చుకొన్నట్లు కూడా తెలియజేశారు.సాక్షిలో ఈ విషయం గురించి చెబితే తప్పేమిటని దబాయించారు.జగన్ అబ్బ రాజారెడ్డి ఎంతోమంది అమాయకులను కడప, అనంతపూర్ జిల్లాలలో హతమారిస్తే,ఆకుటుంబాల వ్యధ గురించి ఒక్క క్షణమన్నా ఆలోచించారా?
అందరి ఆలోచనా ధోరణి తనలాగే ఉంటుందని జగన్ భావిస్తూ ఉన్నాడు.తండ్రి ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ పాపాన్ని సోనియా మరియు అంబానీల కాపాదిస్తున్నారంటే వాళ్ళిద్దరినీ తన ప్రత్యర్థులుగానే భావిస్తున్నాడన్నమాట. సోనియాగాంధీ తను అడగంగానే ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పలేదు గనుక ఆమె మీద దుగ్ధ వుండటం సహజమే,మరి అంబానీలను జగన్ తన ప్రత్యర్థులుగా ఎందుకు భావిస్తున్నట్లు?రాశేరె,జగన్ రిలయన్స్ గ్యాస్ లో వాటాలడిగినట్లు గా పుకార్లు వచ్చాయి. తన తండ్రి మరణంలో అంబానీల పాత్ర ఉందంటే ,వాటా అడిగినమాట పుకారు కాదు ,నిజమని జగన్ అంగీకరించినట్లే.బందిపోటు దొంగల తరహాలో జాతి సంపదను కొల్లగొట్టినట్లు ఒప్పుకొన్నట్లే.
18 వ తారీఖున కడప జిల్లాలో మాట్లాడుతూ ,పులివెందుల ,కడప ఉప ఎన్నికల్లో తనని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ పోలీసు బలాన్నీ ,డబ్బునూ ప్రయోగించే అవకాశం ఉందని జగన్ ఆరోపించారు.అంటే 2009 ఎన్నికల్లో తను అలాగే చేసానని ప్రజల ముందు నేరం ఒప్పుకొన్నట్లే.
ప్రాణాలను సైతం లెక్కచేయక 1500 కిమీ పాదయాత్ర చేసి అధికారం అందించాడట మహానేత.ప్రాణాలను పణంగా పెట్టి యుధ్ధభూమి కెళ్ళినట్లో,టెర్రరిస్టుల బారినుంచి దేశాన్ని కాపాడినట్లో పాదయాత్రనభివర్ణించాడంటే ప్రజలను వెర్రి వెధవల కింద జమకడుతున్నాడన్నమాట.దోచిన లక్ష పైగా కోట్లను 1500 పెట్టి భాగిస్తే కిమీ కు షుమారుగా 70 కోట్లు వస్తుంది.కిమీ పాదయాత్రకు 70 కోట్ల చొప్పున గిట్టుబాటైతే రోడ్లన్నీ పాదయాత్ర చేసే జనంతో నిండి పోవా?ఈ భూప్రపంచంలో పాదయాత్రతప్ప వేరే వ్యాపకం పెట్టుకొనే వెర్రిబాగులవాళ్ళు ఉంటారా!

కెకె గావు కేకలు

జుస్టిస్ శ్రీకృష్న దేశ సమగ్రత గురించి చేశిన వ్యాఖ్యలను ఖండిస్తూ కెకె ఇలా అన్నారు" దేశ భక్తి ,ప్రజాస్వామ్యం,రాజకీయాలు,శాంతి భద్రతల గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరంలేదు.ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు,ఎలా బాధ్యతగా వ్యవహరించాలో బాగా తెలుసు."
ఈయన దేశభక్తి సంగతేమో గానీ,స్వామిభక్తి,వందిమాగధ లక్షణాల గురించి మాత్రం ఏ అనుమానాలూ లేవు.ప్రజాస్వామ్యం,రాజకీయావగాహనల సంగతి కొస్తే ,ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక పైన పేర్కొన్న సుగుణాలతో రాజ్యసభ సీటు భిక్షగా పొందినవాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వేశ్య పాతివ్రత్యం గురించి పాఠాలు చెప్పడం లాంటిదే.పిసిసి అధ్యక్షుడిగా చేసిన మొదటి ప్రకటన నా పేరు కేశవరెడ్డి అయిఉంటే నేనెప్పుడో ముఖ్యమంత్రిని అయిఉండేవాణ్ణని.ఒక వర్గం మీద ఉన్న కడుపు మంట ఈయనకున్న రాజకీయ అవగాహన .
జార్ఖండ్ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జీ గా ఉండి టికెట్ల పంపిణీలో డబ్బు తిన్నాడని తన పార్టీ నేతలతోనే అరోపణలనెదుర్కొన్న ఇతగాడు బాధ్యతగా ప్రవర్తించడం తెలుసంటే ఎలా నమ్మాలి.
ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే , ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉండగా 2007,సెప్టెంబర్ 8న కొడుకు వెంకట్,ప్రశాంతరెడ్డి అనే రియాల్టర్ ను ఇంటికి పిలిపించుకొని తుపాకీతో కాల్చి చంపితే,అందరి కాళ్ళు పట్టుకొని ఆ కేసు మాఫీ చేయించుకొన్న ఘన చరిత్రగలవాడు.అదే కేసు జస్టిస్ శ్రీకృష్న లాంటి జడ్జ్ ముందుకెళితే కొడుక్కి కనీసం జీవితఖైదు,కెకె కు సాక్ష్యాధారాలను తారుమారు చేసి నేరం లో భాగస్వామ్యుడయినందుకు 10 సం జైలు శిక్ష తధ్యంగా పడేవి. ఇతగాడా జస్టిస్ శ్రీకృష్న లాంటి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడేది.
నేరస్థులకు కొమ్ముకాయడం,అధినాయకత్వానికి భజన చేయడం తప్ప మరేమీ తెలియని ఇటువంటి నాయకులు తెలంగాణా సమాజాన్ని ఏవైపుకు నడిపిస్తారో తలుచుకొంటేనే వళ్ళంతా కంపరంగా ఉంది.

దేవత సోనియా,ఇటలీ నియంతగా మారిన వైనం

భారతదేశమంతా సోనియాగాంధీ సొంత సామ్రాజమైనట్లు,అందులో ఆంధ్రప్రదేష్ ఒక సామంత
రాజ్యమైనట్లు వ్యవహరిస్తున్నారని,దేశంలో ఇంగ్లీష్ పాలన పోయి ఇటలీ పాలన
వస్తుందనే భయం వేస్తుంది అని వ్యాఖ్యానించాడు తుడా మాజీ అధ్యక్షుడు
చెవిరెడ్డి భాస్కరరెడ్డి.ఈయన ఏ భాజపా వాడో లేక ఆర్యస్‌యస్ వాడో అని సందేహం
కలగడం సహజం.ఇతగాడు రాశేరె అనుంగు శిష్యుడు.టిటిడి పాలకమండలి సభ్యుడుగా
దేవస్థానం డబ్బు దారిమళ్ళించి తన వూరికి రోడ్డు వేయించుకొని అన్నిరకాల
అవకతవకలకూ పాల్పడ్డ వ్యక్తి.2009 లో ప్రజలు రాశేరె ను ముక్యమంత్రిని
చేయడానికే కాంగ్రెస్ కు వోటు వేసారట.కాంగ్రెస్ పార్టీ,ఆం.ప్ర.రాష్ట్రం
రాశేరె కుటుంబసభ్యుల సొత్తు లా కనపడుతోందీ సత్రకాయలకు.
2004 లో పిసిసి అధ్యక్షుడికే ముఖ్యమంత్రి పదవి అనేసంప్రదాయాన్ని పక్కకు
పెట్టి మరీ రాశేరె ను ముఖ్యమంత్రిని చేస్తే,ఆయన తన అనుచరగణాన్ని అందలం
ఎక్కించి ,రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేయనిచ్చినన్నాళ్ళూ సోనియా ఒక
అమ్మ,ఒక దేవత.2004 లో రాశేరె కు అవకాశమిచ్చిన రీతిలోనే కిరణ్ కుమార్ కు
సియం పదవి కట్టబెట్టగానే ఆమె ఇటలీ వనిత,నియంత గా మారిపోయిందట.ఎంత
హాస్యాస్పదం.పాపం సోనియా చిన్నప్పుడు కొత్త ఆంధ్రవాచకం చదువుకోలేదు.అందుకే
పాముకు పాలు పోసింది,ఫలితం అనుభవిస్తున్నది.చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత
మహదేవా అన్నారు పెద్దలు.(కొ.ఆ.వా.లో కధ మనకందిరికీ తెలిసిందే.రైతుకు తన
చేలో పాముపిల్ల దొరికితే దాన్నింటికి తెచ్చి పాలుపోసి ప్రేమగా
పెంచుతాడు.పాము పెద్దదై రైతును కాటు వేసి చంపుతుంది.నీతి:దుష్టులను
చేరదీయరాదు.)

కులసమావేశాలు-రాజ్యాంగ ఉల్లంఘన

వైశ్యజాతి కీర్తిని ఎలుగెత్తి చాటండి.టీవీ పెడితే ఈ ప్రకటనల హోరు.టీవీ తెర ఎడమ పైభాగంలో రోశయ్య గారి ఫోటో.హైదెరాబాద్ రోడ్డు మీద కెళితే KASS అనే పేరుతో పెట్టిన పెద్ద హోర్డింగులు.షరా మామూలే,రోశయ్యగారి పెద్ద పెద్ద ఫోటోలేగానీ ఈ సమావేశ నిర్వాహకుల పేర్లుగాని ఫోటోలు గాని లేవు.
కులమతాలకతీతంగా ,రాగద్వేషాలకు తావు లేకుండా,పాలన సాగిస్తానని,రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన పెద్దమనిషి , ఇంతకు ముందే ముఖ్యమంత్రీ ధైర్యం చేయని విధంగా కులసంఘాల కార్యక్రమాలకు హాజరవుతూ ,తన కులపోళ్ళతో సన్మానాలు చేయించుకుంటూ ,తన కులానికే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.ఈ నేరానికి రోశయ్య గారిని ప్రాసిక్యూట్ చేయాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేయాలని ప్రజాస్వామ్యవాదులకు నా విజ్ఞప్తి.
నవంబర్ 20 న ది హిందూ లో ఇచ్చిన ప్రకటన "congregation of arya vysyas "లో రోశయ్యగారి పెద్ద ఫోటో లు రెండు,మహాత్మా గాంధీ,పొట్టి శ్రీరాములు ,వాసవీమాత ల చిన్న ఫోటో లతో ప్రచురించారు.భారతదేశంలో దాదాపు అన్ని కులాలకు కులసంఘాలు ఉన్నాయి.అన్ని కులసంఘాలు సమావేశాలు జరుపుకోవడం ,కుల ప్రముఖులను సన్మానించడం అనే ప్రక్రియ తప్పొప్పుల గురించి చర్చించడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు.కానీ జాతిపిత మహాత్మాగాంధీని కేవలం ఒక కులనాయకుడీ స్థాయికి దిగజార్చడం ఈ రాజకీయమరుగుజ్జులు చేసిన దుస్సాహసం.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రోశయ్య ఈ కార్యనిర్వాహకులను వారించకుండా ఈ ప్రక్రియ లో భాగం పంచుకొని తన మరుగుజ్జు స్థాయికి జాతీయనాయకులను కుదించడం క్షంతవ్యం కాని నేరం.
P.S.:-భారతదేశ అతి పెద్ద స్కామువీరుల జాబితా కోసం గూగ్లింగ్ చేస్తే మొదటి పది స్థానాలలో ఏడు స్థానాలనాక్రమించిన పేర్లు దిగువనిస్తున్నాను .
2)హర్షద్ మెహతా(స్టాక్ మార్కెట్ కుంభకోణం),3)కేతన్ ఫరేఖ్ (స్టాక్ మార్కెట్ ),4)C.R. భన్సాలి (కాపిటల్ మార్కెట్),6)దినేష్ దాల్మియా (స్టాక్స్ ),8) వీరేంద్ర రస్తోగీ (బ్యాంకులను మోసం చేయడం),10)ఉదయ్ గోయల్ (చిన్న మదుపుదార్లను ప్లాన్ టేషన్ స్కాం ద్వారా మోసం). వీళ్ళు కాక మన రమేష్ గెల్లి (గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ).వీళ్ళందరినీ సన్మానిస్తే ఇంకా సముచితం గా ఉండేదేమో!

ఇందిరమ్మ మెదక్ జిల్లా-ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

ఆంధేరాప్రదేష్ ముఖ్యమంత్రి రాహురోశయ్యకు,
వేపకాయ వెర్రినాథం వ్రాసుకునే విన్నపం.నేనింతకుముందు తమకు వ్రాసిన"పేరు మార్పు-ప్రగతి పథంలో మన రాష్ట్రం' అనే జాబుకు స్పందించి తమరు మెదక్ జిల్లాకు ఇందిరమ్మ పేరు పెట్టానికి కసరత్తు ప్రారంభించారని తెలుసుకొని కొంత సంతోషించిన మాట వాస్తవమే కానీ మీరింతటితో ఊరుకొంటే ఏమాత్రం ఉపేక్షించేది లేదు.డిశెంబర్ 31 న శ్రీకృష్నకమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ముక్కలు చేస్తే ఎక్కువ తెలుగు రాష్ట్రాలకు మన గాంధీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొని మన వీరవిధేయత చాటుకొనే మహదవకాశం లభిస్తుంది.
తెలంగాణకు సోనియాలంగాణ అనే పేరు అద్భుతంగా సరి పోతుంది.కోస్తాంధ్రకు కోస్తిందిరాంధ్రని ,రాయలసీమకు రాహులసీమనేది అతికినట్లు సరిపోతుంది కదూ.ఇకపోతే ఉత్తరకోస్తాంధ్రకు కళింగదేశమని నామకరణం చేయమని కొంతమంది అమాయకులు కోరుతున్నారు.కళింగదేశం,ఓఢ్రదేశం ప్రస్తుత ఒడీషా రాష్ట్ర నామాంతరాలు.ఈ రాష్ట్రానికి చెందిన ఒక కులం వాళ్ళను మన రాష్ట్రంలో వడ్డెర లేక వడ్డి అని,మహారాష్ట్రాలో వాఢిరాలని ,ఉత్తరప్రదేష్ లో వాఢ్రాలని పిలవబడతారు.
మన ప్రియతమనేత,త్యాగశీలి,గౌతమబుధ్ధుని తర్వాత రాజ్యాన్ని త్యజించిన నేతగా మన కళాబంధుచే శ్లాఘించబడే అధినేత అల్లుడుంగారైన రాబర్ట్ వాఢ్రా తన పూర్వీకులు ఒడీషా కు చెందినవారని గర్వంగా చాటుకున్న నేపధ్యంలో ఆయన పేరు ఈ ప్రాంతానికి పెట్టడం సముచితంగా ఉంటుందని నేభావిస్తున్నా.ప్రియాంకా పిల్లల పేర్లు తెలియకపోవడం మూలాన,యువనేత ఇంకా బ్రహ్మచారి గానే ఉండిపోవడం మూలాననిన్నూ,భవిష్యత్తులో ప్రియాంకా వాధ్రా పిల్లలలో ఒకరిని ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టే మహదవకాశం మనకు దక్కవచ్చన్న ఆశతోను,రాబర్ట్ వాఢ్రా పేరు ఈ ప్రాంతానికి పెట్టి మన భావితరాలకు గూడా బంగారు భవిష్యత్తు నివ్వాలనే దురాలోచనతోనూ ఉత్తరకోస్తాంధ్ర పేరు రాబర్ట్ వాఢ్రాంధ్ర గా నామకరణం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా.తమ అమోఘమైన( చావు)తెలివితేటలతో ,వాఘ్ధాటితో ప్రత్యర్థులమీద ఎదురుదాడి చేసే మీరు తేరగా వచ్చే ఈ మహదవకాశాన్ని ప్రత్యర్థులకందకుండా చేసి మరో జాక్ పాట్ కొట్టాలని కోరుకుంటూ,
భవదీయుడు
వేపకాయ వెర్రినాధం

సుమతీ శతకం-కులగజ్జి-వెర్రి డిమాండ్లు

15 నవంబర్ ఆంధ్రజ్యోతి లో" కులదూషన చేయదగునె కుమతీ సుమతీ"అనే వ్యాసం వ్రాశారు ప్రొ:పులికొండ సుబ్బాచారి(ద్రావిడ విశ్వ విద్యాలయం,కుప్పం).ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం లో జరిగే పి.హ్.డి ల భాగోతం గురించి ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి మనకందరికీ తెలుసు.ఇప్పుడర్థమయింది ఈ విశ్వవిద్యాలయం అంత నొటోరియస్ గా ఎందుకయిందో.
సుమతీ శతకం ,వేమనశతకాలో వివిధ కులవృత్తులవాళ్ళను దూషించారని,సుమతీశతకం లో ఈ దూషనపర్వం మరీ ఎక్కువగాఉందని ఎన్నో ఉదాహరణలతో ఎంతో చక్కగా విశ్లేషించారు.ఈ శతకంలో ఉర్దూ,హిందుస్తానీ పదాలు లేవుగాబట్టి ఇది 14 వ శతాబ్దం కంటే ముందుదనీ,స్త్రీల మీద వ్యతిరేకవ్యాఖ్యానాలు ఉన్నయి కాబట్టి వ్రాసినవారు పురుషుడయిఉంటాడని,అంటరాని కులాలను,వృత్తి కులాలను దూషించాడు కాబట్టి ప్రాబల్యకులానికి చెందినవాడని,వెలమల మీద,బ్రాహ్మణుల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కాబట్టి ఆ రెండు కులాలను మినహాయించాడు.తెలంగాణ లో వాడుకలో ఉన్న అగసాలె(కంసాలి) కులాన్ని రచనలలో విరివిగావాడాడుగాబట్టి రచయిత తెలంగాణ కు చెందినవాడనే నిర్ధారణకు వచ్చాడు.రాజుని దూషించాడు కాబట్టి రాఅయ్యే అవకాశం లేదన్నాడు గాని ప్రాబల్యకులాల్లో దేనికిచెందినవాడో ప్రస్తావించకుండా వదిలేశాడు.సుమతీ శతకకారుడు బద్దెన అనీ బద్దె భూపాలుడనీ సాహిత్యకారులు వ్రాశారంటూనే ఒక్కడు కాదని చెప్పడానికే ఎక్కువ అవకాశం ఉందని తేల్చాడు.
ఈ అమోఘమైన థీసిస్ ను ముగిస్తూ వివిధ వృత్తికులాలను కించపరిచే ఈ శతకాన్ని నిర్విద్దంగా నిషేధించాలని నొక్కి వక్కాణిచాడు.
14 వ శతాబ్దం కంటే ముందు ఆ రోజున్న కాలమానపరిస్తితులకద్దంపడుతూ ,ఒక నిండు జీవిత సారాంశాన్ని కాచివడపోసి,పద్యరూపంలో ,తెలుగువాళ్ళకొక్కరికే సొంతమయి ,వారసత్వంగా వచ్చిన వెలకట్టలేని అమూల్య నిధి నిక్షేపాలు మన శతకాలు.అడిగిన జీతంబియ్యని మిడిమేలపు కొలువుగొల్చి మిడుకుటకంటెన్ వడిగల ఎద్దులగట్టుక మడిదున్నుకు బ్రతికవచ్చని ధైర్యం చెప్పి,సిరిదా వచ్చినవచ్చును సలలితమగు నారికేళ సలలము భంగిన్ సిరిదాపోయినపోవును కరిమింగిన వెలగపండని జీవిత సత్యం తెలిపి ,అల్పుడెపుడుపల్కు ఆడంబరముగాను సజ్జనుండుపలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అని విశదీకరించి,హీనుడెన్ని విద్యలను నేర్చినగాని ఘనుడు కాదు హీన జనుడుకాని పరిమళమును మోయు గార్దభము గజమగునె అని సూత్రీకరించిన ఆణిముత్యాలనెన్నిటినో పరిగణలోకి తీసుకోని ఈ మహానుభావుడిని పరిమళాన్ని మోసే గార్దభమనాలా లేక ప్రతి ఆంశాన్నీ కులమనే అద్దంలోంచి మాత్రమే చూడగలిగే అంధుడనాలా?
చంద్రబాబు ఒక ఉపమానం గా వాడిన గల్లాపెట్టె అనే మాటను కులానికి అన్వయించి మొత్తం వైశ్యకులాన్నే దూషించినట్లు రంగులద్దిన రోశయ్య,నరకాసురుడు,మహిసాసురుడు నిమ్నకులాలవాళ్ళనీ,దసరా,దీపావళి పండుగలు అగ్ర కులాలవాళ్ళు ,నిమ్నకులాలనవహేళన చేస్తూ జరుపుకొనే పండుగలని కొన్ని కులసంఘాలు చేస్తున్న వాదనులు వింటూ ఉంటే భారతంలో కొజ్జాలను చిన్న చూపు చూసినందుకు భీష్ముణ్ణి నిషేధించాలని కొజ్జాలు,నిమ్నజాతికి చెందిన ఏకలవ్యుడుకి అన్యాయం చేసినందుకు ద్రోణుడ్ని నిషేధించాలని నిమ్నజాతులవాళ్ళు,క్షత్రియులను ఊచకోతకోసినందుకు పరశురాముడుని నిషేధించాలని క్షత్రియులు,సీతనపహరించి లంకలో బంధించినందుకు రావణుణ్ణి నిషేధించాలని మహిళా సంఘాలవాళ్ళు,లాంటి వెర్రి మొర్రి డిమాండ్లు ఎన్ని వస్తాయో అని నాకు చాలా భయం గా ఉంది.

బ్రాహ్మణుడు,మేకపిల్ల-నలుగురు దొంగల కధ


బ్రాహ్మణుడు,మేకపిల్ల-నలుగురు దొంగల కధ
డిసెంబర్ 9 న చిదంబరం చేసిన ప్రకటన ,ఆంధ్రప్రదేష్‌రాజకీయాల్లో పెను మార్పు తెచ్చిన సంఘటన.ప్రకటన వెలువడిన మర్నాడు లగడపాటి రాజీనామా తో మొదలయి ఆంధ్రప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యుల రాజీనామాలతో జోరందుకొని అన్ని పార్టీ ల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించాయి.
ప్రణబ్‌ముఖర్జీ కమిటీ కు తాము తెలంగాణా కు అనుకూలం అని లేఖ ఇచ్చిన చంద్రబాబు,రోశయ్య ముఖ్యమంత్రి గా ఆయన అధ్వర్వం లో జరిగిన అన్ని పార్టీల సమావేశం లో కూడా తాము తెలంగాణా కు అనుకూలమని చెప్పారు.అయినా కెసిఆర్,కోదండరాం, తెలంగాణా జాక్‌నుంచి చిన్నా చితకా కాంగ్రెస్ నాయకుల వరకూ చంద్రబాబునూ,తెదేపా ను తెలంగాణా ఏర్పాటుకు ప్రధమ అడ్డంకి అనీ,తెలంగాణా ద్రోహుల పార్టీ అని నిందించడం నాలాంటి ఎందరినో సంభ్రమాఛ్యర్యాలకు గురి చేసింది.రాష్ట్రంలోను, కేంద్రంలోను అధికారంలో ఉన్న పార్టీ రెండు వరుస ఎన్నికల్లో  ఓడిపోయి నిరాశా నిస్ప్రుహలతో ఉన్న విపక్షాన్నీ,చేష్టలుడిగి దిక్కుతోచని  పరిస్థుతలో ఉన్న ఆ పార్టీ అధినేతను ఆడిపోసుకోవడం,తూలనాడటం ఎంత వరకు సబబు అనే ప్రశ్న ఎంతో మంది మెదళ్ళను తొలుస్తున్న మాట మాత్రం నిజం.
అసలు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనకు తెర వెనక భాగోతం ఏమిటి ?2009 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి భద్రతాసలహాదారు నారాయణన్‌మావోయిస్టుల విజ్రుంభణ,ముస్లింఫండమెంటలిసంలు తెచ్చే కీడును ధ్రుష్టిలో ఉంచుకొని ,ప్రత్యేక తెలంగాణా కు వ్యతిరేకంగా ఇచ్చిన సలహాను చిదంబరం ఎందుకు పాటించలేదు?2014 లో రాహుల్‌గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమనే రంగుల కల అధినాయకురాలి ఏకైక అజెండా కాబట్టి,ప్రత్యేక తెలంగాణా ఇస్తేనే అది నెరవేరుతుందని కెసీఅర్ అనే రాజకీయమాంత్రికుడు క్రిస్టల్ బాల్ లో చూపించడమా?ఆంధ్రప్రదేష్‌సామాజిక రాజకీయ పరిస్థితుల మీద ఏమాత్రం అవగాహన లేని అహమ్మద్‌పటేల్ లాంటి రాజకీయసలహాదారులు ఇచ్చిన ఒకేదెబ్బకు రెండు పిట్టలు(జగన్,చంద్రబాబు)లాంటి అపరిపక్వ సలహా కారణంగానా?తన చిన్నతనంలో ఆనాటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర వేర్పాటు ఉద్యమం గురించి విన్న బాల చిదంబరం మనసులో ఉన్న వ్యతిరేకభావనల పర్యవసానమా? ఆం. ప్ర.రెండుగా చీల్చి,దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి తమిళనాడుకు  లభ్ది చేకూర్చాలన్న కుట్రపూరిత భావనతోనా?ఏది  ఏమైనా కాంగ్రెస్అధిష్టానం ఆంధ్రప్రాంతంలో ప్రజలనుంచి,తమ పార్టీ ప్రజాప్రతినిధులనుంచి ఉవ్వెత్తున ఎగసిన వ్యతిరేక స్పందనను ముందస్తుగా అంచనా వేయలేదనేది వాస్తవం .కాంగ్రెస్‌పార్టీ తన ఘోర తప్పిదాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నమే చంద్రబాబు మీద ఈ బురద జల్లే కార్యక్రమం.
చంద్రబాబును తెలంగాణా ద్రోహిగా చిత్రించడానికి కాంగ్రెస్ పార్టీకున్న రాజకీయ అవసరం మనం గుర్తించాం.మరి కెసిఆర్,కోదండరాం ,ఓయు జాక్ వీళ్ళ మాటేమిటి?రోజూ చంద్రబాబు మీద వీళ్ళు కారాలూ మిరియాలూ నూరాల్సిన అవసరం ఏమిటి?
కాంగ్రెస్ పార్టీ 2014 కంటే ముందే ప్రత్యేకరాష్ట్రం ఇస్తే శాసనసభ్యుల సంఖ్యాపరంగా దానికే మెజారిటీ ఉంటుంది గాబట్టి అదే అధికారపార్టీ అవుతుంది.కాంగ్రెస్‌తర్వాత అత్యధిక శాసనసభ్య్లు మరియు ఓట్ బాంక్ ఉన్న పార్టీ తెదేపా.తెలంగాణా ఏర్పడితే తెదేపా ప్రతిపక్షం లో ఉండి రెండో స్తానం లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు పోటీ రెండో స్థానం కోసమే.కెసిఆర్.కోదండరాం.మొ: వాళ్ళంతాకాంగ్రెస్  పేరోల్ లో ఉండ బట్టీ తెలుగు దేశాన్ని ఎంత బలహీనపరిస్తే అంత లాభం కనుకే తెలంగాణా లో చంద్రబాబు పర్యటనలడ్డుకుంటూ వంతులవారీగా తెదేపా మీద తిట్ట్ల దండకం చదివేది.
ఈ తమాషా చూస్తుంటే చిన్నపుడు చదివిన బ్రాహ్మణుడు-మేక పిల్ల కధ గుర్తొస్తున్నది.బ్రాహ్మణుడు మేక పిల్లతో వెళ్ళ్తుంటే మైలుకొక దొంగ నిల్చొని కుక్కను కట్టేసి తీసుకెల్తున్నావని గేలి చేస్తూ ఉంటారు.చివర్లో బ్రాహ్మనుడు మేకనొదిలేసి వెళ్ళిపోవడం ఆ నలుగురు మేకను కోసుకొని తినడం అందరికీ తెలిసిన కధే.ఇప్పుడు జరుగుతున్న కధలో కూడా కెసిఆర్,కోదండరాం,ఓయు జాక్,కాంగ్రెస్ కలిసి తెలంగాణా అనే మేకను కోసుకొని తినడం ఖాయం.
ప్రతేక తెలంగాణా ఇస్తే ఆంధ్రాలో ఏ పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమేమీ కాదు.ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సంభవిస్తుంది. కేంద్రం లో మమతా బెనర్జీ(గూర్ఖాలాండ్) ,శరద్‌పవర్(విధర్భ),కరునానిధి (వన్నియార్ దేశం),తమ తమ రాష్ట్రాల్లో ఉన్న ప్రతేక రాష్ట్రాల కోరికల ద్రుష్ట్యా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించక తప్పదు.అయినా కాంగ్రెస్ పార్టీ మూర్ఘంగా ముందుకెళితే కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయం.పైన విశదీకరించిన కారణాలమూలాన కాంగ్ర్స్‌పార్టీ పరిస్థితి ముందు గొయ్యి,వెనుక నుయ్యి.
డిసెంబర్ 9 న చిదంబరం చేసిన అనాలోచిత ప్రకటన పరిణామాలకు బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం మీదా చంద్రబాబు మీదా చేసే దుష్‌ప్రచారం నపుంసక ఆగ్రహజ్వాల మాత్రమే.సమస్యలను నాన బెట్టడం వాయిదావెయ్యడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య . ఆ ప్రయత్నం లో భాగమే శ్రీక్రుష్న కమిటీ ఏర్పాటు.
వివిధ రంగాల్లోని నిపుణులతో కూర్చిన కమిటీ ఆంధ్రప్రదేష్ అవతరణ తర్వాత ప్రాంతాలవారీగా జరిగిన అభివ్రుధ్ధి,ఆదాయ వ్యయాల నిగ్గు తేలుస్తుంది కాబట్టి వేర్పాటువాదుల అభద్ద ప్రచారాలకు ఇకనైనా తెరపడుతుందని ఆశిద్దాం.
తెలంగాణా ప్రజలు ఇకనైనా నిజమైన దోషులను గుర్తించి (కాంగ్రెస్,టిఆర్యస్,కోదండరాం తదితరుల) మాయగాళ్ళ ఉచ్చు లో పడకుండా హైదరాబాద్ పునర్‌వైభవానికి, తద్వారా ఆంధ్రప్రదేష్ అభివ్రుధ్ధిలో భాగస్వామ్యులౌతారని ఆసిస్తూ.(నా స్నేహితుడు చలసాని శిశిర్ సలహాలు తీసుకొని వ్రాసిన వ్యాసం)

ఆలీబాబా-40దొంగల కధ -చంద్రబాబు అజ్ఞానం


చంద్రబాబు ఈ మధ్య పాల్గొన్న సమావేశాల్లో తరచుగా అంటున్నది ఆలీబాబా పోయాడు , 40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచుకొంటున్నారని . ఈ అభియోగానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల్నించి ఏమీ ప్రతిక్రియ  వ్యక్తం కాకపోవవడం తో మనం చిన్నప్పుడు చదువుకున్న ఆలీబాబా40దొంగల కధ చాలామందికి తెలియకపోవడమో లేక వాళ్ళ స్మ్రుతి పధం లోంచి చెరిగిపోయిందనో  భావిస్తూ ఈ కధ క్లుప్తం గా క్రింద వ్రాస్తున్నాను.
ఆలీబాబా అనే నిరుపేద కట్టెలకోసం తన గాడిదతో అడవికి వెళ్ళడం,ఒక దొంగలముఠా తమ నిధిని దాచుకొన్న గుహను చూడటం,వాళ్ళ రహస్య కోడ్ వినడం వాళ్ళు వెళ్ళిపోయినతరువాత ఆ గుహలోనుంచి కొంత బంగారం సంగ్రహించి గాడిద మీద ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది.ఈ విషయం తెలుసుకొన్న ఆలీబాబా అన్న దురాశతో ఆ గుహలో దూరి రహశ్య కోడ్ మరిచిపోయి దొంగల చేతికి చిక్కి హతమవడం ,ఆలీబాబా ఆ శవాన్ని ఒక దర్జీ సాయంతో దహన సంస్కారాలు నిర్వర్తించడం ,అదే దర్జీ సాయంతో దొంగలు ఆలీబాబా ఇల్లు గుర్తించి మారు వేషంలో 38 నూనె పీపా లతో (ఇద్దరు దొంగలను నాయకుడే చంపుతాడు) ఆలీబాబా ఇంటిలో ఆశ్రయం పొందటం , మోర్జినియా  (ఆలీ బాబా ఇంట్లో పనిమనిషి) సమయస్పూర్తితో కాగే నూనె పోసి నాయకుడు మినహా అందరినీ హతమార్చడం . నాయకుడు పారిపోయి మళ్ళా ప్రతీకారేఛ్ఛతో కోర్గియా అనే మారు పేరుతో ఆలీబాబా ఇంట్లో ప్రవేసించడం , న్రుత్య ప్రదర్శన లో భాగంగా చురకత్తితో పొడిచి మోర్జినియా దొంగలముఠా నాయకుడిని హతమార్చడం , ఆలీబాబా మోర్జినియా  ను తన కోడలిగా చేసుకోవడంతో కధ సుఖాంతమవుతుంది.
చంద్రబాబు రాశేరె గురించి మాట్లాడుతూ ఆలీబాబా పోయాడు ,40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అనడం ఆయన అజ్ఞానాని  బయటపెట్టుకున్నట్లు గా నాకనిపిస్తోంది . పైకధలో ఆలీబాబా హీరో ,దొంగల నాయకుడు విలన్. చంద్రబాబు ఇదే పేరుతో ఉన్న రామారావు గారి సినిమా చూస్తే కనీసం కధన్నా తెలిశేది . ఈ విధంగా మాట్లాడి చంద్రబాబు తన అజ్ఞానాన్ని వెల్లడి చేయరని ఆశిస్తూ .

వెన్ను పోట్లు దాని పుట్టు పూర్వోత్తరాలు



రాజకీయాల్లో వెన్నుపోట్ల శకం ఆరంభమైనది ఇందిరాగాంధీతోనే . లాల్ బహదూర్‌శాస్ట్రి చనిపోగానే అందరికంటే సీనియర్ మరియు ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు అయిన మొరార్జీ ను పక్కనబెట్టి ఇందిర ను ప్రధానమంత్రి ని చేసింది కామరాజ్ నేత్రుత్వం లోని సిండికేట్. తననా పదవిలో కూర్చోబెట్టిన సిండికేట్ కు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా నామరూపాల్లేకుండా చేసింది ఇందిరాగాంధీ . సంజీవరెడ్డి ని దేశాధ్యక్షుడు గా తనే ప్రతిపాదించి అంతరాత్మ ప్రభోదం అనే కొత్త దుస్సంప్రదాయంతో వి వి గిరి ని గెలిపించి సంజీవరడ్డికి వెన్నుపోటు పొడిచింది ఇందిర . తనకు కేంద్రం లో పదవి ఇవ్వలేదనే అక్కసుతో తెలంగాణా ప్రజా సమితి ని స్థాపించి తన వాఘాటితో ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఎన్నికల్లో పది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని పదవీ వ్యామోహంతో మూకుమ్మడిగా కాంగ్రెస్స్ లో దూరి తెలంగాణా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చెన్నరెడ్డి . ఇందిర చే ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి గా నియమింపబడ్డ వెంగళరావు ఆమె దివి సేమ ఉప్పెన బాధితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు పదవిలో లేదు కాబట్టి విజయవాడ మున్సిపల్ అతిధిగ్రుహం గది ఇవ్వకుండా నిరాకరించి ఆమెకు వెన్ను పోటు పొడీచాడు .
ఆంధ్రప్రదేశ్‌నుంచి జనతా పార్టీ తరఫున ఏకైక పార్లమెంట్ సభ్యుడు గా గెలిచి పార్టీ తనను పార్లమెంట్ స్పీకరు గా తరువాత దేశాధ్యక్షుడు గా గెలిపిస్తే జగజీవనరాం ను ప్రధానమంత్రి అవకుండా కాలడ్డి తదుపరి మధ్యంతర ఎన్నికల్లో ఇందిర ప్రాధాని గా గెలవడానికి పరోక్షంగా దోహదపడి జనతా పార్టీకు వెన్నుపోటు పొడిచాడు సంజీవరెడ్డి .రాజీవ్‌గాంధీ సిఫార్సుతో 1983 లో పిసిసి అధ్యక్షుడు గా నియమించబడీ , అదే రాజివ్‌గాంధీ చే నియమించబడిన ముఖ్యమంత్రుల మీద అసమ్మతి కార్యక్లాపాలు నడిపి , హైదెరాబాద్‌లో మతకలహాలు స్రుష్టించి రాజీవ్ కు వెన్నుపోటు పొడిచాడూ రాజశేఖరరెడ్డి .లెగిలేటివ్ కౌన్సిల్ లో తన వాగ్ధాటి తో చెన్నారెడ్డి ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు గుప్పించి , చీల్చి,చెండాడి వారం రోజులు తిరక్కుండానే కాబినెట్ లో చేరి  ఆనాటి  ` ఈనాడు `    ఛీఫ్ ఎడిటర్ గజ్జెల మల్లారెడ్డి చే మగలంజ గా శ్లాఘించబడి నీతి ,నిజాయతీలకే వెన్నుపోటు పొడిచాడు రోశయ్య .
తెలుగు దేశం పార్టీ ద్వారా వెలుగు లోకి వచ్చి మంత్రి గా డెపూటీ స్పీకర్‌గా పదవులనుభవించి తనివి తీరని అధికార దాహంతో పార్టీ కు వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి , తెలంగాణా అనే భావోద్వేగ నినాదంతో కాగ్రెస్స్ తో జతకట్టి , ఎన్నికల్లో గెలిచి పదవులనుభవించి కాంగ్రెస్స్ తో వెన్నుపోటు పొడిపించుకొని , గత్యంతరం లేక టిడిపి తో జతకట్టి 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రాపకం తో నే గెలిచి ,టిడిపి ను తెలంగాణా లో భూస్థాపితం చేస్తానని రోజూ ఒక పోటు పొడుస్తూనే ఉన్నాడు కెసిఆర్.
ఇక జార్ఖండ్ లో శిబు సొరేన్ ఒక సారి బిజెపి కి మరో సారి కాంగ్రెస్  కు మార్చి మార్చి పోట్లు పొడుస్తూ ఉన్నాడు . తమిళనాడు లో కాంగ్రెస్  రెండు ద్రవిడ పార్టీలతో ఒకదాని తర్వాత ఒక దాన్ని పొడుస్తూనే ఉంది . కర్ణాటక లో ప్రస్తుత పరిస్థితి బిజెపి, కాంగ్రెస్,జెడియస్ ల లో ఎవరు, ఎవరిని, ఎప్పుడు  వెన్ను పోటు పొడుస్తున్నారో వాళ్ళకే తెలియనంత హాస్యాస్పద, జుగుప్సాకర రీతిలో మూడు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి .
అణుఒప్పందం బిల్లు విషయం లో సొంత పార్టీ వాళ్ళకంటే   ఎక్కువ మద్దతిచ్చి ,ప్రతి గండం లోనూ బాసటగా నిలిచిన లాలూప్రసాద్ ను బీహార్ వెనుకబాటుకు మూల కారణంగా చూపుతున్న సోనియా పెద్ద వెన్నుపొటుదారు . అధికార దాహంతో ఎంతో క్రమ శిక్షణ  గల  తల్లి లాంటి పార్టీ కి వెన్నుపోటు పొడిచాడు మాజీ స్పీకర్ సోంనాథ్ ఛటర్జీ  .ఇక చిన్నా చితకా రాజకీయనాయకుల చరిత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మందా జగన్నాధం , ఆదికేశవులనాయుడు చంద్రబాబుకు  , బొత్సా సత్యనారాయణ మరియూ తులశీరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబానికి పొడిచిన పోట్లు పెద్దవే.
చంద్రబాబు అసెంబ్లీ బల నిరూపణలో శాసనసభ్యుల మద్దతుతోనే గెలిచి ముఖ్యమంత్రి  అయ్యాడనేది  జగమెరిగిన సత్యమే . 1996, 1998, ల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు . 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తో కలిసి యంటీఆర్‌టిడిపి అనే పేరుతో పోటీ చేసిన లక్ష్మీపార్వతిని ప్రజలు తిరస్కరించారనే విషయం అందరికీ గుర్తుండే వుంటుంది . 1999 లో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబును ఇంకా వెన్నుపోటుదారునిగా చిత్రించడం రోశయ్య లాంటి ఫ్యూడల్ భావాలతో వ్యక్తిపూజ  చేసే  నాయకునికి  తగనిపని .
ఈ ప్రజాస్వామ్య వ్యవస్తలో వెన్నుపోటు అనే పదానికి అధికారికత (sanctity) లేదనేది నా నిశ్ఛితాభిప్రాయం  . పైన ఈ అభియోగం మోపబడ్డ రాజకీయనాయకుల్లో చాలామంది తదనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచినవాళ్ళే . ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయనాయకుడు ఆరోజు ఉన్న పరిస్థితులకనుగుణంగా తమ విచక్షణను వినియోగించి , తమ శ్రేయస్సు కోసం, కొంత సమాజశ్రేయస్సు కోసం పరస్పర విరుధ్ధ నిర్ణయాలను తీసుకొనవలసి వస్తుంది . వాటన్నిటినీ  వెన్నుపోట్లుగా అభివర్ణిస్తే ప్రతి రాజకీయనాయకుడికీ చేతిలో  కత్తి ఉంటుంది వెన్నులో పోట్లుంటాయి .

పేరు మార్పు - ప్రగతి పధం లో మన రాష్త్రం

ప్రియతమ ముఖ్యమంత్రి రోశయ్య గారికి ,
తెలుగు లలిత కళాతోరణం ముందు రాజివ్ పేరు తగిలించినందుకు మీకు నా మనహ్‌పూర్వక అభినందనలు . మీరు రాజశేఖరరెడ్డి గారి  అడుగు జాడలలో   నడుస్తూ ఆయనకు మించిన కీర్తి(?) ని గడించాలని కోరుకొంటున్నాను .మీరు ఇదే స్పూర్తిని కొనసాగించి ప్రతి జిల్లా పేరు ముందు రాజివ్ పేరు గాని ఇందిర పేరు గాని తగిలించండి .ఇందిరా పొట్టిశ్రీరాములు   నెల్లూరు జిల్లా,రాజివ్‌వైయస్సార్ కడప జిల్లా  ల లాగా అన్న మాట .ప్రతి మండలానికి ముందు సోనియా ,రాహుల్,ప్రియాంకా పేర్లు , ప్రతి గ్రామ పంచాయతీ ముందు ప్రియాంకా పిల్లల పేర్లు (అవి నాకు తెలియనందుకు నన్ను మన్నించాలి ) తగిలించండీ .ఇక ప్రతి బస్ స్టాండ్ , రైల్వే స్టేషన్లకు ( వాటిలో ఉన్న సులభ కాంప్లెక్ష్ లకు గూడా) గాంధీల కుటుంబం లో ఎవరో ఒకరి పేరు తగిలించండి . ప్రభుత్వ ఆసుపత్రులకు (రాజీవ్ NIMS   ఆసుపత్రి , ఇందిరా ఉస్మానియా ఆసుపత్రి ) ,ప్రభుత్వ భవన సముదాయాలకు (రాజీవ్ సచివాలయం, ఇందిరా బూర్గుల రామక్రుష్నారావు భవనం ), ప్రభుత్వ రంగ సంస్థల  (ఇందిరా BHEL , రాజీవ్ ECIL ), అన్ని మున్సిపాలిటీల (రాజీవ్ GHMC , ఇందిరా VUDA)పేర్లు మార్చమని సిగ్గు లజ్జ లేని తెలుగు వాడిగా మిమ్ములను డిమాండ్ చేస్తున్నాను.
ఇప్పటికే ఉన్న ప్రైవేటు సంస్థలన్నిట్కీ విధిగా పేర్లు మార్చాల్సిందే (రాజీవ్ మైక్రోసాఫ్ట్, ఇందిరా ఇన్‌ఫోసిస్,సోనియా సత్యం ). ఇక్కడ ఏ బుధ్ధిమాలినవాడెవడన్నా   కొత్తగా పరిశ్రమలు పెడతానని వస్తే ఈ విధంగా పేర్లు పెడితేనే రాయితీలు ఇస్తామని ప్రకటించండి .అలా సిధ్ధమైన పారిశ్రామికవేత్తలకు ఎంత భూమి కావాలన్నా ఉచితంగా ఇస్తామని చాటండి.(రైతులెలాగూ వర్షాలు పడకో,వరదలొచ్చో , ఎరువులు దొరక్కో , మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అప్పు చేసో , మిల్లర్లు ధాన్యం కొనకో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.వాళ్ళ  భూమినంతా జాతీయం చేద్దాం.సర్కారు భూమి అంతా మీ ముందాయన వదిలి పెట్టకుండా భోంచేశాడు  గదా  ). ఇక నుంచి మన రాష్ట్రం లో పుట్ట బోయే ప్రతి శిశువు కూ గాంధీ కుటూంబం లో వాళ్ళ పేరే ఏదో ఒకటి పెట్టాలని శాసనం చేయండి .
ఆ చేత్తోనే సోనియా గాంధీ గారికి  గఠ్ఠిగా ఉత్తరం వ్రాయండి . మన పార్టీ అధ్యక్షుడు గా చేసిన దేవకాంత్ బారువా గారన్నట్లుగా  ఇండియా పేరును గూడా ఇందిరా గా మార్చమని . వందేమాతరం , జనగణ మన ల లో సవరణలు చేసి వీలైనన్ని సార్లు ఇందిరా ,రాజీవ్ పేర్లను దూర్చమని గాఠ్ఠిగా డీమాండ్ చేస్తూ ,
                                                                        ఇట్లు
                                                         మీ  వేపకాయ వెర్రినాధం
                      జై ఇందిరా హింద్  ,  వందే రాజీవ్ మాతరం

టీవీ చూస్తే పిచ్చెక్కుతుందా ?

బ్రిస్టల్ యూనివర్సిటీ లోని సెంటర్ ఫర్ ఎక్సెరసైజ్, నుట్రిషన్ అండ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ ఏంజి పేజ్ పరిశోధనల ద్వారా తేలింది ఏమిటంటే పిల్లలు శారీరక కార్యకలాపాల్లో ఎంత చురుగ్గా పాల్గొన్నా రనే విషయంతో సంబంధం లేకుండా రెండు గంటలు టీవీ చూసినా,కంప్యుటర్ వాడినా పది పదుకొండేళ్ళ వయసున్న పిల్లలకు మానసిక పరమైన సమస్యలు వస్తాయని, ఎంతో కొంత మేరకు పిచ్చెక్కు తుందని .
ఈ పరిశోధనా ఫలితాలు చూసింతర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలకు దీనికి ఏమన్నాసంబంధం ఉందా అనే అనుమానం నాలో తలెత్తింది.బేస్ బాల్ బ్యాట్ తో ఆడ పిల్ల తల చితక్కొట్టి , వేరే అబ్బాయితో సన్నిహితం గా ఉంటం చూల్లేకే అలా చేయాల్సి వచ్చిందని టీవీల్లో సమర్ధ్ధించు కోవడం చూశాక భయంకరమైన పిచ్చి లేకపోతే అలా చేయడం సాధ్యమా? అనిపించింది.ఈ కోవకే చెందిన పిచ్చి పనులు ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు , కత్తి తో గొంతు కొయడాలూ,ప్రేమిస్తావా? చస్తావా ? అని వెంట బడతాలు నిత్యకృత్యాలు అయిపోయాయి.
వేరే తరహా పిచ్చి పనులు కూడా చాలా చూస్తున్నాం . ఒక రాజకీయనాయకుడు పోయాడని , ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయలేదని , ఆయన్ను రాజకీయం గా ఇబ్బంది పెడుతున్నారని,ఎవరో ఒక స్వార్థపరుడు తన వ్యక్తిగత ఎజండా తో నిరాహార దీక్షకు దిగాడు అనో,ఒక రాజకీయ నాయకుడిని అరెస్టు చేసారనో,ఒక అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయిందని, ఒక ప్రత్యేక రాష్ట్రం రాలేదనో, ఆతహత్యాలు చేసుకుంటున్న యువతీయువకుల గురించి రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ రకమైన పెడ ధోరణులకన్నిటికీ 90 వ దశకం లో వచ్చిన టీవీ విప్లవమే కారణమా ? లేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఆర్థిక అసమానతలే అగ్నికి ఆజ్యం పోసి యువతలో ఈ విధంగా విక్రుత రూపంలో బహిర్గతమవుతున్నదా ? ఈ సమస్య గురించి తల్లితండ్రులు, సామాజిక శాస్త్రవేత్తలు , మానసిక నిపుణులు ఒక వేదిక మీదకు వచ్చి చర్చించి తగు పరిష్కారాలను సూచించ వలసిన అవసరం ఉన్నది
చిన్న పిల్లల తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. మీ పిల్లలు టీవీ ముందు, కంప్యూటర్ ల ముందు గడిపే సమయాన్ని వీలైనంతవఱకు తగ్గించండి . పిల్లలకు కధలు చెబుతూ , వాళ్ళ ఆట పాటల్లొ పాలు పంచుకొంటూ వాళ్ళను పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చి దిద్దండి . పిల్లలకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేదనికంతే వారితో మీరెంత సమయం గడుపుతున్నరో అదే ప్రేమకు కొల బద్దగా తీసుకొంటారు.(ఉదా:-ఒక యువకుడు తనకు కొనిపెట్టిన మోటర్ సైకిల్ ను తుడవడానికి అది మెరవడానికి ఎంతో సమయం వెచ్చిస్తాడు కాని , నువ్వంటే  నాకిష్టం అని దానితో చెప్పడు ) . మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లొనే ఉందని గ్రహించండి . prevention is better than cure . ( కంటి పాపలై దంపతులెపుడూ  చంటి పాపలను సాకాలోయి  అనే ఘంటసాల పాత పాట సందర్భానుచితం అని నమ్ముతూ)

తెలుగు తల్లి ముద్దు బిడ్డలా - తెలంగాణా నరమేధం లొ సమిధలా

తెలంగాణా అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు  రఘుమారెడ్డి నాయకత్వం లో 30మంది అమరవీరుల కుటుంబ సభ్యులు తెలంగాణా భవన్ ముందు ధర్నా చేసి తెరాస కు వ్యతిరేకం గా నినాదాలు చేసినట్లు , తెలంగాణా అమరవీరుల పేరిట దోచుకోవడం ఆపండి , చావులు మాకు పదవులు మీకా ? అని ప్లకార్డులు ప్రధర్సించినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీ కాంతాచారి తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, తన తనయుడి చావుకు తెరాస కారణమని ఆక్రోశించిందని , తెరాస పార్టీ వాళ్ళు తన కొడుకు ను వెంటేసుకొని తిప్పటం మూలాన అసలే ఉద్యేగాస్వభావు దైనందున ఆత్మహత్య చేసుకోన్నాడని, ఈ బలిదానానికి వెల కట్టవద్దని విలపించింది అంటే ఎంత కఠిన హ్రుదయులకైనా గుండె ధ్రవించక మానదు.
పరిస్థితులు ఇంత హ్రిదయ విదారకం గా ఉంటె కెసిఆర్ చేసిన ప్రకటన ` తెలంగాణా ఇవ్వకుంటే మానవ బాంబులు అవుతాం` అనేది పుండు మీద కారం చల్లినట్లు గా ఉంది.ఏమిటీ బాధ్యతా రాహిత్యం ? ఏమిటీ వాచాలత్వం? ఏమిటీ అరాచకత్వం ?
తమంత తాము మేధావులని పిలిపించుకొనే కోదండరాం, జయశంకర్ లాంటి నాయకులు ఎందుకిలా యువతను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు? తెలుగు తల్లి ముద్దు బిడ్డలైన వీళ్ళంతా మట్టిలో కలసిపోయిన మాణిక్యాలు. ఈ తెలుగు తల్లి ముద్దు బిడ్డల మనసుల్ని కలుషితం చేసి తెలంగాణా బిడ్డలు గా పిలిచే అధికారం మీకేవరిచ్చారు? ఆత్మహత్య లను ప్రోత్సహించడం కూడా నేరమని ఈ కుహనా మేధావులకు తెలియదా? చేతికందిన బిడ్డలు ఒక ఉద్యేగా భరిత వాతావరణం లో భయంకరమైన మ్రిత్యువు ఒడి లోకి జారిపోతే ఆ తల్లితండ్రుల ఘోష,క్షోభ మీ కర్ణ పుటా లను బద్దలు చేయటం లేదా?
ఇకనైనా ఈ స్వార్థపూరిత, నిరర్థక నరమేధం ఆపండి.ఓ దగా పడిన తల్లులారా , తండ్రులారా మీ / మా అనుంగు బిడ్డల బలిపీటం మెట్లెక్కి సింహాసనం అధిష్టించాలనే క్షుద్ర రాజకీయనాయకులను తరిమి తరిమి కొట్టండి .

గద్దర్ కు ప్రశ్నలు - నా జవాబులు


7 తారీఖు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో తిగుళ్ల కృష్ణమూర్తి గారు `గద్దర్ ఫ్రంట్ రేపుతున్న ప్రశ్నలు` అనే వ్యాసం లో చాలా ప్రశ్నలు రేపారు . 
గద్దర్ తో సహా ఫ్రంట్ లోని నాయకులంతా ఏదో ఒక సందర్భం లో కె సి ఆర్ కు మద్దతు ప్రకటించినవారు కాదా ?తో మొదలుపెట్టి తెలంగాణా ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి అని తెలంగాణా వాదులంతా నమ్ముతున్న తెలుగుదేశాన్ని కూకటి వెళ్లతో సహా పేకలించి వేసే పనిలో కేసిఆర్ తలమునకలై ఉన్నప్పుడు ఆయన చాప క్రిందకు నీరు తెచ్చి ,ఆత్మ రక్షణలో పడేసే రీతిలో ఇప్పటికిప్పుడు ఫ్రంట్ ఆవిర్భవించటం లో అంతరార్థం ఏమిటి ? దాకా ఎన్ని నయ వంచనలో ఎంత అతి తెలివి ప్రశ్నాలో ? 
కేసిఆర్ పార్టీ లోంచి వచ్చాడో?మంత్రి పదవిలో ఉంచి నంత కాలం చాలా మంచి పార్టీ . డెప్యుటీ స్పీకర్ పదవి ఇస్తే నచ్చ బయటకు వచ్చి , కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి పదవి నలంకరించి తర్వాత ఎన్నో కుప్పిగంతులేసి తన పార్టీ వాళ్ళతో, ఉప ఎన్నికల్లో ప్రజలతో ఛీ కొట్టించుకొని కాంగ్రెస్ వాళ్ళు తన్ని తగలేస్తే , అక్కున జేర్చుకొని మహా కూటమిలో భాగస్వామి ని చేసి కోరిన గొంతేమ్మకోరికలన్ని తీర్చి మద్దతిచ్చి పార్లమెంట్ కు పంపితే , వేళ కూకటివేళ్ళతో పేకలించవలసిన పార్టీ అయిందా ? ఎంత విశ్వాస ఘాతకం? ఒక ప్రజా గాయకుడు తెలంగాణా తేవడం కోసం ఫ్రంట్ పెడితేనే చాప క్రిందకు నీళ్ళొచ్చి , ఆత్మరక్షణ లో పడితే నాయకుడి సత్తా ఏమిటో తెలియదంలేదా? 
` ప్రజా గాయకుడు ఎంత వరకు ప్రజానాయకుడు అవుతాడన్నది అసలు సంగతి`  
నాయకత్వం ఎవడిఆబ్బసొత్తా? అసలు సంగతేంటో చూస్తే గదా తెలిసేది ! 
`మంచో చెడో ,ఒంటి గానో జంట గానో ,ఎత్తుగాడో మెత్త బడో , తెలంగాణా ఉద్యమాన్ని కేసిఆర్ పదేళ్ళనుంచి బహుముఖం గా విస్తరించారు ` 
చాలా బాగా చెప్పారు గాని విస్తరించింది మాత్రం కేసిఆర్ కుటుబం . 
`సుదీర్ఘ ఉద్యమాన్ని ఫలితం దాకా తీసుకొచ్చి వ్యక్తి ప్రయోజన ఫలం లో వాటా కాంక్షించటం రాజకీయాలలో అసహజమేమీ కాదు ` 
జగన్ వాళ్ళ నాయన పోయిన తర్వాత రోజూ మొత్తుకొనెది అదే కదా ! 
`రాజకీయ పార్టీ అక్రమ సంపాదన తప్పేమీ కాదు.కెసి ఆర్ ఉద్యమ బలాన్ని చూపించి సంపాదించారు . అక్రమ సంపాదన లేకుండా రాజకీయాలు , ఉద్యమాలు నడపడం అయ్యే పనేనా ?` 
ఎంత బహిరంగం గా , నిర్లజ్జగా, అక్రమ సంపాదనను సమర్ధించే యన తెంపరితనానికి నా జోహార్లు. రాబోయే తెలంగాణా రాష్ట్రం లో అవినీతి నిరోధక శాఖ , విజిలెన్స్ లాంటి వాటితో పనే లేదన్నమాట . 
`మిగతా ఉద్యమకారులు కూడా కొడుకులు కూతుల్ల ఉద్యోగాలు మాన్పించి ఉద్యమం లోకి తీసుకొస్తే కాదన్నవారెవ్వరు?` 
మహానుభావుడు 70 సం లేటుగా పుట్టాడు . లేకుంటే మహాత్మా గాంధీ కి కూడా ఇదే ఉపదేశం చేసేవాడే. 
`మా లో మేము కోట్లాడుకున్నప్పుడు మేం ఇదుగురమ్,వారు నూరు మంది . మరెవరైనా మాపైకి వస్తే మాత్రం మేం 105 మంది అన్న ధర్మరాజు యుద్ధనీతిని గద్దర్ కు ప్రత్యేకం గా చెప్పనక్కర లేదు.` 
తెలంగాణా నాయకుల్లో పాండవులెవరో , కౌరవులెవరో యన చెప్పలేదు కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం కురుక్షేత్ర యుద్ధం తప్పదని చెప్పకనే చెప్పాడు . 
`తెలంగాణా కు శత్రువు ఎక్కడో లేడు. మన తెలంగాణా లోని కలసి నడవని అనైక్యతలోనే,ఎరకు ఆశ పడే అమాయకత్వం లోనే,అమ్ముడు పోయే తత్వం లోనే ,ఆరంభశూరత్వ ఆశక్తత లోనే ` 
సర్వ అవలక్షణాలు ఉన్నాయని ఒప్పుకుంటూనే స్వయం పాలన కావాలి అని అనడం సబబా ? 
`నాయకుడు లేక పోయినా పని చెడిపోతుంది , అనేక మంది నాయకులున్నా అంతే సంగతులవుతుంది ` 
అసలు మీకు కావాల్సినది ప్రజాస్వామ్యమా? దొరల రాజ్యమా ? 
 
ఇంత అపరిపక్వ . శూన్య సిద్ధాంత ,బరితెగించిన లేకి నాయకత్వమా తెలంగాణా కు కావలసినది ? విజ్ఞ గల తెలంగాణా వాదులారా ఆలోచించండి .